షర్మిల పొలిటికల్ స్టామినా అంత వరకేనా?

వైఎస్ షర్మిల మరి కొద్ది రోజుల్లో పార్టీని ప్రకటించ బోతున్నారు. అయితే వైఎస్ షర్మిల గత రెండు నెలలుగా చేస్తున్న కసరత్తులో ఎక్కువగా రెండు జిల్లాల నుంచే [more]

Update: 2021-04-05 13:30 GMT

వైఎస్ షర్మిల మరి కొద్ది రోజుల్లో పార్టీని ప్రకటించ బోతున్నారు. అయితే వైఎస్ షర్మిల గత రెండు నెలలుగా చేస్తున్న కసరత్తులో ఎక్కువగా రెండు జిల్లాల నుంచే రెస్పాన్స్ ఎక్కువగా ఉంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి ఎక్కువగా కార్యకర్తలు వైఎస్ షర్మిల సమావేశాలకు రావడం, అక్కడ పార్టీ బలోపేతం అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు కన్పిస్తున్నాయి. తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాల్లో వైఎస్ షర్మిల ప్రభావం ఎక్కవగా ఈ రెండు జిల్లాల్లోనే ఉండనుంది.

అతి కొద్ది అవకాశాలున్న చోట….

వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఒక సంచలనమే. ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకోకుండా తెలంగాణను ఎంచుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వామప్ కోసమే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారంటూ జేసీ దివాకర్ రెడ్డి వంటి నేతలు చేసిన వ్యాఖ్యలు తోసిపుచ్చలేం. బలం లేని చోట, అవకాశాలు అతికొద్దిగా ఉన్న చోట వైఎస్ షర్మిల పార్టీ పెట్టడమంటే ఆలోచించాల్సిన విషయమేనంటున్నారు విశ్లేషకులు.

ఖమ్మం జిల్లాపైనే ఫోకస్…..

అయితే వైఎస్ షర్మిల కొత్త పార్టీ వెనక ఎవరున్నారన్నది పక్కన పెడితే ఇప్పుడు ఆమె పార్టీ ఖమ్మం జిల్లాపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు కన్పిస్తుంది. తొలినుంచి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కొంత అనుకూలంగా ఉండేది. వైఎస్ హయాం నుంచే ఖమ్మం నుంచి కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయి. 2014 ఎన్నికల్లో సయితం వైసీపీకి ఒక ఎంపీ సీటు, మూడు ఎమ్మెల్యే సీట్లు ఖమ్మం జిల్లా నుంచే రావడం విశేషం. ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్న ఈ జిల్లాలో అందుకే వైస్ షర్మిల ఫోకస్ పెట్టారంటున్నారు.

సభలోనే చేరికలు…..

ఇక ఖమ్మం జిల్లాలోనే వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న ఖమ్మం జిల్లా నేతలు కొందరు ఈ సభలో వైెఎస్ షర్మిల పార్టీలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి.వైఎస్ షర్మిల కూడా తాను పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండటం, వైఎస్ అభిమానులు, రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండటంతో ఈ నియోజకవర్గంపై వైఎస్ షర్మిల దృష్టి పెట్టారంటున్నారు. మొత్తం మీద వైఎస్ షర్మిల తన స్టామినాను ఈ జిల్లా నుంచి చూపించాలనుకుంటున్నారు.

Tags:    

Similar News