వైసీపీ స్కెచ్ ఫలించిందా..?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎంత సీరియస్ గా తీసుకున్నాయో తెలిసిందే. రెండు పార్టీలూ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి విజయమే [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎంత సీరియస్ గా తీసుకున్నాయో తెలిసిందే. రెండు పార్టీలూ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి విజయమే [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎంత సీరియస్ గా తీసుకున్నాయో తెలిసిందే. రెండు పార్టీలూ ఈ ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావించి విజయమే లక్ష్యంగా పావులు కదిపాయి. అధికారాన్ని కాపాడుకోవాలని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా శ్రమించింది. ఈ పరిస్థితిలో జగన్ చేతికి అధికారం వెళితే మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కష్టం. ఒక్కసారి అధికారంలోకి వచ్చాక జగన్ మరింత బలంగా తయారవుతారు. అదే జగన్ ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే పార్టీని నడిపించడం కూడా కష్టమవుతుంది. ఇప్పటికే తొమ్మిదేళ్లుగా అధికారంలోకి లేకున్నా అనేక ఒడిదొడుకులు ఎదుర్కుంటూ జగన్ పార్టీని నడిపిస్తున్నారు. ఈసారి కూడా అధికారంలోకి రాకపోతే పార్టీ నడిపించడం కష్టమే. దీంతో ఓవైపు జగన్, మరోవైపు చంద్రబాబు ఈ ఎన్నకల్లో చాలానే కష్టపడ్డారు. అయితే, రెండు పార్టీలూ గెలుపుపై ధీమాగా ఉన్నాయి.
చేరికలు హైప్ తీసుకురావడంతో…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి గత ఎన్నికలకు భిన్నంగా వ్యహరించింది. ముఖ్యంగా ఎన్నికల ముందు పలు అంశాలు వైసీపీకి బాగా కలిసివచ్చినట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో చేరికలతో వైసీపీకి ఎన్నికల ముందు కొత్త ఊపు వచ్చింది. అందునా తెలుగుదేశం పార్టీ నుంచి ముగ్గురు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరడంతో ఆ పార్టీ గెలవబోతోందా అనే హైప్ ఎన్నికల ముందే వచ్చింది. సహజంగా గెలిచే పార్టీలోకే నేతలు వలస రావడం కనిపిస్తుంటుంది. దీంతో ఇక్కడ కూడా వైసీపీ గెలుస్తుందనే అంచనాలు ఎన్నికల ముందే రావడం ఆ పార్టీకి ప్లస్ అయ్యింది. టీడీపీ నుంచి అవంతి శ్రీనివాసరావు, పండుల రవీంద్రబాబు, బుట్టా రేణుక, ఆమంచి కృష్ణమోహన్, మేడా మల్లిఖార్జున్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి, పరుపుల సుబ్బారావు, కొత్తపల్లి సుబ్బారాయుడు వంటి వారు ఎన్నికల వేళ అధికార పార్టీని వదిలి వైసీపీలో చేరారు. వీరిలో ప్రజల్లో బలం ఉన్న వారికి జగన్ టిక్కెట్లు కూడా ఇవ్వగా మిగతా వారికి పలు హామీలు ఇచ్చి ఎటువంటి విభేదాలు లేకుండా అందరినీ సెట్ చేశారు.
టిక్కెట్లు వదులుకొని చేరడంతో…
వీరి చేరిక ఒక ఎత్తు అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి చేరిక మరొక ఎత్తు. మాగుంట శ్రీనివాసులు రెడ్డిని టీడీపీ నుంచి ఓంగోలు ఎంపీగా పోటీ చేయించేందుకు చంద్రబాబు బాగా ప్రయత్నించారు. అయినా ఆయన వద్దనుకొని వైసీపీ నుంచి పోటీ చేశారు. ఇక, ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యవహారం కూడా ఇంతే. ఆయనకు టీడీపీలో టిక్కెట్ ప్రకటించిన తర్వాత పోటీ చేయనని చెప్పి వైసీపీలోకి వచ్చి పోటీ చేశారు. జనసేన విశాఖపట్నం ఎంపీ టిక్కెట్ ఖరారైన గేదెల శ్రీనుబాబు వదులుకొని వచ్చి వైసీపీలో చేరారు. ఈ చేరికలు ఎన్నికలకు కొన్ని రోజులే ముందే జరగడంతో టీడీపీ అభ్యర్థులే వచ్చి వైసీపీలో చేరుతున్నారంటే వైసీపీ గెలవబోతోంది అనే అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఎన్నికల్లో వైసీపీకి బాగా కలిసి వచ్చింది.
క్యూ కట్టి చేరిన సినీ నటులు…
ఇక, రాజకీయాలకు కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న కిల్లి కృపారాణి, దాడి వీరభద్రారావు, డీఎల్ రవీంద్రారెడ్డి వంటి వారు సైతం చివరి నిమిషంలో పార్టీలో చేరి టిక్కెట్లు ఇవ్వకున్నా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేశారు. సినీ నటులు సైతం ఎన్నికల వేళ వైసీపీలోకి వచ్చేందుకు క్యూ కట్టారు. మోహన్ బాబు, విష్ణు, పృధ్వీ, పోసాని కృష్ణమురళి, చిన్నికృష్ణ, తనీష్, హేమ, శివాజీరాజా, జయసుధ, వంటి అనేక మంది వైసీపీలో చేరారు. ఓ దశలో చంద్రబాబు సైతం ఈ చేరికలపై కారాలు మిరియాలు నూరి సినీ నటులపై విమర్శలు గుప్పించారు. ఇలా ఎన్నికల ముందే ఒక ప్లాన్ ప్రకారం పార్టీకి హైప్ తీసుకురావడంలో వైసీపీ పూర్తిగా సక్సెస్ అయ్యింది. అయితే, ఈ వ్యూహం ఏ మేరకు ఫలించిందో తేలాలంటే మే 23 వరకు ఆగాల్సిందే.