వైరల్ అవుతున్నా ఫియర్ లేదే? ఇదేం పిచ్చి…?
వైసీపీ ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. విపక్షాలు విమర్శలు చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పబ్లిసిటీ కోసం పరితపించిపోతున్నారు. అధిష్టానం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో [more]
వైసీపీ ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. విపక్షాలు విమర్శలు చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పబ్లిసిటీ కోసం పరితపించిపోతున్నారు. అధిష్టానం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో [more]
వైసీపీ ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. విపక్షాలు విమర్శలు చేస్తున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. పబ్లిసిటీ కోసం పరితపించిపోతున్నారు. అధిష్టానం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు. ఇటీవల శ్రీకాళహస్తిలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ర్యాలీ మరచిపోకముందే పక్క జిల్లాకు చెందిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే కలివేటి సంజీవయ్య పెద్ద ర్యాలీ నిర్వహించి వార్తల్లోకి ఎక్కారు. వివాదాస్పదమయ్యారు.
కరోనా సమయంలో…..
కరోనా సమయంలో కొన్ని జాగ్రత్తలు అందరం పాటించాల్సి ఉంటుంది. భౌతిక దూరం పాటించాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఈ విషయంలో ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సి ఉంటుంది. పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ కావడంతో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు ఇష్టాను సారం వ్యవహరిస్తున్నారు. సూళ్లూరు పేట శ్రీకాళహస్తికి ఆనుకునే ఉంటుంది. అందుకే ఆ గాలి సోకినట్లుంది. సూళ్లూరు పేట వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య కూడా ట్రాక్టర్లతో ర్యాలీ తీసి పబ్లిసిటీకి తాను కూడా ఏమాత్రం తీసిపోనని నిరూపించుకున్నారు.
కొందరు ఎమ్మెల్యేలే……
నెల్లూరు జిల్లాలో ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వివాదాస్పదమయ్యారు. కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చిరెడ్డి పాలెంలో ప్రజలకు నిత్యావసరాలను లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా పంపిణీ చేశారు. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీంతో ప్రసన్న కుమార్ రెడ్డి స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. నగరి ఎమ్మెల్యే రోజా ప్రారంభోత్సవానికి వచ్చి ప్రజల చేత పూలు వేయించుకన్నారు. ఇది కూడా వివాదంగా మారింది. అయితే రోజా మాత్రం తనకు తెలియకుండా జరిగిందని చెబుతున్నారు. అబద్ధపు ప్రచారం మానుకోవాలని రోజా చెబుతున్నారు. బురదజల్లడం మానుకోవాలని రోజా అంటున్నారు.
నిత్యావసరాల కోసమేనని చెబుతున్నా….
లేటెస్ట్ గా సూళ్లూరు పేట వైసీపీ ఎమ్మెల్యే సంజీవయ్య వివాదంలో ఇరుక్కున్నారు. తన నియోజకవర్గంలో వందల సంఖ్యలో ట్రాక్టర్లతో ర్యాలీ తీశారు. ఇది కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంజీవయ్య మాత్రం తాను పబ్లిసిటీ కోసం ఈ పని చేయలేదంటున్నారు. నిత్యావసరాలను తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామాలకు పంపించే ఏర్పాట్లలో భాగంగా ట్రాక్టర్లను వినియోగించామని చెప్పారు. ఏ గ్రామానికి ఆ గ్రామానికి నిత్యావసరవస్తువులు ట్రాక్టర్ లో తరలించామని చెబుతున్నారు. మొత్తం మీద వైైసీపీ నేతలు ఎంత వివరణ ఇచ్చుకున్నా పబ్లిసిటీ పిచ్చి తో ఇలా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికైనా జగన్ వీరి పిచ్చికి కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది.