అవును వాళ్ళు అంతా కలసిపోయారు … జగన్ వార్నింగ్ తో?

మీ గ్రూప్ లు ఆధిపత్య పోరుతో పార్టీ పరువు చంక నాకి పోతుంది. అసలే రాజమండ్రి అర్బన్, రూరల్ పూర్తిగా వైసిపి బలహీనంగా ఉంది. ఇక్కడ బలపడాలిసింది [more]

Update: 2020-06-29 05:00 GMT

మీ గ్రూప్ లు ఆధిపత్య పోరుతో పార్టీ పరువు చంక నాకి పోతుంది. అసలే రాజమండ్రి అర్బన్, రూరల్ పూర్తిగా వైసిపి బలహీనంగా ఉంది. ఇక్కడ బలపడాలిసింది పోయి ప్రత్యర్థులకు అదనపు అడ్వాంటేజ్ ఇస్తున్నారు. మీ తగాదాలతో కార్యకర్తలు నలిగిపోతున్నారు. నామినేటెడ్ పదవులు సైతం భర్తీ చేయలేకపోతున్నాం. ఇక ఆపండి లేదా మిమ్మల్ని పక్కన పెట్టేస్తా. ఇది ఫ్యాన్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్.

మనుషులు కలిశారు …

దాంతో రాజమండ్రిలో పార్లమెంట్ సభ్యుడు మార్గాని భరత్ రామ్, రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా లకు చెందిన రెండు ప్రధాన గ్రూప్ లు కలిశాయి. ఒక హోటల్ ను వేదికగా చేసి అక్కడ మీడియా సమావేశం పెట్టి తమ మధ్యన ఏర్పడ్డ ఆవభూముల వ్యవహారంలో యుగళగీతం పాడేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే మీడియా సమావేశంలో అది పూర్తి అయ్యాకా ఎవరి బ్యాచ్ తో వారు చక్కా పోయారు.

సఖ్యత కష్టమేనా?

వీరందరిని ఒక చోటకు చేర్చిన పార్లమెంట్ కో ఆర్డినేటర్ మోసేన్ రాజు, వైసిపి సిటీ ఇన్ ఛార్జ్ శ్రీఘాకోల్లపు శివరామ సుబ్రహ్మణ్యం కూడా తలోదారి పోయారు. ఇది రాజమండ్రిలో వైసిపి గ్రూప్ ల సిత్రం. ఇది చూశాకా వీరి నడుమ సఖ్యత కష్టమే అని అధిష్టానం కోసం కష్టపడే కలిసారని ఇష్టపడి మాత్రం కాదని తేటతెల్లం అయ్యింది. ఇప్పుడు రాజమండ్రి పార్టీ పంచాయితీ మరోసారి అధిష్టానం కోర్టు కి వెళ్ళక తప్పేలా లేదు

Tags:    

Similar News