లోకేష్‌ను పెద్దోడ్ని చేస్తున్నామా… వైసీపీలో గుస‌గుస‌

విమ‌ర్శలు – ప్రతివిమ‌ర్శలు, ఎత్తులు-పైఎత్తులు.. రాజ‌కీయాల్లో కామ‌న్. ఈ నేప‌థ్యంలో ప్రత్య‌ర్థుల‌పై రాజ‌కీయ నేత‌లు విమ‌ర్శలు చేస్తూ ఉంటారు. ఏపీలో ఇలాంటి వెంట‌నే వినిపిస్తున్నాయి. పోక చెక్కతో [more]

Update: 2020-09-21 00:30 GMT

విమ‌ర్శలు – ప్రతివిమ‌ర్శలు, ఎత్తులు-పైఎత్తులు.. రాజ‌కీయాల్లో కామ‌న్. ఈ నేప‌థ్యంలో ప్రత్య‌ర్థుల‌పై రాజ‌కీయ నేత‌లు విమ‌ర్శలు చేస్తూ ఉంటారు. ఏపీలో ఇలాంటి వెంట‌నే వినిపిస్తున్నాయి. పోక చెక్కతో నువ్వు రెండంటే.. త‌లుపు చెక్కతోనే నాలుగంటా! అనే కోణంలో.. నాయ‌కులు ప‌ర‌స్పరం విమ‌ర్శించుకోవ‌డం తెలిసిందే. అయితే, వైసీపీలో ఇలాంటి ప్రతివిమ‌ర్శల ప‌ర్వంపై చ‌ర్చ సాగుతోంది. ప్రస్తుతం వైసీపీ నాయ‌కులు కేవ‌లం టీడీపీ నేత‌ల‌ను మాత్రమే టార్గెట్ చేసుకుని విమ‌ర్శలు సంధిస్తున్నారు.

టీడీపీకే కౌంటర్….

చంద్రబాబు, లోకేష్ స‌హా.. య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, ఇత‌ర సీనియ‌ర్లు చేసే రాజ‌కీయ విమ‌ర్శలు, వ్యక్తిగ‌త విమ‌ర్శలకు వైసీపీ నేత‌లు ఎవ‌రో ఒక‌రు ప్రతివిమ‌ర్శలు చేస్తూ. చెక్ పెడుతున్నారు. ఇక‌, జ‌న‌సేన, బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌ల‌పై వైసీపీ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండ‌డం లేదు. అది వేరే సంగ‌తి. అదే స‌మ‌యంలో క‌మ్యూనిస్టులు చేసే విమ‌ర్శల‌ను అస్సలు ప‌ట్టించుకోవ‌డం లేదు. కానీ, టీడీపీలో ఏ నాయ‌కుడు స్పందించినా.. ఎవ‌రు ఎలాంటి విమ‌ర్శ చేసినా.. వెంట‌నే వైసీపీ నేత‌ల నుంచి రియాక్షన్ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఈ ప్రతి విమ‌ర్శల‌పై వైసీపీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రిగింది.

లోకేష్ విమర్శలపై…..

ప్రతి విమ‌ర్శలు చేయ‌డం, ప్రతి విష‌యానికీ స్పందించ‌డం.. వంటివి మానుకోవాల‌ని పార్టీ అధిష్టానం నుంచి త‌మ‌కు సూచ‌న‌లు అందాయ‌ని తాజాగా విజ‌యవాడ‌కు చెందిన ఓ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అతిగా స్పందించ‌డం కూడా వ‌ద్దని, అవ‌స‌ర‌మైన వాటిపై మాత్రమే స్పందించాల‌ని పార్టీ తాజాగా నిర్ణయించుకున్నట్టు ఆయ‌న తెలిపారు. మ‌రీ ముఖ్యంగా టీడీపీ నాయ‌కుడు, బాబు త‌న‌యుడు లోకేష్ విష‌యంలో ఇప్పటివ‌ర‌కు జరిగిపోయింది ఎలా ఉన్నప్పటికీ.. భ‌విష్య‌త్తులో మాత్రం ఆయ‌నకు స‌మాధానం ఇవ్వరాద‌ని, అన‌వ‌స‌రంగా స్పందించి లోకేష్‌ను పెద్దనాయ‌కుడిగా చూస్తున్నట్టు ఉంద‌ని పార్టీ అభిప్రాయ‌ప‌డుతున్నట్టు ఈ ఎమ్మెల్యే ఆఫ్ ది రికార్డుగా మీడియాతోనే చెప్పుకొచ్చారు.

అనవరంగా పెద్దోడ్ని చేయడమేనని….

“ఆయ‌న ప్రజా నాయ‌కుడు ఏమీ కాదు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు. పైగా ప్రజ‌ల్లోనూ సానుభూతి లేదు. అలాంటి పిల్ల నాయ‌కుడు ఏదో అంటే.. స్పందించాల్సిన అవ‌స‌రం మాకు లేద‌ని పార్టీ గ‌ట్టిగా పేర్కొంది.“ అంటూ.. లోకేష్ పేరు ఎత్తకుండానే స‌ద‌రు ఎమ్మెల్యే వ్యాఖ్యానించ‌డం వైసీపీలో తీసుకున్న తాజా నిర్ణయానికి అద్దం ప‌డుతోంది. ఏదేమైనా.. వైసీపీ నేత‌ల నిర్ణయం ఏమేర‌కు అమ‌ల్లో ఉంటుందో చూడాలి. ఎందుకంటే విజ‌య‌సాయి రెడ్డి లాంటి సీనియ‌ర్ నేత‌లేప్ర‌తి రోజు లోకేష్‌ను విమ‌ర్శించ‌డ‌మే అల‌వాటుగా పెట్టుకున్నారు.

Tags:    

Similar News