జిల్లా…జిల్లాకు మారుతున్న వైసీపీ పాలిటిక్స్.. మంచికేనా?

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవ‌హార శైలిని గ‌మ‌నిస్తే.. జిల్లాకో విధంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది [more]

Update: 2020-05-16 11:00 GMT

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల వ్యవ‌హార శైలిని గ‌మ‌నిస్తే.. జిల్లాకో విధంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాది పూర్తయింది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు జిల్లాల వారీగా నేత‌ల ప‌నితీరు, స‌మ‌న్వయం, అభివృద్ధి వంటివి వాటిని ప‌రిశీలిస్తే.. చాలా చిత్రమైన అంశాలు క‌నిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు క‌లిసి మెలిసి ప‌నిచేసుకుంటున్నారు. అదే స‌మ‌యంలో మంత్రులు , జిల్లా ఇంచార్జ్ మంత్రులు కూడా క‌లిసి మెలిసి ఉంటున్నారు. కానీ, కొన్ని జిల్లాల్లో ప‌రిస్థితి మాత్రం ఒక‌రిపై ఒక‌రు క‌త్తులు నూరుతున్నారు. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌డం లేదు. ఎమ్మెల్యేలు-ఎమ్మెల్యేలు, ఎంపీలు-ఎంపీలు కూడా దూరాభారంగా వ్యవ‌హ‌రిస్తున్న జిల్లాలు క‌నిపిస్తున్నాయి.

గంటూరు జిల్లాలో….

గుంటూరు జిల్లా ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. ఇక్కడ మొత్తం మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి. వీటిలో ఒక‌టి మాత్రమే టీడీపీగెలిచింది. మిగిలిన రెండు కూడా వైసీపీ నేత‌లే విజ‌యంసాధించారు. దీనిలో ఒకటి ఎస్సీ వ‌ర్గానికి కేటాయించారు. ఇద్దరూ కొత్త యువ నాయ‌కులే విజ‌యం సాధించారు. అయితే, వీరిలో న‌ర‌స‌రావు పేట ఎంపీ దేవ‌రాయులు అంద‌రితోనూ క‌లిసిపోయి.. ప‌నిచేస్తున్నారు. అదే స‌మ‌యంలో బాప‌ట్ల ఎంపీ సురేష్ మాత్రం కొంద‌రితోనే స‌ఖ్యత‌గా ఉంటున్నారు. ఇక‌, ఇదే జిల్లాలో ఎమ్మెల్యేలు కూడా ఇదే ప‌ద్ధతిలో ఉన్నారు. మొత్తం ముగ్గురు మ‌హిళ‌లు ఇక్కడ నుంచి విజ‌యం సాధిస్తే.. ఒక‌రు మంత్రిగా ఉన్నారు. హోం మంత్రిగా ఉన్న సుచ‌రిత‌.. త‌ట‌స్థంగా ఉంటే.. మిగిలిన ఇద్దరూ కూడా ఒక‌రిపై ఒక‌రు ర‌గ‌డ చేసుకుంటున్నారు.

వివాదానికి కేంద్రంగా…

ఇక‌, ప‌శ్చిమ గోదావ‌రి విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ ఒక‌రు మ‌హిళా మంత్రి ఉన్నారు. కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వ‌నిత మంత్రి. అదే స‌మ‌యంలో శ్రీరంగ‌నాథ‌రాజు కూడా మంత్రిగా ఉన్నారు. ఆళ్ల నాని డిప్యూటీ సీఎం. అయితే, ఈ ముగ్గురిలోనూ వ‌నిత అంద‌రితోనూ క‌లిసిమెలిసి ప‌నిచేసుకుంటున్నారు. ఇక‌, ఏలూరు ఎంపీ కూడా అంద‌రితోనూ క‌లిసి మెలిసి వివాదాల‌కు అతీతంగా ముందుకు సాగుతున్నారు. నియోజ‌క వ‌ర్గం అభివృద్ధి, ప్రజాప్రతినిధుల‌ను క‌లుపుకొని పోవ‌డం వంటివి చేస్తున్నారు. ఇక‌, ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ త‌ట‌స్థంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఇక‌, రంగ‌నాథ‌రాజు.. మాత్రం త‌న‌కు సంబంధం లేని విష‌యాల్లోనూ త‌ల‌దూరుస్తూ.. వివాదాల‌కు కేంద్రంగా మారుతున్నారు.

ఎవరి దారి వారిదే….

కృష్ణాలోనూ ప‌రిస్థితి ఒకింత ఇబ్బందిగానే ఉంద‌ని చెప్పాలి. ఆధిప‌త్య ధోర‌ణి ఎవ‌రి విష‌యంలోనూ క‌నిపించక పోయినా.. ప‌ర‌స్పరం స‌హ‌క‌రించుకోవ‌‌డం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ రెండు ఎంపీ స్థానాలు ఉంటే.. ఒక‌టి టీడీపీ ద‌క్కించుకుంది. మిగిలిన ఒక‌టి వైసీపీకే ద‌క్కింది. మ‌చిలీప‌ట్నం నుంచి గెలిచిన బాల‌శౌరి కూడా అంద‌రితోనూ క‌లివిడిగా ఉన్నారు. ఇక‌, మంత్రులు వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు, కొడాలి నాని విష‌యానికి వ‌స్తే.. ఎవ‌రి దారివారిదే అన్నట్టుగా ఉన్నారు. ఎమ్మెల్యేల విష‌యం కూడా ఇలానే ఉంది.

గ్రూపులుగా విడిపోయి….

ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్నట్టుగా ఉంది. ఎవ‌రికి తోచిన ప‌ని వారు చేస్తున్నారు. న‌గ‌రంలో వెల్లంప‌ల్లికి మ‌ల్లాదికి ప‌డ‌దు. అటు తూర్పులో భ‌వ‌కుమార్‌కు, అవినాష్‌కు పొస‌గ‌దు. ఇక గ‌న్నవ‌రంలో ఎమ్మెల్యే వంశీకి, యార్లగ‌డ్డకు ప‌డ‌డం లేదు. యార్లగ‌డ్డ చివ‌ర‌కు గ‌న్నవ‌రంకు దూర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది. ప్రకాశం జిల్లాలో వైవీది ఒక దారి.. మంత్రి బాలినేనిది మ‌రోదారి. ఒక‌రితో ఒక‌రికి స‌ఖ్యత లేదు. మొత్తంగా చూస్తే.. చాలా జిల్లాల్లో ఈ త‌ర‌హా ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News