బెజవాడ వైసీపీలో ఆ ఇద్దరికీ తిరుగులేదుగా
రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. బెజవాడలో ఓ ఇద్దరు నాయకులకు మా త్రం తిరుగులేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరకీ పోటీ [more]
రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. బెజవాడలో ఓ ఇద్దరు నాయకులకు మా త్రం తిరుగులేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరకీ పోటీ [more]
రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ వైసీపీ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. బెజవాడలో ఓ ఇద్దరు నాయకులకు మా త్రం తిరుగులేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరకీ పోటీ లేకపోగా.. వారి హవాకు అడ్డు వచ్చే నాయకుడు కూడా కనిపించడం లేదు. దీంతో వారు తమదైన పంథాలో ముందుకు సాగుతున్నారనే వాదన విని పిస్తోంది. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. దాదాపు 150 స్థానాల్లో వైసీపీలోనే నాయకులు నువ్వంటే నువ్వని ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఒకరుఎడ్డెం అంటే.. మరొకరు తెడ్డం అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వీళ్లు రాజులు…
వీరిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అయితే, అనూహ్యంగా బెజవాడలో మాత్రం ఇద్దరు కీలక నాయకులకు పోటీ లేదు సరికదా.. వారి మాటకు ఎదురు వచ్చే నాయకుడు కూడా సదరు నియోజకవర్గాల్లో లేక పోవడం గమనార్హం. దీంతో ఈ ఇద్దరి రాజకీయం ఆసక్తిగా మారింది. వారే ఒకరు సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే కమ్ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌లు. ఈ ఇద్దరికీ కూడా వారి వారి నియోజకవర్గాల్లో నెంబర్-2 నేతలు లేరు. వీరే రాజులు. వీరే మంత్రులు. వాస్తవానికి గత ఎన్నికలకు ముందు సెంట్రల్ నియోజకవర్గంలో వంగవీటి రాధా ఉండేవారు.
తిరుగు లేకపోవడంతో….
అయితే, తనకు టికెట్ ఇవ్వలేదనే అలకతో ఆయన ఏకంగా పార్టీ వీడిపోయారు. దీంతో ఇక్కడ మల్లాది విష్ణు తర్వాత ఆయనకు పోటీ వచ్చే నాయకుడు పార్టీలోనే కనిపించడం లేదు. ఇక, వెలంపల్లి శ్రీనివాస్ కి అసలు ఆది నుంచి కూడా ఎవరూ పోటీ లేరు. పార్టీలో ఆయన పశ్చిమ నియోజకవర్గానికి సర్వస్వం. ఆయన చెప్పిందే వేదం. ఆయనను కాదనే వారు, ఆయనకు పోటీ ఇచ్చేవారు కూడా సమీప భవిష్యత్తులో కూడా కనిపించడం లేదు. దీంతో ఈ ఇద్దరు తమదైన శైలిలో దూసుకుపోతున్నా.. లేక చతికిల పడినా అడిగే వారు లేరు. ఇక, మూడో నియోజకవర్గం తూర్పు ఉన్నా.. ఇక్కడ ఇద్దరు నాయకుల మధ్య నిత్యం ఏదో ఒక పంచాయితీ నడుస్తోంది.
కలసి వచ్చే అంశమేనా?
యువనేత, ఇటీవల పార్టీలోకి వచ్చిన దేవినేని అవినాష్, విజయవాడ ఇంచార్జ్, తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొప్పన భవకుమార్ ఉన్నారు. వీరిద్దరూ కూడా నియోజకవర్గంపై ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. సో.. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో మాత్రం ఈ పరిస్థితి లేకపోవడం వైసీపీకి కలిసి వచ్చిన అంశంగా మారిందని చెబుతున్నారు. ఇందులోనూ సెంట్రల్‌లో అయితే.. టీడీపీ హవా ఓ రేంజ్‌లో ఉంది. పశ్చిమలో అది కూడా లేదు. మరి ఇక, పార్టీని ఎలా ముందుకు తీసుకు వెళ్తారో చూడాలి.