వారికి “కరోనా” తోనే బ్రేక్ ఇచ్చారటగా?

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని వాష్ అవుట్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను పార్టీలో [more]

Update: 2020-03-29 14:30 GMT

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీని వాష్ అవుట్ చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఎమ్మెల్సీ శమంతకమణి, ఎమ్మెల్యే కరణం బలరాంలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కరణం బలరాం నేరుగా పార్టీలో చేరకపోయినా ఆయన ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఎమ్మెల్సీ శమంతకమణి మాత్రం నేరుగా పార్టీ కండువా కప్పేసుకున్నారు. శాసనమండలి రద్దు అవుతుందన్న కారణంగానే జగన్ ఎమ్మెల్సీలను రాజీనామాలు చేయకుండానే పార్టీలో చేర్చుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

స్థానిక సంస్థల వాయిదాతో….

అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయి. మే నెల వరకూ జరిగే అవకాశాలు లేవు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముంది. మరికొందరు లైన్ లో ఉన్నారి వైసీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. టీడీపీకి చెందిన దాదాపు పదిహేను మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని వైసీపీ నేతలు ఇటీవల బహిరంగంగా ప్రకటించారు. వారంతా విడతల వారీగా పార్టీలోకి వస్తారని, ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారని చెప్పారు.

మరోవైపు కరోనా….

కానీ కరోనా వైరస్ కారణంగా చేరికలకు బ్రేక్ పడినట్లయింది. ఉత్తారంధ్ర, ప్రకాశం, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాలకు చెందిన కొందరు నేతలు వైసీపీ కేంద్రకార్యాలయానికి వచ్చి జగన్ సమక్షంలో చేరాలని రెడీ అయిపోయారు. అయితే ఇందుకు పార్టీ కేంద్ర నాయకత్వం అంగీకరించలేదు. ఇప్పట్లో చేరికలు లేవని స్పష్టం చేసినట్లు తెలిసిింది. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

చేరికలకు స్మాల్ బ్రేక్….

ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన ఒక టీడీపీ నేత పార్టీలో చేరేందుకు రెండు రోజుల క్రితం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారని తెలిసింది. అయితే ఆయనకు కార్యాలయం నుంచి ఇప్పుడు కాదు అన్న మెసేజ్ రావడంతో వెనుదిరిగి వెళ్లిపోయారని తెలుస్తోంది. కరోనా వైరస్ తగ్గిన తర్వాతనే తిరిగి పార్టీ చేరికలు ఉంటాయిని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాకుచెందిన టీడీపీ నేత ఒకరు పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయినా పార్టీ అధిష్టానం నుంచి నో చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కరోనా వైరస్ కారణంగా చేరికలకు వైసీపీ హైకమాండ్ బ్రేక్ ఇచ్చారు.

Tags:    

Similar News