ఈ వైసీపీ ఎమ్మెల్యేలలను ఆపేదెవరు?
ఏపీ రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీకి అంతే లేదని.. కొందరు ఎమ్మెల్యేలు క్రషర్ల నుంచి ఇసుక దోపిడీ వరకు, కంకర [more]
ఏపీ రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీకి అంతే లేదని.. కొందరు ఎమ్మెల్యేలు క్రషర్ల నుంచి ఇసుక దోపిడీ వరకు, కంకర [more]
ఏపీ రాజధాని కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల దోపిడీకి అంతే లేదని.. కొందరు ఎమ్మెల్యేలు క్రషర్ల నుంచి ఇసుక దోపిడీ వరకు, కంకర నుంచి చిన్నా చితకా ఉద్యోగాల వరకు ఏవీ వదలకుండా పైసలు వసూలు చేస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. ఇక ఇళ్ల స్థలాల పంపిణీలో కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు భారీ అవినీతికి పాల్పడినట్టు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యేల అవినీతి చిట్టా చూస్తే ఇద్దరు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో క్రషర్లు వ్యాపారం భారీగా ఉంది. ఇందులో ఓ లేడీ ఎమ్మెల్యే తన మామూళ్లు తనకు ఇవ్వని క్రషర్ల యజమానులను అధికారులతో టార్గెట్ చేయిస్తున్నారట. ఇక సదరు లేడీ ఎమ్మెల్యే ఇసుక వాటాల్లో ఎంపీతోనే రగడకు దిగుతున్న పరస్థితి ఉందట.
ఇసుక దోపిడీ…..
ఇక పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లోనూ సదరు వైసీపీ ఎమ్మెల్యే భారీగా చేతివాటం చూపించేస్తున్నారని ఒక్కటే చర్చ నడుస్తోంది. ఇక బాగా వాయిస్ వినిపిస్తారని పేరున్న మరో సీనియర్ నేత చిన్నా చితకా ఉద్యోగం నుంచి చేతికి అందింది ఏదీ వదలడం లేదంటున్నారు. చిన్న ఉద్యోగాల కోసం కూడా ఆయన మనుష్యులు వసూళ్లకు దిగుతున్నారట. ఇక ఇటీవల ఆయన అక్రమ మైనింగ్‌పై సొంత పార్టీ నేతలే ఓపెన్‌గా విమర్శలు చేయడం రాష్ట్ర వ్యాప్తంగానే సంచలనంగా మారింది. ఇక మరో నేత నియోజకవర్గాన్ని ఆనుకునే కృష్ణా నది ప్రవహిస్తుంది.. దీంతో ఆయన ఇసుక దోపిడీకి అడ్డూ అదుపులేదట. ఆయన వసూలు చేస్తోన్న వాటాల్లో సంబంధిత శాఖా మంత్రికి కూడా కొంత వాటా ఉండడంతో ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందంటున్నారు.
ఇళ్ల స్థలాల సేకరణలో…..
ఇక మరో చారిత్రక ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పేదల ఇళ్ల కోసం సేకరించిన భూమికి రు. 90 లక్షల నుంచి రు. కోటి వరకు ఎకరాకు చెల్లించారు. ఇందులో ఎవరు అయితే స్థలం ఇచ్చారో వారి నుంచి నేరుగా రు. 15 లక్షలు ఎమ్మెల్యే ఖాతాలోకి వెళ్గగా రు. 2-3 లక్షల వరకు రెవెన్యూ వాళ్లకు ముడుపులు ముట్టాయంటున్నారు. ఇక జిల్లాకు మారుమూలన ఉండే మరో నియోజకవర్గ ఎమ్మెల్యే ఊరికి దూరంగా ఉన్న తన భూమికి అధికరేటు కట్టి ప్రభుత్వం నుంచి భారీగా లబ్ధి పొందడంతో పాటు చాలా సులువుగా వైట్‌మనీ చేసుకున్నారని అక్కడ వైసీపీ కార్యకర్తలే ఆయనపై రుసరుసలాడుతున్నారు.
సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు…..
ఇక ఎన్నికలకు ముందు అనూహ్యంగా ఎమ్మెల్యే సీటు దక్కించుకుని లక్‌లో గెలిచిన ఓ ఎమ్మెల్యే దోపిడీకి అసలు అడ్డే లేదంటున్నారు. నియోజకవర్గంలో మట్టి, గ్రావెల్ నుంచి అన్నింట్లోనూ దోపిడీకి పాల్పడుతుండడంతో పాటు ప్రతిపక్ష నేతల నుంచి విమర్శలు లేకుండా వారితోనూ తెలివిగ లాలూచీ పడుతున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. ఇక నగరంలో జగన్‌కు సన్నిహితుడు అన్న పేరున్న మరో నేత ( ఎమ్మెల్యే కాదు) తన దగ్గరకు వచ్చిన ఏ సెటిల్మెంట్ వదలకుండా చేస్తూ బాగానే దండుకుంటున్నారట. ఏదేమైనా వైసీపీ నేతల అవినీతి బాగోతం ఇప్పుడు జిల్లాలో పెద్ద ఎత్తున చర్చకు వస్తోంది. సొంత పార్టీ నేతలే వారి అవినీతిపై మండిపడుతున్నారు.