బజారున పడుతున్నది వైసీపీయేనా..టీడీపీ కాదా?

విశాఖ వంటి మహా నగరంలో జెండా ఎగరేయడమే గొప్ప. అందుకే వైసీపీ వచ్చిన విజయాన్ని వినమ్రంగా స్వీకరించిది. మేయర్ సీటు తమ పరం కావాలనుకుంది. అది దక్కిందని [more]

Update: 2021-04-05 11:00 GMT

విశాఖ వంటి మహా నగరంలో జెండా ఎగరేయడమే గొప్ప. అందుకే వైసీపీ వచ్చిన విజయాన్ని వినమ్రంగా స్వీకరించిది. మేయర్ సీటు తమ పరం కావాలనుకుంది. అది దక్కిందని సంతోషించింది. అయితే హఠాత్తుగా ఒక అలజడి, అది కూడా గాజువాక నియోజకవర్గం పరిధిలో. ఏకంగా ఏడుగురు టీడీపీ కార్పొరేటర్లు వైసీపీ గుమ్మం తొక్కేశారని, వారు రేపో మాపో ఆ పార్టీలో చేరిపోతారని. దీంతో అలెర్ట్ అయిన టీడీపీ వారికి షోకాజ్ నోటీస్ జారీ చేసింది.

అంత సీన్ లేదా…?

దానికి వారు వెంటనే సమాధానం కూడా ఇచ్చారు. తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా టీడీపీని వీడేది లేదని కూడా స్పష్టం చేశారు. తమ గుండె తలుపు తడితే కచ్చితంగా అక్కడ ఉండేది చంద్రబాబేనని కూడా చెప్పుకున్నారు. దీనికి శాంతించిన హై కమాండ్ వారంతా మా తమ్ముళ్ళే అనేసి అనుమానాలకు తెర దించేసింది. ఇవన్నీ ఇలా ఉంటే ఆ ఏడుగురు కార్పొరేటర్లు ఎందుకు హఠాత్తుగా గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలిశారు. దీని వెనక మతలబు ఏంటి అన్నది మాత్రం ఒక సస్పెన్స్ గానే ఉంది. అయితే దీని లోగుట్టుని వైసీపీ నేతలే మెల్లగా విప్పుతున్నారు.

అదీ మ్యాటర్ ….

గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తన నియోజకవర్గంలో టీడీపీకి బాగానే చోటిచ్చేస్తున్నారు అని వైసీపీ నేతలు గుర్రుమంటున్నారు. అంతే కాదు తాజాగా జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధులుగా కొన్ని చోట్ల డమ్మీలను నిలబెట్టి ఈ ఏడుగురు టీడీపీ కార్పోరేటర్లు గెలవడానికి తిప్పల కారకుడు అయ్యాడని కూడా వారు ఆరోపిస్తున్నారు. దానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమంలో భాగంగానే వారంతా నాగిరెడ్డిని కలిశారు అంటున్నారు వైసీపీ నేతలు. అదే నిజమైతే మాత్రం బజారున పడింది టీడీపీ కాదని వైసీపీ అని కచ్చితంగా అర్ధమైపోతోందిగా.

పొలిటికల్ మసాలా..?

తిప్పల నాగిరెడ్డి సీనియర్ నాయకుడు. జగన్ ఆయన కోసం ప్రత్యేకించి గాజువాక వచ్చి మరీ 2019 ఎన్నికల్లో ప్రచారం చేశారు. రియల్ హీరోని గెలిపించాలన్న జగన్ కోరికను మన్నించే జనం రీల్ హీరో పవన్ కళ్యాణ్ ను ఓడించారు. గెలిచాక తిప్పల లెక్కలు మార్చేశారు అంటున్నారు. ఆయనకూ అన్ని పార్టీల్లోనూ బంధువులు, మిత్రులు ఉన్నారు. దాంతో ఆయన పార్టీలకు అతీతంగా అంటూ వైసీపీకి బద్ధ శత్రువు అయిన టీడీపీని కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాంతో అసలైన వైసీపీ నేతలకు తీరని అన్యాయమే జరుగుతోందని అంటున్నారు. మరి నాగిరెడ్డి కలుపుతున్న రాజకీయ పులిహోరకు ఫ్యాన్ రెక్కలు విరిగితే తప్పు ఆయనది కాదేమో, చూసీ చూడనట్లుగా వదిలేస్తున్న అధినాయకత్వానిదే ఈ తప్పు అని క్యాడర్ గుస్సా అవుతోంది.

Tags:    

Similar News