పరువు గంగలో కలుపుతున్నారే…? వైసీపీలో హాట్ టాపిక్

వైసీపీలో ఒక‌రిద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంద‌రు ప‌దవుల‌పై వ్యామోహంతో సీఎం జ‌గ‌న్ దృష్టిలో ప‌డాల‌ని ప్రయ‌త్నిస్తున్నార‌ని, మ‌రికొంద‌రు త‌మ హ‌వా నిలుపుకొనేందుకు [more]

Update: 2020-04-01 13:30 GMT

వైసీపీలో ఒక‌రిద్దరు ఎమ్మెల్యేలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంద‌రు ప‌దవుల‌పై వ్యామోహంతో సీఎం జ‌గ‌న్ దృష్టిలో ప‌డాల‌ని ప్రయ‌త్నిస్తున్నార‌ని, మ‌రికొంద‌రు త‌మ హ‌వా నిలుపుకొనేందుకు ప్రయ‌త్నిస్తున్నార‌ని అంటున్నారు. ముఖ్యంగా రాజ‌ధాని ప్రాంతానికి చెందిన ఈ ఇద్దరు మ‌హిళా ఎమ్మెల్యేలు కూడా ప‌ద‌వుల వేట‌లో ముందుకు సాగుతున్నారు. త్వర‌లోనే రాష్ట్రంలో మంత్రివ‌ర్గ విస్తర‌ణ ఉండ‌డంతో రాజ‌ధాని ఏరియాకు చెందిన ఇద్దరు మ‌హిళా ఎమ్మెల్యేలు కూడా ఈ ప‌ద‌వుల‌పై క‌న్నేశారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో ఇత‌ర జిల్లాల‌కు చెందిన మ‌రో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా ఈ ప‌ద‌వుల‌పై క‌న్నేశారు.

జగన్ దృష్టిలో పడేందుకు…?

దీంతో వారు జ‌గ‌న్ దృష్టిలో ప‌డేందుకు నానా హంగామా చేస్తున్నార‌ని అంటున్నారు. స‌మీక్షల పేరుతో అధికారుల‌ను త‌మ ఇళ్లకే పిల‌వ‌డం, వారిని వెయిట్ చేయించ‌డం, దీనిని పెద్ద ఎత్తున సోష‌ల్ సైట్లలో వ‌చ్చేలా క‌వ‌రింగ్ ఇవ్వడం వంటివి ఇటీవ‌ల కాలంలో ఓ ఎమ్మెల్యే చేస్తున్నార‌నే ప్రచారం జ‌రుగుతోంది. ఇక‌, మ‌రో మ‌హిళా ఎమ్మెల్యే సీనియ‌ర్లను ప‌క్కన పెట్టి అన్నీతానే అయి వ్యవ‌హ‌రించ‌డం, ఎంపీల‌తోనూ ర‌గ‌డ‌కు దిగడం వంటివి వివాదానికి దారితీస్తున్నాయి. ఇప్పటికే త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌ని చెప్పుకుంటోన్న స‌ద‌రు మ‌హిళా ఎమ్మెల్యే మంత్రి ప‌ద‌వి రాకుండానే మంత్రిని మించిన రేంజ్ లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నార‌న్న టాక్ వ‌చ్చేసింది.

పార్టీకి ఇబ్బందిగా మారి….

ఇక మ‌రో ఎమ్మెల్యే అటు నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్పటికే లంచావ‌తారిణిగా మారిపోయార‌న్న విమ‌ర్శలు ఉన్నాయి. ఆమెకు సైతం జిల్లాకే చెందిన ఎంపీతో ప‌డ‌డం లేదు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరి పేర్లు మార్మోగుతున్నాయి. ఈ ప‌రిణామాల‌తో అస‌లు వీరు ఏం చేస్తున్నార‌నే విష‌యం చ‌ర్చకుదారితీస్తోంది. మంత్రి ప‌ద‌వి సంగ‌తి దేవుడు ఎరుగు… అస‌లు వీరు పార్టీ ప‌రువు తీసేస్తున్నార‌ని జిల్లా వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇక‌, పురుష ఎమ్మెల్యేల విష‌యానికి వ‌స్తే.. కొంద‌రు దూకుడుగా ఉండి జ‌గ‌న్ దృష్టిలో ప‌డేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొందరు అతి చేస్తూ…..

మ‌రికొంద‌రు మాత్రం సైలెంట్‌గా ఉండి త‌మ ప‌నితాము చేస్తున్నారు. ఈ రెండు వ‌ర్గాల్లోనూ వివాదం సాగుతూనే ఉంది. నెల్లూరు, అనంత‌పురం లాంటి జిల్లాల్లో ఈ కోల్డ్ వార్ చాలా ఎక్కువుగా ఉంది. క‌ర్నూలులోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. చాలా మంది ఎమ్మెల్యేలు అతిగా స్పందించ‌డం లేదంటే.. పూర్తిగా మౌనం పాటించ‌డం అనే రెండు విషయాల్లోనూ పార్టీ తీవ్రంగా న‌ష్టపోతోంద‌నేది దిగువ శ్రేణి నేత‌ల వాద‌న. మొత్తంగా చూస్తే.. వైసీపీలో ఎమ్మెల్యేల వైఖ‌రి తీవ్ర వివాదాస్పదంగా మారుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కొంద‌రు జ‌గ‌న్ క‌నుస‌న్న ల్లో ఉంటే.. మ‌రికొంద‌రు అతి చేస్తున్నార‌ని, ప‌ద‌వుల‌పై వ్యామోహంతో వ్యవ‌హ‌రిస్తున్నార‌ని అంటున్నారు.

Tags:    

Similar News