తిరుమల కేంద్రం గానే వైసిపి సర్కార్ సమర శంఖం …?

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మతపర వివాదాలకు చెక్ పెట్టేందుకు వైసిపి సర్కార్ తిరుమల కేంద్రంగా సమరశంఖం పూరించిందా …? అవుననే లెక్కేస్తున్నారు విశ్లేషకులు. అధికమాసంలో జరుగుతున్న శ్రీవారి [more]

Update: 2020-09-24 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న మతపర వివాదాలకు చెక్ పెట్టేందుకు వైసిపి సర్కార్ తిరుమల కేంద్రంగా సమరశంఖం పూరించిందా …? అవుననే లెక్కేస్తున్నారు విశ్లేషకులు. అధికమాసంలో జరుగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు గతంలో ఎన్నడు లేనివిధంగా ప్రచార సంబరంలో మునిగితేలుతున్నాయి. వాస్తవానికి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉన్నా పట్టు వస్త్రాలు సమర్పించడం సంప్రదాయం. స్వామి వారి వ్యవహారం తప్ప మరేవి ప్రచారం కావు. కానీ దీనికి భిన్నమైన పరిస్థితి ఈసారి కనిపిస్తుంది. వైసిపి పై బిజెపి, జనసేన, టిడిపి చేస్తున్న మత దాడి తిప్పి కొట్టేందుకు ఇప్పుడు అధికారపార్టీ ముప్పేట దాడిని బ్రహ్మోత్సవ వేదికగా నడుస్తున్నాయి.

చర్చ … రచ్చ …

ప్రస్తుతం ఎపి లో అమరావతి రాజధాని అంశం పూర్తిగా పక్కకు పోయింది. అంతర్వేది లో రథం దగ్ధం, అమ్మవారి సింహాలు మాయం కావడం ఇలా ఒక్కో సంఘటన తెరపైకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మత రాజకీయాల వైపు మళ్ళాయి. దీని వెనుక ఎవరు ఉన్నారు అనేది పక్కన పెడితే ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉండే టిడిపి మాత్రం బిజెపి ని మించి దూకుడు ప్రదర్శిస్తుంది. ఈ అంశంలో బిజెపి కి ఎలాంటి మైలేజ్ దక్కకూడదు అనే వ్యూహాన్ని టిడిపి అందిపుచ్చుకునే ప్రయత్నంలో మునిగిపోయింది. దాంతో టిడిపి మీడియా లో మత అంశంపై చర్చలు ముమ్మరం చేసింది. ఇందులో బిజెపి ని సైతం డామినేట్ చేసేలా రాజకీయాన్ని చొప్పించింది. దాంతో జగన్ పట్టువస్త్రాలు సమర్పణ కార్యక్రమం పై నిరసన వ్యక్తం చేయాలనుకున్న బిజెపి వెనక్కి తగ్గిందని తెలుస్తుంది.

డిక్లరేషన్ అంశంపైనే …

అన్యమతస్థులు తిరుమలేశుని దర్శించే సమయంలో డిక్లరేషన్ తొలగించడం మరో వివాదంగా కొనసాగుతుంది. అటు టిటిడి మరో పక్క మంత్రి కొడాలి నాని డిక్లరేషన్ అంశం పై పెద్ద చర్చకే తెరలేపారు. దీనిపై అటు టిడిపి, ఇటు బిజెపి పార్టీలకు టార్గెట్ కొడాలి నాని అయ్యారు. నాని ఒక పక్క టిడిపి అధినేతను ఉతికేస్తు బిజెపి అగ్రనేతలను లక్ష్యం చేసుకోవడం మొత్తం మత రాజకీయాలను పక్కకు జరిపారు. మొత్తం వివాదాన్ని తనచుట్టూ తిప్పేసుకోవడంతో మరో కొత్త వ్యూహానికి టిడిపి, బిజెపి లు రంగం సిద్ధం చేసుకోవాలిసి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎపి లో రాజకీయాలు ఎప్పటికప్పుడు హాట్ హాట్ గా మారిపోతున్నాయి. ఇవి ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.

Tags:    

Similar News