అక్కడికే పరిమితం..గల్లీలోకి నో ఎంట్రీనేనట

ఎవరు అధికారంలో ఉన్నా ఆ పదవిని కేవలం అలంకార ప్రాయంగానే చూస్తారు. వారిని పార్టీకి ఉపయోగించుకుందామని కూడా భావించరు. నిజానికి వారిని యూజ్ చేసుకుందామన్న ఆలోచన కూడా [more]

Update: 2020-03-27 00:30 GMT

ఎవరు అధికారంలో ఉన్నా ఆ పదవిని కేవలం అలంకార ప్రాయంగానే చూస్తారు. వారిని పార్టీకి ఉపయోగించుకుందామని కూడా భావించరు. నిజానికి వారిని యూజ్ చేసుకుందామన్న ఆలోచన కూడా అధిష్టానం చేయదు. ఏ పార్టీలోనైనా ఇదే పరిస్థితి. ఒకరకంగా చెప్పాలంటే అధికారంలో లేకుంటేనే వారికి కొంత గుర్తింపు ఉంటుంది. వారే పార్లమెంటు సభ్యులు. పార్లమెంటు సభ్యులను అధికారంలో ఉన్న పార్టీ పెద్దగా పట్టించుకోదడానికి అనేక ఉదాహరణలు కన్పిస్తాయి. కేవలం పార్లమెంటు సందర్భంగా పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టి మమ అనిపించేస్తారు.

వైసీపీలోనూ అదే…..

ఇప్పుడు వైసీపీ లో కూడా అదే జరుగుగుతుంది. వైసీపీకి 22 మంది పార్లమెంటు సభ్యులున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎంపీలను వైసీపీ ఉపయోగించుకోదు. కేవలం ఎమ్మెల్యేల పైనే అధినాయకత్వం ఆధారపడి ఉంటుంది. అలాగే పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించడానికి కూడా వీరి సేవలను హైకమాండ్ వినియోగించుకోదు. ఒక రకంగా చెప్పాలంటే వీరికి పెద్దగా పార్టీ ప్రయారిటీ ఇవ్వదు.

స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో…..

ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ అదే పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బాధ్యతను ఎమ్మెల్యే, మంత్రులను బాధ్యులను చేసిన జగన్ ఎంపీల విషయాన్ని వదిలేశారు. ఒక్కొక్క ఎంపీకి సంబంధించిన పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు న్నప్పటికీ, కనీసం మున్సిపాలిటీల విషయంలో తమను బాధ్యులను చేయాలని ఎంపీలు అంతర్గత సమావేశాల్లో కోరుతున్నారు.

భాగస్వామ్యులను చేయడం లేదని…..

నిజానికి ఇది ఒక్క వైసీపీలోనే కాదు. గతంలో టీడీపీ ఉన్నప్పుడు కూడా ఎంపీలకు పెద్దగా ప్రాధాన్యత దక్కేది కాదు. ఇప్పుడు వైసీపీలోనూ అదే పరిస్థితి. 22 మంది ఎంపీలు ఉన్నా వారిని ఎందులోనూ భాగస్వామ్యం చేయడం లేదు. ఇదే విషయాన్ని ఒకరిద్దరు ఎంపీలు బాహాటంగానే చెబుతుండటం విశేషం. తమ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో అభ్యర్థుల విషయంలోనూ తమ అభిప్రాయాలను సేకరించడం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. మొత్తం మీద ఎంపీలు కేవలం ఢిల్లీకే పరిమితం చేసేలా అధిష్టానం ఆలోచనలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News