ఆ పని చేయకుండా ఉంటే తిప్పలుండేవి కావా?
అద్భుత మెజారిటీ తో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడపై ఇప్పుడు రాజ్యసభకు అభ్యర్థుల ఎంపిక కత్తి వేలాడుతుంది. [more]
అద్భుత మెజారిటీ తో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడపై ఇప్పుడు రాజ్యసభకు అభ్యర్థుల ఎంపిక కత్తి వేలాడుతుంది. [more]
అద్భుత మెజారిటీ తో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసిపి అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెడపై ఇప్పుడు రాజ్యసభకు అభ్యర్థుల ఎంపిక కత్తి వేలాడుతుంది. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా ఆశావహుల ఆశలను తీర్చడం ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ కు అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజ్యసభకు నోటిఫికేషన్ విడుదలకు ముందే తమ అభ్యర్థిత్వాలు పరిశీలించాలంటూ జగన్ ముందు చాంతాడు అంత లిస్ట్ ఇప్పటికే పంపారు ఆశావహులు. దాంతో దీనిపై వారం రోజుల పాటు అధినేత కసరత్తు చేసినా కానీ ఫైనల్ చేయలేదని పార్టీ వర్గాల నుంచే సమాచారం. ఎన్నికల ప్రచారంలో జగన్ చాలామంది నేతలకు శాసనమండలి కి టిక్ పెట్టేశారు.
మండలి రద్దు తో …
రాజ్యసభకు ప్రత్యేకంగా హామీ ఇవ్వనప్పటికి మండలి రద్దుతో ఎదో ఒక బెర్త్ కేటాయించాలిసిన పరిస్థితి ముఖ్య నేతల విషయంలో ఏర్పడింది. దీనితోపాటు మండలి రద్దు అయితే జగన్ కి అత్యంత ఇష్టులైన మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ వంటివారి కి మంత్రి పదవులు సైతం గోవిందా కానున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరికి ఎదో ఒక మంచి పదవి ఇవ్వలిసిన బాధ్యత జగన్ పై పడింది. ఇప్పటికే బోస్ కి క్యాబినెట్ ర్యాంక్ తో సమానమైన ప్రాంతీయ ఆర్ధిక మండళ్ళ లో ఒకదానికి ఛైర్మెన్ గిరి ఇవ్వనున్నట్లు పార్టీలో ప్రచారం నడుస్తుంది. మోపిదేవి ని మాత్రం రాజ్యసభకు పంపుతారని అంటున్నారు.
ఆశావహుల్లో వీరు …
ఇక ఆశావహుల లిస్ట్ లో బీద మస్తాన్ రావు పేరు జగన్ దాదాపు బిసి కోటా నుంచి ఫైనల్ చేశారని టాక్. అలాగే బిజెపి నుంచి వైసిపి లోకి దూకిన గోకరాజు గంగరాజు కి బెర్త్ ఖరారు అయినట్లు ప్రచారం సాగుతుంది. ఇక మిగిలిన వాటిల్లో ఎస్సి, ఎస్టీ, మైనారిటీ, కాపు లలో ఎవరికి జగన్ టిక్ పెట్టనున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. జగన్ సర్కార్ ఏర్పడిన నాటినుంచి అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేస్తున్నా అనే సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపిస్తున్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులను ఏర్పాటు చేసి ఎపి లో కొత్త చరిత్రకు సైతం ఆయన శ్రీకారం చుట్టారు. ఇక ప్రతి అంశంలోనూ అందరికి సమాన వాటా కులాల వారీగా పదవుల పందేరాన్ని జగన్ అందిస్తూ రావడంతో కీలకమైన రాజ్యసభ విషయంలోనూ ఇదే ఫార్ములా ముఖ్యమంత్రి పాటిస్తారని తెలుస్తుంది.
మాకేంటి అంటున్న రెడ్డి సామాజిక వర్గం …
అయితే క్యాబినెట్ బెర్త్ ల ఖరారులో రెడ్డి సామాజిక వర్గం గతంలో అలక వహించిన విషయం తెలిసిందే. రోజా వంటివారు అంతర్గత యుద్ధమే చేసి ఏపిఐఐసి పదవిని సైతం పొందారు. ఇప్పుడు కూడా రాజ్యసభ కు సంబంధించి రెడ్డి సామాజికవర్గానికి రాయలసీమ నుంచి డిమాండ్ రానుంది. ఈ నేపథ్యంలో జగన్ వారిని బుజ్జగిస్తారా లేక వచ్చే ఏడాది కోటా లో భర్తీ చేస్తా అని హామీనిస్తారా అన్నది చూడాలి.
బాబుకు ఏ సమస్య లేదు …
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సామాజికవర్గ సమీకరణాల సంగతి పక్కన పెట్టి క్యాష్ పార్టీలకే రాజ్యసభ అన్నట్లు వ్యవహరించారని ఆ పార్టీలో విమర్శలు చెలరేగాయి. టిజి వెంకటేష్ వంటివారికి టికెట్లు నేరుగా అమ్మేశారని అపవాదులు ఎదుర్కొన్నారు. శాసనమండలిలో నారాయణ వంటి వారికి బెర్త్ లు కేటాయించడం పట్ల అసంతృప్తులు వున్నా అధినేత నిర్ణయాన్ని తమ్ముళ్ళు పెద్దగా వ్యతిరేకించిన పరిస్థితి లేదు. సంఖ్యాబలం రీత్యా ఈసారి టిడిపికి ఒక్క స్థానం దక్కే ఛాన్స్ లేకపోవడంతో టిడిపి కి ఇప్పుడు ఏ సమస్య లేదు. జగన్ ముందు మాత్రం ఇది పెద్ద తలనొప్పి వ్యవహారమే అని చెబుతున్నారు. బెర్త్ దక్కని వారిని జగన్ ఎలా బుజ్జగించి దారికి తెచ్చుకుంటారు అన్నదే చర్చనీయంగా మారింది. శాసనమండలిని జగన్ రద్దు చేయకుంటే ఈ తిప్పలు ఉండేవి కావన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.