ఖాళీయే…లేదా…అన్నా….?
జగన్ సుదీర్ఘ పోరాటం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చీ రాగానే అనేకమంది ముఖ్యనేతలు పదవులు పొందారు. అప్పటి వరకూ పార్టీని సమర్థంగా [more]
జగన్ సుదీర్ఘ పోరాటం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చీ రాగానే అనేకమంది ముఖ్యనేతలు పదవులు పొందారు. అప్పటి వరకూ పార్టీని సమర్థంగా [more]
జగన్ సుదీర్ఘ పోరాటం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం వచ్చీ రాగానే అనేకమంది ముఖ్యనేతలు పదవులు పొందారు. అప్పటి వరకూ పార్టీని సమర్థంగా నడిపిన నేతలు ప్రభుత్వ పదవుల్లో చేరిపోవడంతో పార్టీ కార్యక్రమాలు దెబ్బతిన్నాయంటున్నారు. అంతేకాదు కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వారికి కనీసం అపాయింట్ మెంట్లు కూడా ముఖ్యనేతలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వైసీీపీలో విన్పిస్తున్నాయి. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీలో సేమ్ సీన్ కన్పించేది.
సీనియర్లు అన్నీ చూసుకుని….
వైసీపీ అధికారంలోకి రాకముందు అనేకమంది సీనియర్లు పార్టీని ముందుండి నడిపారు. జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలోనూ పార్టీ వ్యవహారాలన్నీ సీనియర్ నేతలు చక్కబెట్టేవారు. విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైవీ సుబ్బారెడ్డి తదితరులు పార్టీ కిందిస్థాయి నేతల అభిప్రాయలను విని వాటిని జగన్ కు చేరవేసేవారు. కానీ వైసీపీ అధికారంలోకి రావడంతో వీరందరికీ పదవులు లభించాయి.
పదవులు రావడంతో బిజీ….
విజయసాయిరెడ్డి ఢిల్లీలో కీలకంగా మారారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బిజీగా ఉన్నారు. దీంతో పార్టీ వ్యవహారాలను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇక బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు మంత్రి పదవిలో ఉండటంతో వారు కూడా క్యాడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో నేరుగా కొందరు నేతలు తాడేపల్లి లోని జగన్ నివాసానికి వచ్చి అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు.
పట్టించుకునే వారు లేక….
కొందరు సీనియర్ నేతలు తమకు పదవులు దక్కలేదన్న అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలను పక్కన పడేశారు. ధర్మాన ప్రసాదరావు లాంటి నేతలు క్యాడర్ కు అందుబాటులో లేకుండా పోయారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై అన్ని పార్టీలూ పెద్దయెత్తున విమర్శలు చేస్తుంటే గతంలో గళం విప్పిన నేతలు ఇప్పుడు కామ్ అయిపోయారు. ఇలా నవరత్నాలను జనంలోకి తీసుకెళ్లాల్సిన నేతలు పార్టీ నుంచి సరైన నిర్దేశం లేకపోవడంతో సైలెంట్ గా ఉన్నారు. ఇలాగే కొనసాగితే పార్టీ క్షేత్రస్థాయిలో దెబ్బతినే అవకాశాలున్నాయని కొందరు నేతలు జగన్ కు తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు.