బెజవాడ వైసీపీలో పోరు మొదలు.. ఏం జరుగుతోందంటే?
రాజకీయ రాజధాని బెజవాడ మరోసారి పొలిటికల్‌గా హీటెక్కింది. నిన్న మొన్నటి వరకు టీడీపీ వర్సెస్ వైసీపీ అని సాగిన ఇక్క డి రాజకీయాలు ఇప్పుడు వైసీపీలోనే నేతల [more]
రాజకీయ రాజధాని బెజవాడ మరోసారి పొలిటికల్‌గా హీటెక్కింది. నిన్న మొన్నటి వరకు టీడీపీ వర్సెస్ వైసీపీ అని సాగిన ఇక్క డి రాజకీయాలు ఇప్పుడు వైసీపీలోనే నేతల [more]
రాజకీయ రాజధాని బెజవాడ మరోసారి పొలిటికల్‌గా హీటెక్కింది. నిన్న మొన్నటి వరకు టీడీపీ వర్సెస్ వైసీపీ అని సాగిన ఇక్క డి రాజకీయాలు ఇప్పుడు వైసీపీలోనే నేతల మధ్య తీవ్ర వివాదాలను, విభేదాలను సాగిస్తున్నాయి. గత ఎన్నికల్లో విజయవాడ లోని మూడు నియజకవర్గాల్లో రెండు చోట్ల వైసీపీ దూకుడు ప్రదర్శించింది. పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో విజయం సాధించింది. గెలిచిన ఇద్దరూ కూడా ఒకరు వైశ్య సామాజిక వర్గం అయితే, మరొకరు బ్రాహ్మణ సామాజిక వర్గం. ఈ క్రమంలో ఇద్దరికీ కూడా వైఎస్ జగన్ కీలకమైన పదవులు ఇచ్చి గౌరవించారు. పశ్చిమ నుంచి గెలిచిన వెలంపల్లి శ్రీనివాసరావుకు మంత్రి పదవి అప్పగించారు. అది కూడా దేవాదాయ శాఖను ఇచ్చారు.
కీలక పదవులు అప్పగించినా…..
ఇక, సెంట్రల్ నుంచి గెలిచిన మల్లాది విష్ణుకు ఏకంగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించారు. అంటే జగన్ ఉద్దేశం క్లారిటీగానే ఉంది. ఇద్దరు నాయకులు కూడా పార్టీని డెవలప్ చేయాలని, కీలకమైన విజయవాడ నగరంలో టీడీపీకి అవకాశం లేకుండా వైసీపీని పరుగులు పెట్టించాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి నగరంలో తిరుగులేని శక్తిగా వైసీపీని పుంజుకునేలా చేయాలని ఆయన భావించారు. అయితే, దీనికి విరుద్ధంగా ఈ ఇద్దరు నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఆధిపత్య రాజకీయాలకు తెరదీస్తున్నారు. మంత్రిగా నేను చెప్పిందే జరగాలని వెలంపల్లి భావిస్తున్నారు. ఇక, ఎమ్మెల్యేగా తనకు ప్రాధాన్యం ఎక్కడ తగ్గిపోతుందోననే భావనతో మంత్రిపై పరోక్షంగా యాంటీ ప్రచారం చేస్తున్నారు మల్లాది విష్ణు.
ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో….
దీంతో విజయవాడలో ఎక్కడ విన్నా ఈ ఇద్దరి ముచ్చటా జోరుగా వినిపిస్తోంది. ఇటీవల సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన ఓ రిటైర్డ్ ఈవో(దేవాదాయ శాఖ) తనకు పింఛన్‌కు సంబంధించిన బెనిఫిట్స్ ఆగిపోయాయని హెల్ప్ చేయాలని ఎమ్మెల్యే విష్ణును కోరారు. దీంతో ఆయన మంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి సిఫారసు చేశారు. అయితే దీనికి ప్రతిగా మంత్రి కార్యాలయం సదరు రిటైర్డ్ అధికారికి ఫోన్ చేసి ఎమ్మెల్యేతో సిఫార్సు చేయించినంత మాత్రాన మేం చేసేయాలా ? అంటూ పీఆర్వో ప్రశ్నించారని తెలిసింది. దీంతో సదరు రిటైర్డ్ అధికారి ఇప్పుడు మంత్రి కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ ఈయన పని సాగలేదు.
గైర్హాజరై వెల్లంపల్లి…
పైగా ముందు మీరు ఎమ్మెల్యే ఆఫీస్‌కు వెళ్లారు కాబట్టి.. అంటూ.. మంత్రి అనుచరులు ఈసడిస్తున్నారట. దీంతో సదరు అధికారి లబోదిబోమంటున్నారు. ఇది మచ్చుకు ఒక సంఘటన మాత్రమే. ఇటీవల బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా మల్లాది విష్ణు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. దీనికి స్పీకర్ తమ్మినేనిని కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే మంత్రి వెలంపల్లికి కూడా ఆహ్వానం పంపారు. కానీ, వెలంపల్లి మాత్రం ఆరోజు అసలు విజయవాడలోనే లేకుండా తప్పించుకు న్నారు.అయితే, ఆయన ఉద్దేశ పూర్వకంగానే డుమ్మాకొట్టారని ఎమ్మెల్యే వర్గం భావిస్తోంది. ఇక త్వరలో జరిగే విజయవాడ నగర పాలక సంస్థ ఎన్నికల్లోనూ ఎవరికి వారు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు తమ వర్గానికి ఇప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరికి పదవులు ఉన్నా మరి ఇంతలా ఎందుకు విభేదాలు సాగుతున్నాయి? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.