ఎంత ఆశ.. ఊహల్లోనే విహరించాలి మరి….?

వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి వస్తారని ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తుంది. జగన్, షర్మిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని కూడా సంబరపడుతున్నారు. అయితే కొత్త పార్టీని [more]

Update: 2021-01-24 06:30 GMT

వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి వస్తారని ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తుంది. జగన్, షర్మిల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని కూడా సంబరపడుతున్నారు. అయితే కొత్త పార్టీని షర్మిల తెలంగాణలో పెట్టబోతున్నారట. ఏపీలో వద్దు చెల్లమ్మా.. నీ చేత తెలంగాణలోనే పార్టీ పెట్టించి ముఖ్యమంత్రిని చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అసలు ఇదేం లాజిక్ అర్థం కావడం లేదు. అన్న మీద కోపం ఉంటే ఏపీలోనే పార్టీ పెట్టాలి కదా? తెలంగాణలో కొత్త పార్టీ పెట్టిస్తానని జగన్ హామీ ఇవ్వడమేంటి?

విభేదాలు తీవ్రమయ్యాయట….

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిల, జగన్ ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. వైఎస్ విజయమ్మ షర్మిల వైపు మొగ్గు చూపారు. పైగా ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యం అమలు కావడం లేదని తల్లీ కూతుళ్లు అసంతృప్తితో ఉన్నారట. దీంతో మధ్యే మార్గంగా జగన్ తెలంగాణలో షర్మిల చేత కొత్త పార్టీ పెట్టించి ముఖ్యమంత్రిని చేస్తానని జగన్ షర్మిలకు హామీ ఇచ్చారట. ఏదైనా వార్త వండటానికైనా ఒక అర్థం పర్థం ఉండాలి.

తెలంగాణలో ఎందుకు?

నిజంగా షర్మిల అసంతృప్తిగా ఉంటే ఏపీలోనే అన్నకు పోటీ వస్తారు. పోనీ అన్నను ఎదుర్కొనలేమని భయపడితే ఎదురు తిరుగుతారు. పార్టీపైనే అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేస్తారు. తెలంగాణలో ముఖ్యమంత్రిని చేస్తానని జగన్ హామీ ఇవ్వడమేంటి? షర్మిల ఓకే అనడమేంటి? రాసేవాడు రాధాకృష్ణ అయితే… చదివేవాడు? అన్న చందంగా ఉంది. వైసీపీ అధికారంలోకి రావడానికి షర్మిల కృషిని కూడా ఎవరూ కాదనలేం.

మరి వారు కూడా యాక్టివ్ గా లేరు కదా?

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి షర్మిల పార్టీలోనూ యాక్టివ్ గా లేరు. అది నిజమే. కానీ విభేదాలు అని ఎందుకనుకోవాలి? అన్నను ముఖ్యమంత్రిని చేశానన్న తృప్తితో ఆమె తన వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితమయ్యారని ఎందుకనుకోకూడదు. తెలుగుదేశం పార్టీ మాదిరిగానే కుటుంబ రాజకీయాలని ముద్రపడటం ఇష్టం లేకనే దూరంగా ఉండి ఉండవచ్చు కదా? ఒక్క షర్మిల మాత్రమే కాదు జగన్ కుటుంబంలో విజయమ్మ సయితం పెద్దగా బయటకు రావడం లేదు. అలాగే జగన్ సతీమణి భారతి సయితం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అంత మాత్రాన కుటుంబంలో విభేదాలని, కొత్త పార్టీ అని ప్రచారం చేస్తూ తృప్తి పడుతోంది ఒక వర్గం మీడియా. ఇలా తాత్కాలికంగా వార్తలు రాసుకుని, చదువుకుని తృప్తి పడితే ఒక రోజు గడుస్తుంది మరి. రాధాకృష్ణ రాతలను చూసి తెలుగుదేశం నేతలు మాత్రం సంబరపడిపోతున్నారు.

Tags:    

Similar News