సిత్రంగా కలసి పోయారుగా… అదే కలిపినట్లుందే?

కలిసి ఉండండి బాబూ…. పార్టీని బతికించండి అని వైసిపి అధిష్టానం రాజమండ్రి నేతలకు నెత్తి నోరు కొట్టుకుని చెప్పింది. ఉహూ… ఎవరి గ్రూప్ వారిదే అన్నట్లు మెయింటైన్ [more]

Update: 2020-04-25 08:00 GMT

కలిసి ఉండండి బాబూ…. పార్టీని బతికించండి అని వైసిపి అధిష్టానం రాజమండ్రి నేతలకు నెత్తి నోరు కొట్టుకుని చెప్పింది. ఉహూ… ఎవరి గ్రూప్ వారిదే అన్నట్లు మెయింటైన్ చేశారు. కాంగ్రెస్ సంస్కృతికి మించి వైసిపి బలహీనంగా ఉన్న రాజమండ్రిలో నేతల తీరు ఇది. అయితే ఇప్పుడు ఆ సీన్ మారిపోయింది. రీజన్ అధిష్టానం కాదు కరోనా కష్టాలు వీరికి పాఠం చెప్పక చెప్పాయి. దాంతో కలిసి ఉంటే కలదు సుఖం అని యుగళగీతాలు పాడుకుంటూ సేవా కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు నాయకులు.

దగ్గరుండమంటే దూరంగా …

పార్టీ అధిష్టానం చెప్పినప్పుడు వినని వైసిపి రాజమండ్రి నేతలు సిత్రంగా కలిసి పోయారు. సామాజిక దూరం పాటించాలి అన్న స్లోగన్ ఉన్నప్పుడు గ్రూప్ లన్నీ ఒక్కతాటిపై నిలిచి ఆశ్చర్యపరుస్తున్నాయి. అలా కరోనా వీరిని కలపడం వెనుక బలమైన రీజన్స్ నే ఉన్నాయి. నేతల కన్నా ప్రజలు తెలివైన వారు గ్రూప్ లతో సేవా కార్యక్రమాలు చేస్తే అన్ని గ్రూప్ లతో తలో లబ్ది పొందొచ్చన్నది జనం ఆలోచన. ప్రజల కరోనా కష్టాలు అలాంటివి మరి.

ఇగోలు పక్కన పెట్టి…..

అందుకే రాజమండ్రి వైసీపీలోని పెద్ద తలకాయలు విడివిడి కార్యక్రమాలు చేపట్టే కన్నా అంతా ఇగోలు పక్కన పెట్టి ఐక్యంగా సొంత డబ్బులు కలుపుకుని భారీ చారిటి కార్యక్రమాలే చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. దాంతో ఇప్పుడు వైసిపి క్యాడర్ లో ఉత్సహం ఉరకలు వేస్తుంది. సాయం చేయాలంటే మా తరువాతే అన్న రీతిలో సేవా కార్యక్రమాల్లో సాగుతున్న ప్రస్తుత తీరు ఎంతకాలం ఉంటుందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఐకమత్యం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది.

Tags:    

Similar News