ఎక్కడ చూసినా లక్ష్మణ రేఖలే… అన్ని చోట్లా అంతేనా?
అధికార పార్టీ నేతల మధ్య అంతరాలు పెరుగుతున్నాయా ? భారీ మెజారిటీ ఉన్నప్పటికీ.. నేతల మధ్య కొరవడిన సఖ్యతతో ప్రజల మధ్యకు వెళ్లలేక పోతున్నారా? ప్రతి జిల్లాలోనూ [more]
అధికార పార్టీ నేతల మధ్య అంతరాలు పెరుగుతున్నాయా ? భారీ మెజారిటీ ఉన్నప్పటికీ.. నేతల మధ్య కొరవడిన సఖ్యతతో ప్రజల మధ్యకు వెళ్లలేక పోతున్నారా? ప్రతి జిల్లాలోనూ [more]
అధికార పార్టీ నేతల మధ్య అంతరాలు పెరుగుతున్నాయా ? భారీ మెజారిటీ ఉన్నప్పటికీ.. నేతల మధ్య కొరవడిన సఖ్యతతో ప్రజల మధ్యకు వెళ్లలేక పోతున్నారా? ప్రతి జిల్లాలోనూ నేతల మధ్య దూరం పెరుగుతోందా ? అంటే .. గడిచిన ఆరు మాసాలుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న వారు ఔననే అంటున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీ సాధించింది. కొత్త, పాత, సీనియర్లు, జూనియర్లు.. ఇలా ఎంతో మంది వైసీపీ తరఫున పోటీ చేసి 151 మంది విజయం సాధించారు. నిజానికి ఈ దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఒక పార్టీ ఈ రేంజ్‌లో మెజారిటీ సాధించిన పరిస్థితి లేదు.
విభేదాలు ముదిరిపోయి….
దీంతో వైసీపీ సాధించిన విజయంతో నేతలు దూసుకుపోతారని, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఇక, అన్ని జిల్లాల్లోనూ పకడ్బందీ వ్యవస్థ ఏర్పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ, గడిచిన పది మాసాలుగా పరిస్థితిని గమనిస్తే.. దీనికి విరుద్ధమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. ఏ ఉద్దేశంతో అయితే ప్రజలు వైసీపీ నేతలకు విజయం అందించారో ఆ ఉద్దేశం మాత్రం నెరవేరడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం నేతల మధ్య సఖ్యత, నియోజకవర్గాలపై పట్టు లేకపోవడమేనని చెబుతున్నారు. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు ఉన్నాయి. మంత్రులకు ఎంపీలకు-ఎమ్మెల్యేలకు మధ్య అస్సలు పొసగడం లేదు.
లక్ష్మణ రేఖలను గీచుకుని…..
ఇక, ఇంచార్జ్ మంత్రులు కూడా ఏదో పైపైనే కార్యక్రమాలు చుట్టబెడుతున్నారు తప్ప లోతైన పరిశీలన కూడా సాగడం లేదు. దీంతో దాదాపు అన్ని జిల్లాల్లోనూ పార్టీ నేతల మధ్య లక్ష్మణ రేఖలు పెరుగుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాదు, మంత్రి పదవులు ఆశించిన వారు, టికెట్లను త్యాగం చేసిన వారు, నామినేటెడ్ పదవులు ఆశించిన వారు భంగ పడడంతో వారు పార్టీ కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ పార్టీ నేతలను ఏకతాటిపై నడిపించడంలోనూ దూరంగా ఉంటున్నారు.
నిధుల లేమితో…?
ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా సీనియర్ల మాటలను పట్టించుకోకుండా ఒంటెత్తు పోకడలు పోతున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వం ఏర్పడి యేడాది అవుతున్నా ఇప్పటి వరకు సీఎం నుంచి చాలా మంది ఎమ్మెల్యేలకు అనుకున్న స్థాయిలో అభివృద్ధి పనుల కోసం నిధులు కూడా ఇవ్వలేదు. ఒకరిద్దరు మంత్రులకు తప్పా ఇక్కడ నిధులు కూడా లేని పరిస్థితి. దీంతో ఇటు నాయకుల మధ్య కలతలు ఇలా ఉంటే ప్రభుత్వంపై వ్యతిరేకతకు తోడు తాజాగా వచ్చిన కరోనా మహమ్మారి సైతం ప్రభుత్వానికి, ఇటు నాయకులకు పెద్ద మైనస్‌గా మారింది.