చిన్న తప్పుకు పెద్ద శిక్ష…. అనుభవించాల్సిందేనా?

గౌరవం, విలువ అన్నవి రాజకీయాల్లో సందర్భం, అవసరాన్ని బట్టి వస్తాయి. అవతల పక్షం అక్కున చేర్చుకునేంతవరకూ ఓపికగా అందుకే ఉంటారు. అది పెద్ద వ్యూహం కూడా. అది [more]

Update: 2020-04-05 02:00 GMT

గౌరవం, విలువ అన్నవి రాజకీయాల్లో సందర్భం, అవసరాన్ని బట్టి వస్తాయి. అవతల పక్షం అక్కున చేర్చుకునేంతవరకూ ఓపికగా అందుకే ఉంటారు. అది పెద్ద వ్యూహం కూడా. అది అందరికీ చేతకాదు, చేతనైనా కూడా పరిస్థితులు అనుకూలించక వెనక్కి తిరిగిరావాల్సిఉంటుంది. విశాఖ జిల్లాలో తీసుకుంటే అలాంటి వారు చాలామంది వైసీపీలో కనిపిస్తారు. వీరంతా పార్టీ పెట్టినపుడు ఉన్న వారు కారు, మధ్యలో వచ్చారు. మళ్ళీ వెళ్ళిపోయారు. తిరిగి వచ్చారు. మరి వీరిని హై కమాండ్ ఎలా సమాదరిస్తుంది. వచ్చారు కాబట్టి కండువా కప్పి జాగ్రత్తగా ఓ పక్కన కూర్చోమంటుంది. అది ఈ సరికే సీనియర్ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు విషయంలో రుజువు అవుతూ వచ్చింది.

బ్యాడ్ లక్కేనా….

విశాఖ ఉత్తర నియోజకవర్గం విషయం గత ఏడాది సార్వత్రిక ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా ఉంది. అందరి దృష్టిని కూడా ఈ సీటు ఆకట్టుకుంది. దానికి కారణం నాడు మంత్రిగా ఉన్న గంటా శ్రీనివాస్ ఇక్కడ పోటీ చేయడమే. ఆయన ఆ సీటుకు కొత్త, చివరి నిముషంలో వచ్చారు. ఆయనకు పోటీగా వైసీపీ నుంచి కేకే రాజు చాలా ఏళ్ళుగా అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. అయితే ఆయనకు టికెట్ ఇవ్వడంతో అసంతృప్తికి లోనైన మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ పోలింగుకు వారం రోజులు ఉందనగా టీడీపీలోకి జంప్ చేసారు. ఆ విధంగా ఆయన బ్యాడ్ లక్ ని నెత్తిన కోరి తెచ్చిపెట్టుకున్నారు.

హామీలు గాలికే…

ఇక టీడీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని, తాను మేయర్ కావచ్చునని ఆశతోనే ఆయన నాడు జంప్ చేశారని అంటారు. ఆయన టీడీపీ నుంచి జంప్ చేయడం వల్లనే గంటా అతి తక్కువ ఓట్లతో గెలిచారని కూడా చెబుతారు. ఆ విధంగా వైసీపీ అభ్యర్ధిని ఓడించడంలో కీలకమైన పాత్ర పోషించిన తైనాల టీడీపీలో బావుకోవడానికి ఏమీ మిగలలేదు. దాంతో ఆయన తిరిగి వైసీపీలోకి వచ్చి చేరిపోయారు. అయితే తనకు పదవులు ఇస్తే చేరుతాన‌ని గట్టిగా కండిషన్ పెట్టలేకపోయారు. కారణం ఆయన చేరికనే ఉత్తర నియోజకవర్గం వైసీపీ నేతలు వ్యతిరేకించడమే.

అదే పదవా…?

అధికార పార్టీలో చేరాను అన్న తృప్తే తప్ప అంతకు మించి పదవి ఏదీ తైనాలకు ఇపుడు దక్కేలా కనిపించడంలేదు. ఒకవేళ ఆయనకు ఇవ్వాలని హై కమాండ్ భావించినా మొత్తానికి మొత్తం వైసీపీ నేతలు గట్టిగా వ్యతిరేకించి తీరడం ఖాయం. ఈ పరిణామాలతో తైనాల కనీసం వచ్చే ఎన్నికల్లోనైనా టికెట్ వస్తుందన్న ఆశతో కూడా లేరుట. మళ్ళీ 2024లో వైసీపీ గెలిస్తే అప్పటికి కుదురుగా ఆయన వైసీపీలో ఉంటే కనుక అపుడే ఆయనకు ఏదైనా నామినేటెడ్ పదవి దక్కుతుందని పార్టీలో వినిపిస్తున్న మాట. అంటే దర్జాగా పార్టీలో పదవులు అడగాల్సిన నేత, పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉన్న నేత, చివరి నిముషంలో చేసిన తప్పుకు ఇపుడు పార్టీలో చాలా వెనక్కి నెట్టబడిన నేతగా మిగిలారన్నమాట. ఇలాంటి నేతలు వైసీపీలో ఇపుడు చాలామందే ఉన్నారు. వారందరూ మాదే ప్రభుత్వం అని చెప్పుకోవడం తప్ప చిన్నపాటి పదవికైనా పోటీ పడే సీన్ లేదని అంటున్నారు.

Tags:    

Similar News