సైకిల్ కంటే ఫ్యాన్ బెటర్ అని ఎందుకంటున్నారంటే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏడు పదుల వయసులో ఉన్నారు. పార్టీని ఇక ఎక్కువ కాలం ఆయన వయసు రీత్యా బండి లాగే పరిస్థితి లేదు. ఆయన [more]

Update: 2020-03-16 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఏడు పదుల వయసులో ఉన్నారు. పార్టీని ఇక ఎక్కువ కాలం ఆయన వయసు రీత్యా బండి లాగే పరిస్థితి లేదు. ఆయన కుమారుడు లోకేష్ నాయకత్వాన్ని ఇప్పటికే వ్యతిరేకిస్తూ కొందరు పార్టీ మారిపోయారు. తాము వెళ్ళడానికి లోకేష్ పోకడలే ప్రధాన కారణంగా చూపించి మరి వెళ్లారు. దీనికి తోడు స్వయంగా మంగళగిరి లో లోకేష్ ఓటమి తో ఆయనపై ఉన్న అరకొర నమ్మకం మరింత దిగజారింది.

వారసుల భవిష‌్యత్తుపై….

తమ తో పాటు తమ వారసుల భవిష్యత్తు కోసం ఎదురు చూసే తమ్ముళ్లకు పార్టీ భవితపై భయం పట్టుకుంది. దాంతో వారు వైసిపి బాటలో వెళ్లడమే సరైందనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు. చంద్రబాబు కూడా నిర్ణయాలు తీసుకోవడంలో లోకేష్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. దీంతో ఇక చంద్రబాబు స్వయం నిర్ణయాలు తీసుకోలేరని కొందరు నేతలకు అర్థమయింది. ప్రాంతీయ పార్టీలో ఇమడలేమని లేక జగన్ ఆధిపత్యం ఇష్టం లేని వారు ద్వితీయ ప్రత్యామ్నాయం గా బిజెపి ని ఆశ్రయిస్తున్నారు.

తోట, కరణం వంటివారి ముందు చూపు అదే …

వైసిపి అధినేత జగన్ మరో పాతికేళ్ళపాటు జోరుగా రాజకీయాలు చేయగల సత్తా చిన్న వయసు కారణంగా ఉంది. దాంతో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం వైసిపి సాగించడం ఖాయం. అలాగే జగన్ కి ప్రస్తుతం పూర్తి స్థాయి మద్దతే ఇస్తున్న వైఎస్ భారతి, విజయమ్మ, షర్మిల వంటివారు పార్టీని నడిపించగల సమర్దులే. దాంతో వైఎస్ వారసులతోనే ప్రయాణం తమకు కలిసి వస్తుందన్న లెక్క ఫ్యాన్ పార్టీవైపు చూసే వారి ఆలోచనగా కనిపిస్తుంది. తమతో పాటు తమ వారసుల రాజకీయ భవిత ఆశించే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మాజీ ఎమ్యెల్యే తోట త్రిమూర్తులు నుంచి తాజాగా వైసిపి తీర్ధం పుచ్చుకున్న కరణం బలరాం వరకు ఈ ఆలోచనతోనే అధికారపార్టీలోకి దూకేసినట్లు తెలుస్తుంది. ఏపీ లోని రెండు ప్రాంతీయ పార్టీల్లో దేనికి భవిష్యత్తు ఉందన్న చర్చల్లో ముదురు రాజకీయ నేతలు వైసిపి వైపే మొగ్గు చూపుతూ ఉండటం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News