బలపడుతున్నారా ? బలహీనపడుతున్నారా ?
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది కాలంలో జగన్ పార్టీ బలపడిందా ? లేక టిడిపి నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటూ బలహీనపడుతుందా [more]
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది కాలంలో జగన్ పార్టీ బలపడిందా ? లేక టిడిపి నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటూ బలహీనపడుతుందా [more]
వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అయ్యింది. ఈ ఏడాది కాలంలో జగన్ పార్టీ బలపడిందా ? లేక టిడిపి నుంచి వచ్చిన వారిని చేర్చుకుంటూ బలహీనపడుతుందా …? దీనిపై పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద చర్చే నడుస్తుంది. గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వివిధ రకాల ప్రలోభాలకు గురిచేసి వైసిపి కి చెందిన 23 మంది ఎమ్యెల్యేలను తమపార్టీలో కలిపేసుకుంది. వీరంతా తాము గెలుపొందిన పార్టీకి రాజీనామా చేశారే కానీ అదే పార్టీ సింబల్ తో గెలిచిన పదవికి రాజీనామా చేయలేదు. తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలని కూడా అసెంబ్లీలో అప్పీల్ చేసింది లేదు. పార్టీ ఫిరాయింపుల చట్టంలోని లోపాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఈ వ్యవహారం నడిచింది. నాటి స్పీకర్ డా. కోడెల శివప్రసాద రావు పూర్తి పార్టీ నేతగానే వ్యవహరించారు తప్ప ఎక్కడా ఈ ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నమే చేయలేదు. కోడెల జీవితంలో ఈ వ్యవహారాలు మాయని మచ్చగానే మిగిలిపోయాయి.
సేమ్ టూ సేమ్ …
ఇప్పుడు అదే సీన్ ఎపి రాజకీయాలు తిరిగి మొదలు అయిపోయాయి. గన్నవరం ఎమ్యెల్యే వల్లభనేని వంశీ తో మొదలైన ఈ వ్యవహారం మద్దాలి గిరి, తాజాగా కరణం బలరాం వీరంతా తమ పదవులకు రాజీనామా చేయకుండా జై జగన్ అనేశారు. సాంకేతికంగా వీరంతా టిడిపి లోనే ఉంటారు. కానీ వైసీపీ లో కొనసాగుతారు. మరికొందరు అధికారపార్టీ వైపు చూస్తున్నారన్న వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. దీనితో ముఖ్యమంత్రి జగన్ చెప్పినదానికి చేస్తున్న దానికి పొంతనే లేదన్నది ఈ వ్యవహారం చెప్పకనే చెబుతుంది. ఏ పార్టీ నుంచి అయినా తమ పార్టీకి వచ్చేవారు పార్టీ పదవులకు, అధికారిక పదవులకు రాజీనామా చేస్తేనే వారిని చేర్చుకుంటామని చెప్పారు వైసిపి అధినేత. అయితే తాను పెట్టుకున్న నియమాన్ని జగన్ పక్కన పెట్టేశారు. గతంలో తాము అనుభవించిన క్షోభను టిడిపి కి గుర్తు చేసేందుకే ఈ స్టెప్ తమ పార్టీ వేసింది అని వైసీపీ వర్గాలు సమర్ధించుకున్నా ప్రజల్లో మాత్రం రాజకీయాల్లో నీతి నేతి బీరకాయ అన్న అంశమే చర్చ సాగుతుంది.
ఒరిగేది ఏముంది … ?
పక్క పార్టీ లో నుంచి ఎమ్యెల్యే స్థాయి నేత ఎప్పుడైతే అధికారపార్టీలో వచ్చి చేరతారో ఆ నియోజకవర్గంలో అధికారపార్టీ కి మరింత మైనస్ లో పడినట్లే అని గతంలో పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో గతంలో పోటీ చేసి ఓడిపోయిన వైసీపీ నేతలు క్యాడర్ డీలా పడిపోతుండటం రివాజు. ఎన్నో వ్యయప్రయాసలకు ఒనర్చి వైసీపీని మోస్తే అధిష్టానం తీసుకునే ఈ నిర్ణయాలు అధికారపార్టీని బలహీనపర్చేవే తప్ప బలపర్చేవి కావని ఆయా నియోజకవర్గాల్లో నేతలు వాపోతున్నారు. ఇదే ధోరణి తో జగన్ సర్కార్ ముందుకు వెళ్లేలాగే కనిపిస్తుంది. మరికొందరు అధికారపార్టీ వైపు పక్క చూపులు చూస్తున్నారని వైసీపీ నేతలు అంటూ ఉండటంతో ఇంకొన్ని నియోజకవర్గాల్లో పాత, కొత్త వివాదాలు తెరపైకి రానుండటం ఖాయంగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫిరాయింపుల అంశంలో గతానికి ప్రస్తుతానికి ఒక్కటే కనిపిస్తుంది. పార్టీ మారేందుకు వచ్చేవారికి చంద్రబాబు లాగా బంపర్ ఆఫర్ లు ఏమీ ఇవ్వడం లేదు. ప్రలోభాలకు గురిచేయడం లేదు. మంత్రి పదవులు వారికి ఆశ చూపడం లేదు. నియోజకవర్గానికి అభివృద్ధి పనులకు సంబంధించే గోడదూకే వాతావరణం వైసీపీ వైపు వెళ్ళక తప్పని పరిస్థితినే వైసిపి కల్పిస్తుంది. ఇది తప్ప మిగిలిన అన్ని అంశాల్లో అంతా టిడిపి బాటనే అధికార వైసీపీ అనుసరిస్తుండటం గమనార్హం.