షర్మిలమ్మకు సీన్ ఇప్పటికైనా అర్థమయిందా?

వైెఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారు. పార్టీ పెట్టడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఎవరైనా ఎక్కడైనా పార్టీని పెట్టుకోవచ్చు. ప్రజల కోసం పోరాటాలు చేయవచ్చు. కానీ వైెఎస్ [more]

Update: 2021-04-30 05:00 GMT

వైెఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నారు. పార్టీ పెట్టడానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. ఎవరైనా ఎక్కడైనా పార్టీని పెట్టుకోవచ్చు. ప్రజల కోసం పోరాటాలు చేయవచ్చు. కానీ వైెఎస్ షర్మిల ఎంచుకున్న మార్గమే సరిగా లేదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడమే పెద్ద టాపిక్ అయింది. ఆమెకు అంత అవసరం ఏంటి? ఇక్కడ ఏమి బావుకుందామని రాజీకీయ పార్టీ పెడుతున్నారన్న విమర్శలు వచ్చాయి.

పార్టీ పెట్టబోతున్నట్లు….

కానీ వైఎస్ షర్మిల విమర్శలకు వెరువలేదు. ఈ నెల 9వ తేదీన తాను పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. వైఎస్ షర్మిల పార్టీ పెడుతుంది కేసీఆర్ కోసమేనన్న విమర్శలు కూడా వచ్చాయి. అందుకోసమోనేమో షర్మిల కేసీఆర్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేశారు. దొరల పాలన నుంచి విముక్తి కలిగించడానికే తాను పార్టీ పెట్టబోతున్నట్లు చెప్పారు. తాను కేసీఆర్ ను టార్గెట్ చేస్తే ఆయన వ్యతిరేకులంతా తన పంచన చేరతారని షర్మిల భావించి ఉండవచ్చు.

దీక్షకు మద్దతు కోసం….

అదే సమయంలో నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇవ్వాలంటూ వైఎస్ షర్మిల మూడు రోజుల పాటు దీక్ష చేశారు. ఈ దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా అన్ని విపక్ష పార్టీలను కోరారు. గద్దర్, కోదండరామ్, ఆర్ కృష్ణయ్యలకు వైఎస్ షర్మిల లేఖ కూడా రాశారు. కానీ షర్మిల దీక్షపై వారు ఏమాత్రం స్పందించలేదు. తన పరివారంతో మాత్రమే ఒకరోజు ఇందిరాపార్కులోనూ, మిగిలిన దీక్ష లోటస్ పాండ్ లోనూ వైఎస్ షర్మిల దీక్ష చేశారు.

కేసీఆర్ కూడా…?

ఇక కేసీఆర్ కూడా సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన సభలో షర్మిల విషయాన్ని ప్రస్తావించక పోవడమూ చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ తనను టార్గెట్ చేసిన షర్మిలను ఎందుకు విమర్శించలేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో విన్పిస్తున్నాయి. వీరి మధ్య అవగాహన ఉందని దీని ద్వారా స్పష్టమవుతుందంటున్నారు. అయితే వైఎస్ షర్మిలను లైట్ గా తీసుకోవడం వల్లనే కేసీఆర్ ఆమె పేరు ఎత్తలేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద వైఎస్ షర్మిల తాను తెలంగాణలో ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందని దీక్షతో తెలిసి వచ్చింది. మరి ఆమె భవిష‌్యత్ నిర్ణయాలు ఎలా ఉండబోతాయన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News