జంపింగులపై వైసీపీ కన్ను.. అందరూ ఒకేలా లేరా..?
పార్టీలు మారుతున్న నాయకులపై వైసీపీ నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారా ? వారి ఆనుపానులపై నిరంతరం కన్నేశారా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. రాష్ట్రంలో [more]
పార్టీలు మారుతున్న నాయకులపై వైసీపీ నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారా ? వారి ఆనుపానులపై నిరంతరం కన్నేశారా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. రాష్ట్రంలో [more]
పార్టీలు మారుతున్న నాయకులపై వైసీపీ నేతలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారా ? వారి ఆనుపానులపై నిరంతరం కన్నేశారా ? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ సీనియర్లు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ప్రతిపక్షాల నుంచి వ్యక్తమవుతున్న విమర్శలను వైసీపీ సర్కారు సీరియస్‌గా తీసుకుంటోంది. పైకి ఎవరికీ కౌంటర్లు ఇవ్వకపోయినా జగన్ మాత్రం అటు ప్రతిపక్షాల వ్యాఖ్యలను, ఇటు వ్యతిరేక మీడియా రాస్తున్న కథనాలను కూడా సీరియస్‌గానే తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా కథనాలను స్వయంగా కూడా జగన్ చదువుతున్నారని తెలుస్తోంది.
అంతర్గత విషయాలు…..
ఈ క్రమంలో పార్టీ అంతర్గతంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు.. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూడా వెంటనే టీడీపీకి చేరుతున్నాయని జగన్ భావిస్తున్నట్టు అంతర్గతంగా చర్చకు వచ్చింది. ఇటీవల ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా అత్యంత గోప్యంగా ఉంచిన సమాచారం మీడియాకు లీక్ కావడంపైనా జగన్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారం వెనుక కొందరు జంపింగ్ నాయకులు ఉన్నారని, వారు ఉద్దేశ పూర్వకంగానే పార్టీలు మారి.. వైసీపీలోకి వచ్చారని కొందరు నేతలు పసిగట్టినట్టు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా జగన్‌తో అత్యంత చనువు ప్రదర్శిస్తూనే.. ఆయనకు జై కొడుతూనే కొందరు ఇలా చేస్తున్నారని వైసీపీ నాయకులు అంతర్గత చర్చల్లో చెప్పుకొంటుండడం గమనార్హం.
ముందుగానే తెలిసిపోతుండటంతో…..
టీడీపీ అధినేత చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని.. కొందరు నేతలను ఆయన పనిగట్టుకుని వైసీపీలో చేర్చినట్టు చెబుతున్నారు. అంటే.. వైసీపీ అంతర్గత వ్యవహారాలను సైతం తెలుసుకుని.. వాటికి కౌంటర్లు ఇవ్వడం లేదా ముందుగానే విషయాలు తెలుసుకుని జాగ్రత్త పడడం వంటివి చేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి వారి వల్లే పార్టీ, ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ముందుగానే వెల్లడవుతున్నాయని.. సదరు వ్యక్తులు కూడా అలెర్ట్ అవుతున్నారని అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామం.. పార్టీలోను, ప్రభుత్వంలోనూ చర్చకు వచ్చింది. ఏదేమైనా జంపింగుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. అవసరమైతే.. కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడరాదని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.