ఇదే మంచి సమయం.. ఆలసించిన ఆశాభంగం?

నేడు ఏ రంగం తీసుకున్నా.. దానిలో ఎంతో కొంత పోటీ ఉంటోంది. దీనిని కాద‌న‌లేని వాస్తవంగానే మ‌నం పేర్కొంటున్నారు. అది రాజ‌కీయాల్లోనూ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, [more]

Update: 2020-05-02 11:00 GMT

నేడు ఏ రంగం తీసుకున్నా.. దానిలో ఎంతో కొంత పోటీ ఉంటోంది. దీనిని కాద‌న‌లేని వాస్తవంగానే మ‌నం పేర్కొంటున్నారు. అది రాజ‌కీయాల్లోనూ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే, ఇప్పుడు అన్ని దారులూ మూసుకుపోయి. కేవ‌లం వైసీపీ అనే ఏకైక దారి మాత్రమే క‌నిపిస్తుండ‌డంతో తామ‌ర తంప‌ర‌లా నాయకులు ఈ పార్టీలో చేరిపోయిన విష‌యం తెలిసిందే. ఇంకా వ‌స్తారేమో తెలియ‌దు.. పార్టీ ప్రధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌యసాయి రెడ్డి చెప్పిన‌ట్టు.. ఇంకా చేరేవారు ఎవ‌రైనా ఉంటే ఉండొచ్చు.

పోటీ తీవ్రంగా…..

అయితే, ఇప్పటికే పార్టీలో ఉన్న సీనియ‌ర్లు, పార్టీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీలోకి వ‌చ్చిన జూనియర్లు (వాస్తవానికి వీరు రాజ‌కీయ ఉద్ధండులే అయినా వైసీపీలో జూనియ‌ర్లే క‌దా అంటున్నారు) కూడా ఒక‌రిని మించి ఒక‌రు పార్టీలో పైచేయి సాధించేందుకు , అధినేత‌, సీఎం జ‌గ‌న్ దృష్టిలో ప‌డేందుకు పోటీ ప‌డుతున్నారు. విష‌యం ఏదైనా కావొచ్చు.. నాయ‌కులు పోటీ మీద పోటీ ప‌డుతున్నారు. ఏ ఒక్క విష‌యంలో అయినా మిస్ అ యితే.. జ‌గ‌న్ ద‌గ్గర మైన‌స్ మార్కులు ప‌డ‌తాయేమోన‌ని నాయ‌కులు త‌ల్లడిల్లుతున్నారు.

విరాళాలు సేకరించే….

తాజాగా క‌రోనా లాక్‌డౌన్‌తో రాష్ట్ర వ్యాప్తంగా పేద‌ల‌కు, వ‌ల‌స కూలీల‌కు ఇబ్బందులు ఎదుర‌వుతున్న విషయం తెలిసిందే. ఇక‌, ప్రభుత్వం త‌ర‌ఫున చేయాల్సిన ప‌నులు చాలానే ఉన్నాయి. పైగా క‌రోనా బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను మ‌రింత‌గా పొడిగించే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వం కూడా దాత‌ల నుంచి సాయం కోరుతోంది. ఈ విష‌యాన్ని సీఎం జ‌గ‌నే స్వయంగా ప్రక‌టించారు. సాయం చేయాల‌ని కోరారు. అంతే… వైసీపీలో నాయ‌కులు పోటీ ప‌డి మ‌రీ విరాళాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు.

జగన్ వద్దకు తీసుకెళ్లి….

ఇత‌ర పార్టీల్లో ఉన్న నాయ‌కుల‌కు కూడా ఫోన్లు చేసి త‌మ ప‌లుకుబ‌డిని వినియోగించి ల‌క్షలో, కోట్ల రూపాయ‌లో సాయం చేసేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. వీరిలో కొత్తగా వ‌చ్చిన‌వారు, పాత నాయ‌కులు కూడా జ‌గ‌న్ ద‌గ్గర మార్కులు కొట్టేసేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, విరాళాలు ఇచ్చే దాత‌ల‌ను తామే ద‌గ్గర పెట్టుకుని మ‌రీ జ‌గ‌న్ వ‌ద్దకు తీసుకు వెళ్తున్నారు. సీఎం ఎంత బిజీగా ఉన్నా.. ఎన్నిగంట‌లైనా వెయిట్ చేసి మ‌రీ ఆయ‌న‌ను క‌లుస్తున్నారు. దీనిని చూసిన వారు వీరికి పార్టీ అంటే.. రాష్ట్రంలో పేద‌లంటే. ఎంత భ‌క్తి అనుకుంటున్నారు. అయితే, తాజాగా పార్టీలోని విశ్లేష‌కుడు ఒకాయ‌న మాత్రం.. ఈ భ‌క్తంతా .. ప‌ద‌వుల మీదే..!? అని మీడియా మిత్రుల‌తో అన‌డం కొస‌మెరుపు.

Tags:    

Similar News