అక్కడ ఇంఛార్జి ఇస్తామన్నా వద్దంటున్నారట…  వైసీపీలో వింత

పిలిచి నియోజ‌క‌వ‌ర్గం ఇంఛార్జ్ ఛాన్స్ ఇస్తానంటే.. ఎవ‌రైనా వ‌ద్దంటారా ? అందునా అధికార పార్టీ అయితే, ఎగిరి గంతేయ‌డం ఖా యం. కానీ, వైసీపీలో మాత్రం మా [more]

Update: 2020-07-11 02:00 GMT

పిలిచి నియోజ‌క‌వ‌ర్గం ఇంఛార్జ్ ఛాన్స్ ఇస్తానంటే.. ఎవ‌రైనా వ‌ద్దంటారా ? అందునా అధికార పార్టీ అయితే, ఎగిరి గంతేయ‌డం ఖా యం. కానీ, వైసీపీలో మాత్రం మా కొద్దులే అంటున్నార‌ట‌! అందునా.. అక్కడైతే.. అస‌లే వ‌ద్దులే అంటున్నార‌ట‌. దీంతో విష‌యం ఏంటా అని అంద‌రూ చ‌ర్చించుకుంటున్నారు. ఏపీలో ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అధికార వైసీపీ నుంచి ఏ చిన్న ప‌ద‌వి వ‌చ్చినా తీసుకునేందుకు నేత‌లు రెడీగా ఉన్నారు. అంతెందుకు గుడివాడ‌లో టీడీపీ నుంచి ఓడిపోయిన దేవినేని అవినాష్‌కు విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ప‌ద‌వి ఇచ్చాక ఆయ‌న విజ‌య‌వాడ న‌గ‌ర రాజ‌కీయాల్లో సూప‌ర్ ఫేమ‌స్ అయిపోయారు. అయితే ఇప్పుడు అదే అధికార వైసీపీలో ఓ నియోజ‌క‌వర్గ ఇన్‌చార్జ్ ప‌ద‌వి విష‌యంలో మాత్రం వైసీపీ నేత‌లు మాకు ఆ ప‌ద‌వి వ‌ద్దే వ‌ద్దు అంటున్నార‌ట‌.

తనను తప్పించాలని కోరుతూ….

అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గానికి ఒక సెంటిమెంట్ ఉంది. పార్టీల‌తో సంబంధం లేకుండా .. నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు గెలిచినా.. ఈ సెంటిమెంట్ వ‌ర్కవుట్ అవుతుండ‌డంతో అంద‌రూ హ‌డ‌లి పోతు న్నారు. ప్రస్తుతం ఉర‌వ‌కొండ వైసీపీ ఇంచార్జ్‌గా విశ్వేశ్వర‌రెడ్డి ఉన్నారు. అయితే, ఆయ‌న అనారోగ్య కార‌ణాల‌తో త‌న‌ను త‌ప్పించాల‌ని కోరుతూ.. జ‌గ‌న్‌కు లేఖ పంపార‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. 2014లో వైసీపీ టికెట్‌పై విజ‌యం సాధించిన విశ్వేశ్వర‌రెడ్డికి జ‌గ‌న్ ద‌గ్గర మంచి మార్కులే ఉన్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న స‌మ‌యంలో ఆయ‌న దూకుడుగా వ్యవ‌హ‌రించారు. అదే స‌మ‌యంలో ఇప్పుడు కూడా టీడీపీకి చెక్ పెడుతున్నారు.

కొందరు నేతల పేర్లతో….

ఇక్కడ నుంచి పయ్యావుల కేశ‌వ్‌.. విజ‌యంసాధించిన‌ప్పటికీ.. విశ్వేశ్వర‌రెడ్డిదే పైచేయిగా సాగుతోంది. అయితే, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న అనారోగ్యం బారిన‌ప‌డ్డారు. ప్రభుత్వ ప‌థ‌కాల‌ను ప్రచారం చేయ‌డంలోను, స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లోనూ చురుగ్గా పాల్గొన‌లేక పోయారు. దీంతో పార్టీ ఆయ‌న‌ను సంజాయిషీ కోరింది. దీంతో తాను ఇంచార్జ్‌గా చేయ‌లేన‌ని, కేవ‌లం స‌భ్యుడిగా మాత్రం ఉంటాన‌ని, ఈ స్థానంలో ఎవ‌రినైనా నియ‌మించాల‌ని కోరుతూ ఆయ‌న లేఖ పెట్టారు. దీంతో ఇక్కడ ఇంచార్జ్‌గా నియ‌మించేందుకు ఓనలుగురి పేర్లను ప‌రిశీలించిన పార్టీ అధిష్టానం.. వారిని పిలిచి మాట్లాడిన‌ప్పుడు.. మాకు వ‌ద్దు సార్‌! అని నిర్మొహ‌మాటంగా చెప్పుకొచ్చార‌ట‌. దీంతో ఖంగుతిన్నార‌ట పార్టీ కీల‌క నేత‌లు.

సెంటిమెంట్ కూడా….

ప్రస్తుతం ఇది సీమ‌ వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంత‌కీ దీనికి కార‌ణం.,. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో గెలిస్తే.. గెలిచిన అభ్యర్థి తాలూకు పార్టీ అధికారం కోల్పోవ‌డ‌మే. దీంతో స‌దరు నేత‌పై ఐర‌న్ లెగ్ అనే పేరు ప‌డ‌డంతోపాటు.. పార్టీలోనూ చిన్నచూపు చూస్తున్నార‌ట‌. నిజానికి ఇప్పటి వ‌ర‌కు కూడా జ‌రిగింది అదే. ఇక్కడ నుంచి ఎవ‌రు గెలిచినా.. ఆ అభ్యర్థి తాలూకు పార్టీ ఎన్నిక‌ల్లో ఓడిపోయి ప్రతిప‌క్షంలో కూర్చుంటోంది. ఈ క్రమంలోనే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అభివృద్ధి జ‌ర‌గ‌క బాగా వెన‌క‌ప‌డిపోయింది. దీంతో ఇక్కడ చాలా మంది నాయ‌కులు ఇదే విధంగా ప్రజ‌ల నుంచి వ్యతిరేక‌త కొని తెచ్చుకున్నారు. దీంతో వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ కూడా ఇక్కడ ఇన్‌చార్జ్ ప‌ద‌వి చేప‌ట్టేందుకు సాహ‌సించ‌డం లేదు. దీంతో ప్రస్తుతానికి ఈ ప్రతిపాద‌నను ప‌క్కన పెట్టారు.

Tags:    

Similar News