వైసీపీ గ్రౌండ్ గేమ్… టీడీపీ తట్టుకోగలదా?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కరోనా మహమ్మారి రాష్ట్రంలో విస్తరిస్తున్నా తన టార్గెట్లను మాత్రం ఆయన మరిచిపోవడం లేదు. ప్రతి పని పార్టీకి ఉపయోగపడేలా చూస్తున్నారు. ఏపీలో వైసీపీ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కరోనా మహమ్మారి రాష్ట్రంలో విస్తరిస్తున్నా తన టార్గెట్లను మాత్రం ఆయన మరిచిపోవడం లేదు. ప్రతి పని పార్టీకి ఉపయోగపడేలా చూస్తున్నారు. ఏపీలో వైసీపీ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కరోనా మహమ్మారి రాష్ట్రంలో విస్తరిస్తున్నా తన టార్గెట్లను మాత్రం ఆయన మరిచిపోవడం లేదు. ప్రతి పని పార్టీకి ఉపయోగపడేలా చూస్తున్నారు. ఏపీలో వైసీపీ గ్రౌండ్ గేమ్ ను స్టార్ట్ చేసింది. కరోనా ముగిసిన తర్వాత ఎటూ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో తమదే విజయం కావాలన్నది జగన్ రెడ్డి ఆలోచన. లక్ష్యం కూడా. అందుకు కరోనాను కూడా ఉపయోగించుకుంటున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి.
కరోనా సమయంలో…..
కరోనాతో గత నెల రోజుల పై నుంచి అన్ని కార్యక్రమాలు స్థంభించి పోయాయి. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉపాధి లేకుండా పోయింది. దీంతో వారికి వైసీపీ దగ్గరయ్యే ప్రయత్నాలు తొలి నుంచి ప్రారంభించింది. వైసీపీ ఎమ్మెల్యేలు నిత్యం జనంలోనే కన్పిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారు కూడా నిత్యం సేవా కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్లాన్ చేశారు. అన్నదానం, నిత్యావసర వస్తువుల పంపిణీ, కోవిడ్ నుంచి కోలుకున్న వారికి ఆర్థిక సాయం వంటివి వైసీపీ నేతలు దగ్గరుండి చూస్తున్నారు.
టీడీపీ నేతలు…….
ఇక విపక్ష నేతలు క్షేత్ర స్థాయిలో పెద్దగా కన్పించడం లేదు. వేళ్ల మీద లెక్కించే వారు తప్పించి క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలెవ్వరూ ప్రజల వద్దకు వెళ్లడం లేదు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో టీడీపీ నేతలు పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. వారు లాక్ డౌన్ నిబంధనలన ఉల్లంఘిస్తే కేసులు పెడతారని భయపడుతున్నారు. అధికార పార్టీ నేతలకు తప్ప మరెవ్వరికీ సేవా కార్యక్రమాల్లో అనుమతి ఇవ్వడం లేదన్నది విపక్షాల వాదన.
ఆంక్షలు విధిస్తూ…..
బీజేపీ నేతలు కూడా తమను సేవాకర్యాక్రమాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధిస్తున్నారని, అధికార పార్టీ నేతలకు మాత్రం పోలీసులు దగ్గరుండి సెక్యూరిటీ ఇస్తున్నారంటున్నారు. ఇలా విపక్ష పార్టీలను లాక్ డౌన్ నిబంధనల పేరిట అధికార పక్షం ప్రజల వద్దకు వెళ్లనివ్వకుండా కట్టడి చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలుపు తమదేనన్న ధీమాను వైసీపీ నేతలు బాహాటంగా వ్యక్తం చేస్తున్నారు. విపక్షాలు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయి.