అంతా భ్రాంతియేనా?

తెలంగాణలో నిజానికి రాజకీయ శూన్యత లేదు. ఇక్కడ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. కాంగ్రెస్ బలహీన పడిపోయిదనుకోవచ్చు కాని అది ఎప్పుడైనా తిరిగి లేచే [more]

Update: 2021-07-08 02:00 GMT

తెలంగాణలో నిజానికి రాజకీయ శూన్యత లేదు. ఇక్కడ టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. కాంగ్రెస్ బలహీన పడిపోయిదనుకోవచ్చు కాని అది ఎప్పుడైనా తిరిగి లేచే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు. తన తండ్రి వైఎస్సార జయంతి అయిన నేడు వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరును అధికారికంగా ప్రకటించబోతున్నారు.

నేడు ప్రకటన…

వైఎస్ షర్మిల కొత్త పార్టీ పేరు వైఎస్సార్ టీపీగా ఎన్నికల కమిషన్ ముందు రిజిస్టర్ అయింది. ఇదే పేరును నేడు వైఎస్ షర్మిల అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే వైఎస షర్మిల తాను పార్టీ పెడతానని చెప్పి దాదాపు నాలుగు నెలలు కావస్తుంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభను పెట్టారు. సభ విజయవంతం అయిందనే చెప్పాలి. ఇక వైఎస్ షర్మిల ఈ నాలుగు నెలల నుంచి జిల్లాలను పర్యటిస్తూ వివిధ అంశాలపై ప్రజలను కలుస్తున్నారు.

మనుగడ ఉంటుందా?

అంతవరకూ బాగానే ఉన్నా వైఎస్ షర్మిల పార్టీకి తెలంగాణలో మనుగడ ఉంటుందా? అన్నదే ప్రశ్న. ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇప్పటికీ అభిమానులున్నారు. దీంతో పాటు రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం సామాజికవర్గాలపైనే వైఎస్ షర్మిల ఆశపెట్టుకున్నారు. కానీ అది అంత సులువుకాదు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు అభిమానులున్నా వారంతా ఇప్పడు తెలంగాణలో వివిధ పార్టీలకు చేరువయ్యారు. వైఎస్ ప్రభావం వచ్చే ఎన్నికల్లో పనిచేస్తుందనుకోవడం కూడా వైఎస్ షర్మిల భ్రమ అనుకోవాలి.

నేతలు ఎవరూ…?

ఇక వైఎస్ షర్మిల పార్టీ పెడతానని ప్రకటించిన తర్వాత సీనియర్ నేతలు వచ్చి పార్టీలో చేరతారని భావించారు. కాంగ్రెస్, బీజేపీ ల నుంచి తమ కుటుంబానికి నమ్మకమైన నేతలు తన చెంతకు వస్తారని వైఎస్ షర్మిల అంచనా వేశారు. కానీ నాలుగు నెలల నుంచి ఒక్క నేత కూడా ఇటు వైపు చూడలేదు. దీన్ని బట్టి వైఎస్ షర్మిల పార్టీ పట్ల నేతల్లో ఉన్న నమ్మకాన్ని మనం అంచనా వేయవచ్చు. వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం తప్పు కాదు. కానీ ఈ పార్టీని చూస్తుంటే అలవి కాని చోట అధికులమనరాదన్న సామెత గుర్తుకు రాక మానదు.

Tags:    

Similar News