వైసీపీ ఫైర్ బ్రాండ్లకు పదవులపైనే యావ..?
వైసీపీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొందరు పదవులపై వ్యామోహంతో సీఎం జగన్ దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారని, మరికొందరు తమ హవా నిలుపుకొనేందుకు [more]
వైసీపీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొందరు పదవులపై వ్యామోహంతో సీఎం జగన్ దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారని, మరికొందరు తమ హవా నిలుపుకొనేందుకు [more]
వైసీపీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొందరు పదవులపై వ్యామోహంతో సీఎం జగన్ దృష్టిలో పడాలని ప్రయత్నిస్తున్నారని, మరికొందరు తమ హవా నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కూడా పదవుల వేటలో ముందుకు సాగుతున్నారు. త్వరలోనే రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణ ఉండడంతో రాజధాని ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఈ పదవులపై కన్నేశారు. దీంతో వారు జగన్ దృష్టిలో పడేందుకు నానా హంగామా చేస్తున్నారని అంటున్నారు. ఇటీవల కాలంలో ఓ ఎమ్మెల్యే అతి చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
కరోనా రాకపోయి ఉంటే…?
జగన్ కేబినెట్లో మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరిని జగన్ రాజ్యసభకు ఎంపిక చేశారు. కరోనా రాకపోయి ఉంటే వీరు రాజ్యసభ సభ్యులు అవ్వడంతో పాటు ఈ పాటికే మంత్రులుగా రాజీనామా చేసి ఉండేవారు. ఇక ఈ ఇద్దరు మంత్రుల ఖాళీల నేపథ్యంలో కొత్తగా జగన్ ఎవరిని కేబినెట్లోకి తీసుకుంటారన్నది క్లారిటీ లేకపోయినా ఆశావాహుల హడావిడి మాత్రం ఓ రేంజ్ లో కన్పిస్తుంది. ఈ క్రమంలోనే రాజధాని ప్రాంతానికి చెందిన మహిళా ఎమ్మెల్యేల హడావిడి, ఆధిపత్య పోరు మాత్రం మామూలుగా లేదంటున్నారు.
సోషల్ మీడియా వింగ్ ద్వారా?
ఇక, మరో మహిళా ఎమ్మెల్యే సీనియర్లను పక్కన పెట్టి అన్నీతానే అయి వ్యవహరించడం, ఎంపీలతోనూ రగడకు దిగడం వంటివి వివాదానికి దారితీస్తున్నాయి. ఆమె ఇప్పటికే తన సోషల్ మీడియా వింగ్ ద్వారా తనకు మంత్రి పదవి వచ్చేసిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఆమె వైఖరి నియోజకవర్గంలోనే కాకుండా జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక మరో మహిళా ఎమ్మెల్యే సైతం మంత్రి పదవి వస్తుందని అనుచరుల దగ్గర చెప్పుకుంటున్నారట.
మంత్రి పదవి కోసం…..
ఇక, పురుష ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. కొందరు దూకుడుగా ఉండి జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు మాత్రం సైలెంట్‌గా ఉండి తమ పనితాము చేస్తున్నారు. పురుష ఎమ్మెల్యేల్లో చాలా మంది మితంగా ఉంటున్నా నెల్లూరు జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలే మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అంటున్నారు. పురుష ఎమ్మెల్యేల్లో మంత్రి పదవులపై ఆశలతో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేల మధ్య తీవ్రమైన రాజకీక ఆధిపత్య పోరు నడుస్తోంది. ఇక రాయలసీమలో కడప, కర్నూలు, అనంతపురం జిల్లా ఎమ్మెల్యేల మధ్య కూడా ఇదే పరిస్థితి ఉంది.
కరోనాను వాడుకుంటూ……
మొత్తంగా చూస్తే.. వైసీపీలో ఎమ్మె ల్యేల వైఖరి తీవ్ర వివాదాస్పదంగా మారుతోందని అంటున్నారు పరిశీలకులు. కొందరు జగన్ కనుసన్న ల్లో ఉంటే.. మరికొందరు అతి చేస్తున్నారని, పదవులపై వ్యామోహంతో వ్యవహరిస్తున్నారని అంటున్నారు. నిజానికి మనం పైన చెప్పుకున్న ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. అయినాకూడా అంతా తామే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరూ కూడా నియోజకవర్గంలోనే కాకుండా పార్టీపైనా ఆధిపత్య ధోరణితో ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న వారు విస్తుపోతున్నారు.. మరి జగన్ వీరిని ఎలా లైన్‌లో పెడతారో చూడాలి.