ysrcp : ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు 2024లో నో ఛాన్స్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతోంది. అంటే సగం పాలన పూర్తయ్యింది. ఈ సగం పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ? ఉందనేదానిపై రకరకాల సర్వేలు, [more]
;
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతోంది. అంటే సగం పాలన పూర్తయ్యింది. ఈ సగం పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ? ఉందనేదానిపై రకరకాల సర్వేలు, [more]
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు అవుతోంది. అంటే సగం పాలన పూర్తయ్యింది. ఈ సగం పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ? ఉందనేదానిపై రకరకాల సర్వేలు, విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. అటు సీఎం జగన్ సైతం తమ ఎమ్మెల్యేల పనితీరుపై ఇప్పటికే అంతర్గతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఈ సర్వేల రిపోర్టులు కూడా కొంత వరకు లీక్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాజధాని అమరావతి ఉన్న గుంటూరు జిల్లాలో రాజధాని వికేంద్రీకరణ అంశం వచ్చే ఎన్నికల్లో బాగా ప్రభావం చూపనుందని పలు సర్వేలు ఇప్పటికే స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో నడుస్తోన్న పొలిటికల్ ట్రెండ్స్ ప్రకారం వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకతతో కొట్టుమిట్టాడుతున్నారు.
వ్యతిరేకత ఎక్కువై….
వీరిలో కొందరికి 2024 ఎన్నికల్లో ఛాన్స్ లేదని అటు సొంత పార్టీ నేతలతో పాటు ఇటు ప్రజల్లోనూ చర్చలు నడుస్తున్నాయి. జిల్లాలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి ఇదే లాస్ట్ ఛాన్స్ అంటున్నారు. రాజధాని మార్పుతో అక్కడ వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీనికి తోడు ఎమ్మెల్యే శ్రీదేవి నోటి దురుసుతనం, అటు సొంత పార్టీ నేతలకు ఆమె టార్గెట్ కావడం మైనస్ అయ్యింది. ఇక మంగళగిరిలో కూడా రాజధాని మార్పు ప్రభావం ఎక్కువుగా ఉంది. దీనికి తోడు అక్కడ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి రెండు సార్లు గెలిచినా ఉపయోగం లేదన్న భావన ఎక్కువుగా ఉండడంతో పాటు లోకేష్‌ను ఓడించామన్న సానుభూతి అక్కడ ప్రజల్లో ఉంది. లోకేష్ కూడా ఓడినా నియోజకవర్గాన్ని, అక్కడ కేడర్‌ను వదలకపోవడం ఆయనకు ప్లస్ కానుంది.
ఫస్ట్ ఓడిపోయేది…?
ఇక ప్రత్తిపాడులో హోం మంత్రి సుచరితకు ఈ సారి కష్టమే అంటున్నారు. ఆమెపై పెద్దగా వివాదాలు లేకపోయినా నియోజకవర్గాన్ని, అక్కడ పార్టీని పట్టించుకోకుండా.. కొందరి చేతుల్లో పెట్టేయడంతో పాటు రాజధాని ఎఫెక్ట్ ఎక్కువుగా ఉండడం సుచరితను దెబ్బకొట్టనుంది. ఇక జిల్లాలో వైసీపీ ఓడిపోయే సీట్లలో ఫస్ట్ ఈ సారి పొన్నూరే ఉంటుందని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే కిలారు రోశయ్యపై పార్టీ వర్గాల్లోనే తీవ్ర వ్యతిరేకత ఉంది. గత ఎన్నికల్లో ప్రభంజనంలోనే స్వల్ప మెజార్టీతో గెలిచిన రోశయ్య అన్‌ఫిట్ అని స్థానిక పార్టీ కేడర్ చెపుతోంది.
ప్రచారంలో ముందున్నా…?
ఇక ప్రచారార్భాటంలో ఎప్పుడూ ముందుండే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీకి ఈ సారి కష్టమే అంటున్నారు. ఆమె ప్రచారంలో ముందు ఉండడం.. సీనియర్ నేత మర్రి రాజశేఖర్‌ను , ఆయన వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టేయడం లాంటి అంశాలు ఆమెకు పెద్ద ఎదురు దెబ్బలు కానున్నాయి. వేమూరులో మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుపై ఎక్కువ సానుభూతి ఉంది. పైగా మేరుగ నాగార్జునపై అవినీతి ఆరోపణలతో పాటు ఆయన అంచనాలు అందుకోలేకపోయారనే అంటున్నారు. ఇక పార్టీ మారిన గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరికి కూడా నెక్ట్స్ టిక్కెట్ వస్తుందో లేదో ? తెలియదు.. వచ్చినా ఆయన గెలవడనే అంటున్నారు. వినుకొండలో బ్రహ్మనాయుడు కోట్లకు అధిపతి అయినా ఆయనపై అవినీతి ఆరోపణలు రావడం, వైసీపీలో గ్రూపుల గోల ఆయన్ను ఈసారి ఓడించేస్తాయంటున్నారు.