ఆ ఎమ్మెల్యేలకు సొంత వ్యాపకాలే ఎక్కువా? ఏం జరుగుతోంది…?
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చాలా మంది కొత్త, యువ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వైసీపీ తరఫున పెద్దగా కష్టపడకుండానే పార్టీ అధినేత జగన్ పాదయాత్ర ఎఫెక్ట్‌తో [more]
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చాలా మంది కొత్త, యువ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వైసీపీ తరఫున పెద్దగా కష్టపడకుండానే పార్టీ అధినేత జగన్ పాదయాత్ర ఎఫెక్ట్‌తో [more]
గత ఏడాది జరిగిన ఎన్నికల్లో చాలా మంది కొత్త, యువ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. వైసీపీ తరఫున పెద్దగా కష్టపడకుండానే పార్టీ అధినేత జగన్ పాదయాత్ర ఎఫెక్ట్‌తో గెలుపుగుర్రం ఎక్కారు. అయితే, గెలిచిన తర్వాత మాత్రం తమ సొంత వ్యవ హారాలు, వ్యాపాకాలతోనే ఖుషీ చేస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే.. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గం అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టలేక పోతున్నారు. నిజానికి సీఎం జగనే నియోజకవర్గం నిధులు నియోజకవర్గానికి రూ.కోటి చొప్పున ఇస్తానని అసెంబ్లీలోనే ప్రకటించారు. అయితే, ఇప్పటి వరకు ఆ నిధులు విడుదల చేసే వీలు కలగలేదు.
అభివృద్ధి కార్కక్రమాలపై…..
అయినప్పటికీ.. సీనియర్ ఎమ్మెల్యేలు మాత్రం ఏదో ఒక రూపంలో తమ తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సేకరించారు. జగన్‌ను బతిమాలో.. సమస్యలను ఆయనకు వివరించో.. ఒకటికి పది సార్లు సీఎం పేషీ చుట్టూ తిరిగో వారు అనుకున్నది సాధించి… నియోజకవర్గంలో పనులు పూర్తి చేస్తున్నారు. ఇలాంటి వారు చాలా తక్కువగా ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం ఈ తరహా దూకుడు ప్రదర్శించలేక పోతున్నారు. వీరిలో చాలా మంది ఉన్నారు. ఏదో పైపైన ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నా నియోజకవర్గంలో స్థూలంగా అభివృద్ధి కార్యక్రమాలపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.
కోడ్… కరోనాతోనే….?
గుంటూరు జిల్లాకు చెందిన ఆరేడుగురు ఎమ్మెల్యేలు గెలిచి ఏడాది అవుతున్నా ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు కూడా చేపట్టలేదట. ఇక చిత్తూరు, ప్రకాశం, విశాఖ జిల్లాలకు చెందిన యువ ఎమ్మెల్యేలది కూడా ఇదే పరిస్థితి. ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టలేదు. పైగా నియోజకవర్గాల్లో పెద్దగా తిరిగింది కూడా లేదు. అయితే, వారు చెబుతున్న మాట.. తాము చేయాలని అనుకున్నామని, అయితే, ఇంతలోనే స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని… ఇప్పుడు కరోనా వచ్చిందని అంటున్నారు. అయితే, దీనికి ముందు మాత్రం వారు ఏం చేశారని అడిగితే.. మాత్రం.. వారు నోరు మెదపడం లేదు.
మంత్రులకూ ఇదే పరస్థితి…..
అసలు వీరి పరిస్థితే కాదు.. మంత్రుల్లో సగం మంది నియోజకవర్గాల్లోనూ చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు జరగని దుస్థితి ఉందట. కొందరు ఎమ్మెల్యేలు నిధులు రప్పించుకోవడంలో నిస్తేజంగా.. నిర్లక్ష్యంగా ఉంటుంటే కొందరు జగన్‌ను కలిసినా ఆరేడు నెలల క్రితం ఇంకా నాలుగన్నరేళ్లు ఉంది.. అప్పుడే తొందరెందుకని అన్నారని.. తీరా ఇప్పుడు స్థానిక ఎన్నికలు.. కరోనా వచ్చిందని.. ఈ ప్రభావం మరో యేడాది పాటు పడుతుందని.. అప్పటి వరకు తాము నియోజకవర్గ ప్రజలకు ఏమని చెప్పుకోవాలని ? లబోదిబో మంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీలో చాలా నియోజకవర్గాల్లో అభివృద్ధి ఇప్పటికీ ఎక్కడి గొంగళి అక్కడే ఉన్నట్లువుతోంది.