షర్మిల పార్టీ… కొనసాగుతున్న కథనాలివే?

వైఎస్సార్ ఉన్నంతవరకూ ఆయన కుటుంబ సభ్యులు బయటకు వచ్చింది లేదు. జగన్ సైతం 2009 ఎన్నికలలో కడప ఎంపీగా పోటీ చేయడానికి ముందు ఎంతో వత్తిడి వైఎస్సార్ [more]

Update: 2021-01-26 06:30 GMT

వైఎస్సార్ ఉన్నంతవరకూ ఆయన కుటుంబ సభ్యులు బయటకు వచ్చింది లేదు. జగన్ సైతం 2009 ఎన్నికలలో కడప ఎంపీగా పోటీ చేయడానికి ముందు ఎంతో వత్తిడి వైఎస్సార్ మీద పెట్టారని చెబుతారు. అలా తన కుటుంబాన్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలని వైఎస్సార్ భావించారని అనుకోవాలి. కానీ విధి విచిత్రం వైఎస్సార్ మొత్తం కుటుంబం ఆయన దుర్మరణం తరువాత రాజకీయ తెరమీదకు రావాల్సివచ్చింది. అన్నింటికీ మించి ఆయన ముద్దుల తనయ షర్మిల బయటకు రావడమే కాకుండా ఏకంగా ఉమ్మడి ఏపీలో మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా చేయాల్సివచ్చింది. ఎండ కన్ను ఎరగని వైఎస్ కూతురు షర్మిల ఇలా రాజకీయం కోసం ఊళ్ళూ వీధులు పట్టుకుని తిరగడం నిజంగా ఒక అరుదైన ఘటనగానే చెప్పాలి.

ఫ్యామిలీ పాలిటిక్స్ …

వైఎస్సార్ కుటుంబం రాజకీయాల్లోకి వచ్చింది అని అంతా అనుకుంటున్న వేళ ఏకంగా వైఎస్సార్ ఫ్యామిలీలోకే నేరుగా రాజకీయం ప్రవేశించింది అన్న వార్తా కధనాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అయితే ఇవి గాలి వార్తలుగా చూడాలా. నమ్మాలా అంటే రెండింటికీ సమాన అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే రాజకీయం కఠినమైనది. విషం కంటే కూడా ప్రమాదకరమైనది. అందులోకి వెళ్ళాలే కానీ ఎటువంటి బంధాలు అయినా తేఎలికగా మారతాయి, ప‌లుచన అయిపోతాయి. ఇందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మొత్తానికి వైఎస్ కుటుంబం చీలింది అంటూ టీడీపీ అనుకూల మీడియా రాస్తున్న రాతలు చూస్తే అవునా కాదా అన్న దాని మీద ఎవరూ నిర్ధారణకు రాలేకపోతున్నారు. ఎందుకంటే రాజకీయం పవర్ ఎంతో బాగా తెలుసు కాబట్టే.

అన్యాయమేనా..?

నిజానికి వైఎస్ షర్మిల రాజకీయాల్లోకి రావాలని చాలా మంది వైసీపీ అభిమానులకు ఉంది. తెలంగాణాలో కేసీయార్ కి తోడు నీడగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రబాబుకు లోకేష్ ఉన్నాడు. రాజకీయాల్లో ఇదిపుడు తప్పు ఏ మాత్రం కాదు. పైగా ముఖ్యమంత్రిగా జగన్ ఫుల్ బిజీగా ఉన్న వేళ పార్టీ పడకేసింది. కనీసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయినా చెల్లెలు షర్మిలని పెడితే పార్టీ మరింత శక్తివంతం అయ్యేది అన్న వాదన ఉంది. ఇక షర్మిలకు రాజ్యసభ సీటు ఇచ్చి ఢిల్లీ పంపిస్తే అక్కడ గట్టి లాబీయింగ్ కి కూడా అవకాశం ఉండేది అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా జగన్ కోసం షర్మిల విశేషంగా ప్రచారం చేసింది. ఆమెకు ఏ పదవీ దక్కలేదు అన్న ఆవేదన వైసీపీ సాదర‌ జనంలో ఉంది. మరి షర్మిలలో ఆ బాధ ఉందో లేదో తెలియదు. ఇపుడు వస్తున్న వార్తలను చూస్తూంటే అది నిజమైనా తప్పు లేదు అన్న చర్చ కూడా ఉంది.

అతి పెద్ద వ్యూహమా…?

ఇక మరో మాట కూడా వినిపిస్తోంది. ఇదంతా జగన్, కేసీయార్ కలసి పన్నుతున్న పదునైన వ్యూహమని కూడా అంటున్నారు. తెలంగాణాలో షర్మిల పార్టీ పెడితే గెలిచేటంత సీన్ లేకపోయినా కేసీయార్ వ్యతిరక ఓట్లను చీల్చడానికి షర్మిల చేత పార్టీ పెట్టించి 2023 నాటి ఎన్నికల్లో గులాబీ బాస్ ని ఒడ్డున పడేయడానికి తెర వెనక సాగుతున్న అతి పెద్ద కసరత్తు అని చెబుతున్నారు. అదే కనుక నిజమైతే మాత్రం ఏపీలో జగన్ ఇమేజ్ ని సైతం డ్యామేజ్ చేసేలా షర్మిల వ్యవహరించరు అన్న చర్చ వస్తోంది. మొత్తానికి షర్మిల పార్టీ పెడతారు అన్న దాని మీద రాజకీయ వర్గాలో చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. పార్టీ పెట్టినా తప్పు లేదు అన్న మాట కూడా ఉంది. చూడాలి మరి దీని పర్యవసానాలను ఎలా ఉంటాయో.

Tags:    

Similar News