ఆ కుర్చీ కోసం కొట్లాట తప్పేట్లు లేదుగా?
మహా విశాఖ నగర పాలన సంస్థ (జీవీ ఎంసీ) ఎన్నికలు ఇప్పటికైతే వాయిదా పడ్డాయి కానీ, ఆశావహుల కోరికలు మాత్రం ఎక్కడా ఆగడంలేదు. ఇప్పటిదాకా మేయర్ కుర్చీ [more]
మహా విశాఖ నగర పాలన సంస్థ (జీవీ ఎంసీ) ఎన్నికలు ఇప్పటికైతే వాయిదా పడ్డాయి కానీ, ఆశావహుల కోరికలు మాత్రం ఎక్కడా ఆగడంలేదు. ఇప్పటిదాకా మేయర్ కుర్చీ [more]
మహా విశాఖ నగర పాలన సంస్థ (జీవీ ఎంసీ) ఎన్నికలు ఇప్పటికైతే వాయిదా పడ్డాయి కానీ, ఆశావహుల కోరికలు మాత్రం ఎక్కడా ఆగడంలేదు. ఇప్పటిదాకా మేయర్ కుర్చీ నాదీ అని విశాఖ సిటీ వైసీపీ ప్రెసిడెంట్ వంశీ కృష్ణ గట్టి నమ్మకంతో ఉన్నారు. ఆయన తనకు అధినేత జగన్ స్వయంగా హామీ ఇచ్చారని కూడా చెప్పుకున్నారు. ఈ నేపధ్యంలో నుంచి చూసుకున్నపుడు న్యాయంగా ఆయనకే దక్కాలి. కానీ మరో ప్రధాన సామాజిక వర్గం నుంచి ఇపుడు మేయర్ సీటు కోసం గట్టి పోటీ ఎదురవుతోంది.
వారి టార్గెట్……?
విశాఖ జిల్లా రాజకీయాల్లో గవర సామాజికవర్గం రాజకీయంగా బాగా క్రియాశీలంగా ఉంది. వారి కనీసంగా రెండు నుంచి మూడు ఎమ్మెల్యే సీట్లతో పాటు అనకాపల్లి ఎంపీ సీటుని కూడా దక్కించుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అనకాపల్లి ఎంపీ సీటు మాత్రమే గవర సామాజిక వర్గానికి దక్కింది. అయితే విశాఖ సిటీ రాజకీయాల్లో వారి పాత్ర పరిమితంగా ఉందిట. దాంతో దాన్ని భర్తీ చేసుకోవడానికి మేయర్ పీఠమే కావాలని అడుగుతున్నారు.
ఆయనే పోటీ…..
విశాఖ నగర శివారు అయిన పెందుర్తికి చెందిన్ కాంగ్రెస్ సీనియర్ నేత శరగడం చిన అప్పలనాయుడు గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆయన్ని విశాఖ రూరల్ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా వైసీపీ పెద్దలు నియమించారు. ఓ దశలో ఆయన్ని అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా కూడా పరిశీలించారు. ఆ తరువాత వైద్యురాలు వైసీపీలో చేరడంతో ఆమెకు టికెట్ ఇవ్వడం, గెలవడం చకచకా జరిగిపోయాయి. నాటి నుంచి శరగడం ఖాళీ అయిపోయారు. తనకు కీలకమైన పదవి కావాలని ఆయన హై కమాండ్ మీద వత్తిడి తెస్తున్నారు. పైగా టీడీపీలో ప్రధాన భూమిక పోషిస్తున్న తమ గవర సామాజిక వర్గానికి వైసీపీలో కూడా అంతే ప్రాధ్యాన్యత దక్కాలని ఆ వర్గం బలంగా కోరుకుటోంది. దాంతో శరగడంకు కార్పోరెటర్ గా టికెట్ ఇచ్చారు. పరోక్ష పద్ధతి కనుక ఆయన నెగ్గితే మేయర్ రేసులో ముందు వరసలోనే ఉంటారని అంటున్నారు.
కులాల కుమ్ములాటే….
ఇక చూసుకుంటే విశాఖ మేయర్ కోసం వైసీపీలో కులాల కుమ్ములాట మొదలైపోయినట్లే కనిపిస్తోంది. విశాఖ అర్బన్ జిల్లాలో యాదవులు, గవరలు, వెలమలు కూడా రాజకీయంగా ముఖ్య భూమిక పోషిస్తున్నారు. అయితే మేయర్ పీఠం ఏ సామాజిక వర్గానికి అప్పగించినా మిగిలిన వర్గాలు గుస్సా అవుతాయి. దాంతో పాటు నాయకులు రేసులో ఎక్కువగా ఉన్నారు. వీటిని కనుక గమనంలోకి తీసుకుంటే మాత్రం మహా మేయర్ ఎంపిక వైసీపీకి కత్తి మీద సామే. మొత్తం మీద ఎవరిని ఆ ఉన్నత పీఠం దక్కనుందో చూడాలి.