నెల్లూరు వైసీపీలో `కోటి` రగడ.. చివరకు ఏం జరిగిందంటే?
పార్టీ అధికారంలో ఉంది. ఏది అడిగినా చేసేందుకు, చేసిన పనికి ఓకే చెప్పేందుకు అత్యంత ఉదారుడైన సీఎం జగన్ ఉన్నారు. అయినా వైసీపీ నేతలు కొందరు తమ [more]
పార్టీ అధికారంలో ఉంది. ఏది అడిగినా చేసేందుకు, చేసిన పనికి ఓకే చెప్పేందుకు అత్యంత ఉదారుడైన సీఎం జగన్ ఉన్నారు. అయినా వైసీపీ నేతలు కొందరు తమ [more]
పార్టీ అధికారంలో ఉంది. ఏది అడిగినా చేసేందుకు, చేసిన పనికి ఓకే చెప్పేందుకు అత్యంత ఉదారుడైన సీఎం జగన్ ఉన్నారు. అయినా వైసీపీ నేతలు కొందరు తమ బుద్ధిని పోనిచ్చుకోలేదు. కోటి రూపాయల కోసం కక్కుర్తి పడ్డారు. అదికూడా దాతa రూపంలో మరో వైసీపీ నేత పేదలకు, వలస కార్మికులకు ఇచ్చిన సొమ్ము కోసం. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు ప్రధాన మీడియాలో ప్రచారం అయ్యేసరికి అందరూ కిక్కురు మనకుండా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఈవిషయం సీఎం జగన్ దృష్టికి కూడా వెళ్లిందని చెబుతున్నారు.
మాజీ ఎంపీ ఒకరు…..
ఈ వ్యవహారం జరిగింది నెల్లూరు జిల్లాలో కావడం గమనార్హం. ఈ జిల్లాకు చెందిన ఒక మాజీ ఎంపీ, గతంలో టీడీపీలో చక్రం తిప్పిన నాయకుడు కొన్నాళ్ల కిందట జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్ధికంగా మంచి పొజిషన్‌లో ఉన్న ఆయన పార్టీలో గుర్తింపు కోసం.. కొన్నాళ్లుగా తపిస్తున్నాడు. ఈ క్రమం లోనే లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలకు సాయం చేసేందుకు కోటి రూపాయలను కేటాయించారు. ఈ మొత్తంతో ఆయన నేరుగా ఎలాంటి సాయం చేయకుండా అధికారులకు ఇచ్చారు. అయితే, ఈ విషయం తెలిసిన వైసీపీలోని రూరల్ కు చెందిన ఒక ప్రజాప్రతినిధి రంగంలోకి దిగారు.
టెండర్లు వేసి మరీ….
ఆ కోటి రూపాయల్లో ఓ పాతిక లక్షలపై కన్నేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన చేసిన పనులు కూడా దీనిని సమర్ధించేలానే ఉన్నాయని అంటున్నారు. సదరు సాయాన్ని పేదలకు పంచకుండా.. ముస్లింలకు రంజాన్ నేపథ్యంలో తోఫాలుగా పంచాలని అధికారులను కోరారు. ఈ క్రమంలోనే అంతా పక్కాగా జరిగినట్టు ఉండేలా.. టెండర్లు పిలిచారు. అయితే, ఈ టెండర్లు వేసిన వ్యాపారులు సదరు నాయకుడి కనుసన్నల్లో మెలిగేవారే కావడం గమనార్హం. దీంతో సాధారణ ధరలకు మించిన విధంగా టెండర్లు వేశారు.
పార్టీలోని ప్రత్యర్థి ఉప్పందించడంతో…..
నిజానికి వారు వేసిన టెండర్ల ప్రకారం అధికారులు ఆయా వస్తువులను వారి నుంచి కొనుగోలు చేస్తే.. ఖచ్చితంగా పైన చెప్పుకున్న ఫిగర్ మేరకు నిధులు మిగలడం ఖాయం. అయితే, ఈ విషయం తెలిసిన వైసీపీకి చెందిన మరో ప్రజాప్రతినిధి దీనిపై అంచనాలు వేసుకున్నారు. ఎప్పటి నుంచో దాగి ఉన్న కసికి పదును పెట్టి .. ఈ మొత్తం వ్యవహారాన్ని మీడియాకు ఉప్పందించారు. అంతే.. ఇది భగ్గున ప్రచారంలోకి వచ్చింది. దీంతో అధికారులు ఈమొత్తం వ్యవహారాన్ని నిలిపివేశారు. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్‌లో తేలిన విషయం ఏంటంటే.. దాత ఇచ్చిన సొమ్ముపై కూడా ఇలా పడిపోవడం ఎందుకు? అనేదే. మరి మన పెద్దారెడ్లు ఎలా రియాక్ట్ అవుతారో.. చివరికి ఇది ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి.