కొట్టుకుంటున్నా …. అంతమే కదా?
అధికారంలోకి రాక ముందు వరకూ అంతా సవ్యంగానే కన్పించింది. ఇలా వచ్చిందో లేదో రోజులు తిరగకముందే అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయి. ఆధిపత్యంకోసం నేతల మధ్య ముదలయిన విభేదాలు రాష్ట్రంలోని [more]
అధికారంలోకి రాక ముందు వరకూ అంతా సవ్యంగానే కన్పించింది. ఇలా వచ్చిందో లేదో రోజులు తిరగకముందే అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయి. ఆధిపత్యంకోసం నేతల మధ్య ముదలయిన విభేదాలు రాష్ట్రంలోని [more]
అధికారంలోకి రాక ముందు వరకూ అంతా సవ్యంగానే కన్పించింది. ఇలా వచ్చిందో లేదో రోజులు తిరగకముందే అసంతృప్తులు పెల్లుబుకుతున్నాయి. ఆధిపత్యంకోసం నేతల మధ్య ముదలయిన విభేదాలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ముదిరిపోతున్నాయి. కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం వీటినేమిటినీ పట్టించుకోవడం లేదు. విభేదాలను పరిష్కరించే బాధ్యతలను నేతలకు అప్పగించారు. వారు కూడా ఎటు చెబితే ఏం సమస్య వస్తుందోనని సమస్యను మరింత ముదిరేలా చేస్తున్నారు.
ఉరవకొండ నియోజకవర్గంలో…..
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గాన్ని తీసుకుంటే ఇదే పరిస్థితి మనకు కన్పిస్తుంది. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించింది. పయ్యావుల కేశవ్ గెలిచారు. రాష్ట్రమంతటా జగన్ ప్రభంజనం వీచినా ఇక్కడ ఓడిపోవడానికి గల కారణాలను వైసీపీ నేతలు అన్వేషించుకోకుండా ఆధిపత్యానికి తెరతీయడం చర్చనీయాంశమైంది. ఉరవకొండ నుంచి 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోయినా ఆయన పార్టీని, జగన్ నమ్ముకుని ఉన్నారు.
టిక్కెట్ దక్కలేదని……
2019 ఎన్నికల్లోనూ జగన్ విశ్వేశ్వర్ రెడ్డికి టిక్కెట్ కేటాయించారు. అయితే కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్సీ శివరామరెడ్డి తన కుమారుడు భీమ్ రెడ్డి కి టిక్కెట్ కోసం ప్రయత్నించారు. కానీ జగన్ ఇవ్వకపోవడంతో కలసి పనిచేయలేదు. ఫలితంగా ఉరవకొండ చేజారిపోయింది. ప్రస్తుతం ఉరవకొండ పార్టీ ఇన్ ఛార్జిగా విశ్వేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన నాయకత్వంలో పనిచేయడానికి శివరామరెడ్డి వర్గం ఇష్టపడటం లేదు.
అధినాయకత్వం పట్టించుకోక…..
ఫలితంగా రెండు గ్రూపుల మధ్య గత కొద్దిరోజులుగా వార్ నడుస్తుంది. పార్టీ కార్యక్రమాలు కూడా ఎవరికి వారు విడిగా చేస్తున్నారు. దీంతో క్యాడర్ అయోయమంలో పడింది. అధికారుల బదిలీలు, కాంట్రాక్టుల విషయంలోనూ రెండు గ్రూపులూ ప్రయత్నించడం రచ్చకు దారితీస్తున్నాయి. వైసీపీ అధినాయకత్వానికి ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఉరవకొండ వైసీపీలో ఆధిపత్య పోరు ఎటువైపు దారితీస్తుందనే ఆందోళన క్యాడర్ లో నెలకొంది.