కాచిన నేతలే.. కాదంటున్నారు.. వైసీపీలో చిత్రమైన పరిస్థితి
వైసీపీలో ఇదో చిత్రమైన పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని అనుకుంటున్నా.. లోలోన మాత్రం పార్టీ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. నిన్న మొన్నటి వరకు [more]
వైసీపీలో ఇదో చిత్రమైన పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని అనుకుంటున్నా.. లోలోన మాత్రం పార్టీ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. నిన్న మొన్నటి వరకు [more]
వైసీపీలో ఇదో చిత్రమైన పరిస్థితి. పైకి అంతా బాగానే ఉందని అనుకుంటున్నా.. లోలోన మాత్రం పార్టీ పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. నిన్న మొన్నటి వరకు వైసీపీ జెండా మోసిన నాయకులు ఇప్పుడు కాడి పడేసేందుకు రెడీ అయ్యారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపిన నాయకులు.. ఇప్పుడు ఎక్కడికక్కడ గుంభనంగా ఉంటున్నారు. పార్టీ తరఫున వాయిస్ వినిపించేందుకు, పార్టీ జెండా మోసేందుకు అజెండాను నడిపించేందుకు కూడా వారు విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికితోడు కీలక నేతల నుంచి కూడా వైసీపీపై విమర్శల శరాలు తగులుతున్నాయి. “మేం పార్టీ కోసం ఎంతో శ్రమించాం. కానీ, మమ్మల్ని పక్కన పెట్టారు. ఎందుకు ఇలా చేశారు?“ అంటూ.. నాయకులు.. పార్టీ కీలక నేతలను ప్రశ్నిస్తున్నారు.
ఆశ చూపి….
ముఖ్యంగా చాలా చోట్ల ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు సైతం కార్పొరేషన్ పదవులు ఇస్తామని ఆశ చూపారు.. అయితే. చివరి నిముషానికి వచ్చే సరికి మాత్రం మొత్తం పరిస్థితిని మార్చేసి.. తమకు అనుకూలంగా ఉ న్నవారికి మాత్రమే మరీ ముఖ్యంగా ఓటు బ్యాంకును దృష్టిలో పెట్టుకుని.. పదవుల పందేరం చేశారు. జగన్ పార్టీ కోసం కష్టపడిన చాలా మంది నేతలను పక్కన పెట్టేసి సామాజిక సమీకరణలు, ప్రాంతాల సమీకరణలను దృష్టిలో పెట్టుకుని పదవులు ఇస్తున్నారు. ఈ విషయంలో ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత ఒత్తిడి చేసినా ఐ డోన్ట్ కేర్ అన్నట్టుగానే ఉంటున్నారు. కనీసం వారు చెప్పింది కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. దీంతో అప్పటి వరకు పదవులపై ఆశలు పెట్టుకున్న వైసీపీ నాయకులు కినుక వహిస్తున్నారు.
పార్టీని వదిలేయకున్నా….
ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. పనిచేసిన వారిని, చేయని వారిని.. వైసీపీకి ఉపయోగపడుతున్న వారిని, పార్టీని ఉపయోగించుకుంటున్న వారిని కూడా ఒకే విధంగా చూడడాన్ని.. నాయకులు తప్పుబడు తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ నాయకులు పార్టీకి ఇప్పుడు దూరంగా ఉన్నారు.. అయితే.. వీరేమీ పార్టీని వదిలేసే టైపు కాదు. కానీ, పార్టీలోనే ఉంటూ. పార్టీని బద్నాం చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. గత ఎన్నికలకు ముందు వరకు స్ట్రాంగ్‌గా ఉన్న చంద్రబాబు పదవులు అన్నీ కొన్ని వర్గాలకే కట్టబెట్టి దెబ్బతిన్నారు.
ఇలాగే కొనసాగితే…?
ఇప్పుడు జగన్ చంద్రబాబుకు భిన్నంగా వెళుతున్నా వైసీపీలో సీనియర్లు… పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్న వారినికాదని.. ఇతరులకు పదవులు ఇస్తున్నారు. సామాజిక సమీకరణలో లేదా ప్రాంతాల వారీ సమీకరణలో జగన్ లెక్కలు జగన్‌కు ఉండవచ్చు.. కానీ ఎప్పుడు అయితే పోల్ మేనేజ్‌మెంట్‌లో పట్టున్న నేతలకు పదవులు రావో వారు పనిచేయకపోతే ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా జగన్‌కు, వైసీపీకి ఉంటుంది. ఇది మరింతగా పార్టీని ఇబ్బందికర పరిస్థితిలోకి నెడుతుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా చూస్తే.. త్వరలోనే పరిషత్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నాయకులను సంతృప్తి పరచకపోతే.. పార్టీ ఇబ్బందుల్లో పడడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.