ఇద్దరు చేరతామంటున్నారు…జగన్ మాత్రం…?

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీలో నాయ‌కుల సంఖ్య ఎక్కువ‌గానే ఉన్న ప్పటికీ ఇత‌ర ప‌క్షాలు ఇప్పట్లో పుంజుకునే అవ‌కాశం లేక‌పోయిన నేప‌థ్యంలో అనూహ్యంగా వైసీపీ [more]

Update: 2020-03-03 05:00 GMT

ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయి. అధికార పార్టీలో నాయ‌కుల సంఖ్య ఎక్కువ‌గానే ఉన్న ప్పటికీ ఇత‌ర ప‌క్షాలు ఇప్పట్లో పుంజుకునే అవ‌కాశం లేక‌పోయిన నేప‌థ్యంలో అనూహ్యంగా వైసీపీ వైపే నాయ‌కులు మొగ్గు చూపుతున్నారు. గ‌తంలో ఆ పార్టీలో ఉండి చ‌క్రం తిప్పిన నాయ‌కులు చాలా మంది గ‌తంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ఆక‌ర్ష్ మంత్రానికి ముగ్దులై టీడీపీ సైకిల్ ఎక్కారు. అయితే, టీడీపీ అధికారం కోల్పోవ‌డంతో పాటు పార్టీ పుంజుకునే ప‌రిస్థితి కూడా లేక పోవ‌డంతో ఆ నాయ‌కులు త‌ర్జన భ‌ర్జన ప‌డుతు న్నారు. మ‌రోప‌క్క, వివిధ సంక్షేమ కార్యక్రమాల‌తో అధికార పార్టీ వైసీపీ పుంజుకుంటోంది.

ఎంపీటీసీ గా ఉన్న …..

ఈ నేప‌థ్యంలో అలా అప్పట్లో వెళ్లిన నాయ‌కుడు ఇలా ఇప్పుడు తిరుగు ట‌పాలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డిది ఇలాంటి ప‌రిస్థితే. గ‌తంలో వైసీపీలో ఈయన చ‌క్రం తిప్పారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కేవ‌లం ఎంపీటీసీగా ఉన్న వ్యక్తిని జ‌గ‌న్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడంతో పాటు ఆయ‌న్ను ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా నియ‌మించారు. ఈ క్రమంలోనే 2014లో వైసీపీ టికెట్‌పై అశోక్ రెడ్డి పోటీ చేసి గిద్దలూరు నుంచి విజ‌యం సాధించారు.

వైసీపీలోకి చేరేందుకు….

అయితే, త‌ర్వాత బాబు ఆక‌ర్ష్‌లో ప‌డి టీడీపీలో చేరారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇక్కడ నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన అన్నా రాంబాబు.. భారీ మెజారిటీ (రాష్ట్రంలోనే జ‌గ‌న్‌కు అత్యధికమెజార్టీ వ‌స్తే.. త‌ర్వాత ప్లేస్ అన్నాదే) సాధించారు. ఇక‌, అశోక్‌రెడ్డి టీడీపీలో ఇమ‌డ‌లేక‌.. పార్టీ పుంజుకునే ప‌రిస్థితి కూడా లేక‌పోవ‌డంతో వైసీపీ వైపు అశోక్ చూస్తున్నారు. స‌మీక‌ర‌ణ ప‌రంగా చూస్తే గిద్దలూరు టీడీపీకి అంత సేఫ్ కూడా కాద‌న్న నిర్ణయానికి అశోక్ వ‌చ్చేశారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌న ప్రయ‌త్నాలు తాను చేస్తున్నా.. జ‌గ‌న్ ఆయ‌న‌ను పార్టీలో కి తీసుకుంటారా? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న.

బలమైన నాయకుడు ఉండటంతో….

ఇక అదే ప్రకాశం జిల్లాలోని కందుకూరు మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయ‌న కూడా 2014లో గెలిచారు. అయితే, బాబు పంచ‌న చేరిపోయారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత యాక్టివ్ గా ఉండ‌లేక పోతున్నారు. ఈ క్రమంలోనే ఆయ‌న కూడా పార్టీ మారి జ‌గ‌న్‌కు జై కొట్టాల‌ని నిర్ణయించుకున్నారు. అయితే ఇక్కడ వైసీపీకి బ‌ల‌మైన నాయ‌కుడిగా మ‌హీధ‌ర్‌రెడ్డి ఉన్నారు. దీంతో జ‌గ‌న్ ఈ ఇద్దరు నాయ‌కుల‌కు గ్రీన్ సిగ్నల్ చూప‌డం క‌ష్టమేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News