జగన్ కు ఇన్ డైరెక్ట్ వార్నింగ్ అనుకోవచ్చా?
వైసీపీలో కలవరం రేగుతోంది. అది అలాంటి ఇలాంటిది కాదు, పార్టీకి గట్టి షాట్ లాంటి ఇబ్బందేనంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ కి రివర్స్ ట్వీట్ చేస్తూ [more]
వైసీపీలో కలవరం రేగుతోంది. అది అలాంటి ఇలాంటిది కాదు, పార్టీకి గట్టి షాట్ లాంటి ఇబ్బందేనంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ కి రివర్స్ ట్వీట్ చేస్తూ [more]
వైసీపీలో కలవరం రేగుతోంది. అది అలాంటి ఇలాంటిది కాదు, పార్టీకి గట్టి షాట్ లాంటి ఇబ్బందేనంటున్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ కి రివర్స్ ట్వీట్ చేస్తూ బీజేపీ ఏపీ ఇంచార్జి సునీల్ డియోడర్ గట్టిగా కౌంటర్ ఇచ్చేసారు. ఏపీలో ఆకర్ష్ మంత్రను మొదలెట్టేశామన్నదే ఆ కౌంటర్ లోని మ్యాటర్. పక్కా క్లారిటీగానే ఈ సందేశం సునీల్ వినిపించారు. మాకు పసుపు రంగు ఒక్కటే కాదు, అన్ని రంగులూ ఇష్టమేనని కూడా చెప్పేశారు. దీని భావమేమి జగదీశా అనుకుంటున్నారుట ఇపుడు వైసీపీ నేతలు. ఏపీలో గత కొంతకాలంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూసుకున్నా కయ్యానికి కాలు దువ్వి అనర్హత పిటిషన్ దాకా కధ నడిపించిన నర్సాపురం ఎంపీ తీరు చూసినా కూడా వైసీపీలో కొత్త డౌట్లు పుట్టుకువస్తున్నాయిట.
బలం అలా …..
ఏపీలో బీజేపీకి బలం ఎలా వస్తుంది. ఆ మాటకు వస్తే అసలు కమలం పువ్వు గుర్తు కూడా తెలియని ఈశాన్య రాష్ట్రాల్లో బలం ఎలా వచ్చింది. ఎలా అంటే ఆకర్ష్ మంత్రం వల్లనే. అక్కడ ఉన్న వేరే పార్టీల నాయకులను గుత్తమొత్తంగా తమ వైపు లాక్కోవడమే. దీన్నే రాక్షస రాజకీయం అంటారు. అవునూ.. బీజేపీ దేవుళ్లను పూజిస్తుంది. గుళ్ళూ, గోపురాల కధలు చెబుతుంది మరిదేం రాజకీయం అంటే అంతే మరి. ఆ పార్టీ వరిష్ట నేత, దివంగతుడైన అటల్ బిహారీ వాజ్ పేయి అప్పట్లో ఒక మాట అనేవారు. రాజకీయమనే ఆటలోకి దిగాక అవతల వాడి ఎత్తులకు పై ఎత్తులు వేయాలంటే సరిగ్గా అవే పట్లు వాడేయాలి అంత తప్ప మనం పధ్ధతిగా ఆట ఆడదామంటే కుదరదు అని. అది ఆనాటి రాజకీయాల మీద వాజ్ పేయి మాట. కానీ ఆయన్ని మించేసిన ద్వయం మోడీ, అమిత్ షాలది, వారు ఫక్త్ పొలిటికల్ మాస్టర్లు. అందువల్ల బీజేపీకి ఏపీలో బలం తేవడం అంటే ఎలాగో వారికి బాగా తెలుసు.
టచ్ లోనేనా ?
ఇక విషయానికి వస్తే ఏపీలో ఒక్క రఘురామరాజు మాత్రమే కాదు, అనేక మంది వైసీపీ ఎంపీలు బీజేపీకి టచ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. వైసీపీకి అధిక బరువుగా ఎమ్మెల్యేలతో పాటు, ఎంపీలు కూడా ఉన్నారు. వారికి చేతిలో పని లేదు. చలాయించేందుకు అధికారం లేదు. దాంతో చాలా మంది సైలెంట్ గా ఉంటున్నారు. నియోజకవర్గాలకు వస్తే ఎమ్మెల్యేలది హవా. ఇక పార్టీ కూడా పెద్దగా పట్టించుకోవడంలేదు. పేరుకు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నా కూడా వారికి అచ్చమైన పవర్ మాత్రం లేదు. పైగా అధినాయకత్వం ఆంక్షలతో బయటకు ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. ఫ్యాన్ నీడన ఉన్నా కూడా ఉక్కబోతతో వారు సతమతమవున్నారుట. మరి వీరంతా బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు.
లాగేస్తారా…?
ఇక ఏపీలో బీజేపీ రాజకీయం స్టార్ట్ అయింది అంటున్నారు. ఇపుడు టీడీపీలో సరుకు ఏమీలేదు, ఉన్నదంతా వైసీపీ వైపే ఉంది. 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాంతో వారిలో గూడు కట్టుకున్న అసంతృప్తిని తుడిచేసి తమ వైపు తిప్పుకుంటే ఏపీలో బలం ఒక్కసారిగా వచ్చేస్తుందని వ్యూహ రచన చేస్తున్నారుట. మరి ఇలాంటి ముచ్చట్లే ఈ మధ్య విశాఖ టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి చెప్పుకొచ్చారు. వైసీపీకి వెన్నుపోటు అన్నట్లుగానే హరి మాటలు ఉన్నాయి. అయితే అదంతా సులువా అన్నది పక్కన పెడితే ప్రయత్నం మాత్రం జరుగుతోందన్నది తెలిసిపోతోంది. దానికి తోడు అన్నట్లుగా సునీల్ డియోడర్ మాటలు కూడా ఉన్నాయి. దాంతో వైసీపీలో ఇపుడు కొత్త కలవరం మొదలైంది. మరి జగన్ జర జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందేనేమో.