Ys Sharmila : తాను ఒంటిరినేనంటున్నారు… సాధ్యమవుతుందా?

వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. పల్లెలను తాకుతూ సాగుతున్న ఆమె పాదయాత్రకు విశేష స్పందన కన్పిస్తుంది. రాజన్న బిడ్డను చూసేందుకు జనం పెద్దయెత్తున తరలి వస్తున్నారు. ఈ [more]

Update: 2021-11-04 08:00 GMT

వైఎస్ షర్మిల పాదయాత్ర కొనసాగుతుంది. పల్లెలను తాకుతూ సాగుతున్న ఆమె పాదయాత్రకు విశేష స్పందన కన్పిస్తుంది. రాజన్న బిడ్డను చూసేందుకు జనం పెద్దయెత్తున తరలి వస్తున్నారు. ఈ స్పందన రోజురోజుకూ పెరుగుతుండటంతో పార్టీ నేతలలోనూ నమ్మకం కలుగుతుంది. నిన్న మొన్నటి దాకా అపనమ్మకంతో ఉన్న నేతలు సయితం పాదయాత్రకు వస్తున్న రెస్పాన్స్ చూసి నేతలు సంబరపడి పోతున్నారు.

చోటు లేదని తెలిసినా?

తెలంగాణలో తనకు చోటు లేదని తెలిసినా వైఎస్ షర్మిల మొండిగా పార్టీని ప్రకటించారు. వైఎస్సార్టీపీ ని స్థాపించిన నాటి నుంచి షర్మిల ఇతర పార్టీల నేతల మాదిరి ఖాళీగా అయితే కూర్చోలేదు. నిరుద్యోగ సమస్యలపై ఆమె ఉద్యమించారు. ప్రతి మంగళవారం తెలంగాణలో ఏదో ఒక జిల్లాలో నిరుద్యోగులకు సంఘీభావం తెలుపుతూ దీక్షలు చేశారు. పాదయాత్రలోనూ షర్మిల ప్రతి మంగళవారం ఈ దీక్షలను చేస్తున్నారు.

ఒంటరిగా పోటీ….

ఇక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేస్తామని వైఎస్ షర్మిల చెబుతున్నారు. ఏ పార్టీతో పొత్తు ఉండదని ఆమె ప్రతి సభలో స్పష్టం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో కూటమి కట్టే అవకాశాలున్నాయి. కమ్యునిస్టులు, టీడీపీ, చిన్న పార్టీలతో కలసి ఎన్నికల గోదాలోకి దిగాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. బీజేపీ సయితం జనసేనతో ఇక్కడ పొత్తు కుదుర్చుకునే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది. అధికార పార్టీ తరహాలోనే తాను కూడా ఒంటరిగా బరిలోకి దిగి 119 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారు.

అన్ని చోట్లా అభ్యర్థులు…

తన పాదయాత్ర ద్వారా వైఎస్ షర్మిల 90 నియోజకవర్గాల ప్రజలను కలుసుకోనున్నారు. ఇక్కడే నేతలను కూడా తయారు చేసుకునే వీలు ఆమెకు పాదయాత్ర ద్వారా లభించింది. ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర ముగించిన తర్వాత వైఎస్ షర్మిల నేతలతో భేటీ అవుతున్నారు. కొందరికి టిక్కెట్ హామీ కూడా షర్మిల నుంచి లభిస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద వైఎస్ షర్మిల తన అన్నలాగే ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కానీ షర్మిల ప్రత్యర్థులు మాత్రం కేవలం డబ్బు కోసమే కొందరు నేతలు షర్మిల చుట్టూ చేరుతున్నారని విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News