గందరగోళం.. ఎవరికి లాభం ?

అదేంటో ఏపీలో ఎపుడూ గందరగోళమే. హడావుడే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు కూడా ఎవరూ ఏమీ సర్దుకోకుండానే మొదటి విడతలోనే కేంద్ర ఎన్నికల సంఘం పెట్టేసింది. [more]

Update: 2020-03-08 12:30 GMT

అదేంటో ఏపీలో ఎపుడూ గందరగోళమే. హడావుడే. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు కూడా ఎవరూ ఏమీ సర్దుకోకుండానే మొదటి విడతలోనే కేంద్ర ఎన్నికల సంఘం పెట్టేసింది. దాంతో అధికారంలో ఉన్న టీడీపీ, విపక్షంలో ఉన్న వైసీపీ సహా అంతా డేట్లు చూసి షాక్ తిన్నారు. అయితే జగన్ కి పాదయాత్ర చేసిన నేపధ్యంలో బాగా ఎడ్జి ఉండడం, అధికార టీడీపీ అన్ని అస్త్రాలను సరిగ్గా ఉపయోగించుకోకపోవడంతో పాటు, అప్పటికే జనాలు ఒక డెసిషన్ కి రావడంతో వైసీపీకి బంపర్ విక్టరీ దొరికింది.

రెడీ గా లేరా…?

ఇపుడు వైసీపీ అధికారంలో ఉంది. తొమ్మిది నెలల పాలనలో మంచి పనులే ఎక్కువగా చేసినా ప్రచారం చేసుకోలేకపోవడంతో పాటు, మూడు రాజధానులు వంటి కొన్ని వివాదాస్పద నిర్ణయాలు మాత్రం విపక్ష తెలుగుదేశం బాగా జనంలోకి పంపించగలిగింది. ఇక ఏపీలో వైసీపీ ఒకవైపు, మొత్తం విపక్షాలు వేరొకవైపుగా అన్నట్లుగా సీన్ ఉంది. అయితే విపక్షాల్లో కూడా గందరగోళం ఉంది. వారు కూడా హఠాత్తుగా ఈ ఎన్నికలను ఊహించలేకపోయారు. దాంతో రెడీగా లేరని అధినేతల స్టేట్ మెంట్లను బట్టే అర్ధమవుతోంది.

ఇటూ నిర్వేదమే….

వైసీపీలో చూస్తే అధికారంలో ఉన్నామన్న సంతోషం జెండా మోసిన కార్యకర్తలో లేదు. జగన్ తనకు తోచిన తీరుగా పాలన చేసుకుపోతున్నాడు. ఆయన ఎవరినీ కలుపుకుని పోవడం లేదని అంటున్నారు. అయితే ఆయన జనం నాడి పట్టుకుని వెళ్తున్నాడు అని కూడా అంటున్నారు. అది అసెంబ్లీ ఎన్నికల్లో రుజువై బాగా లాభం కలిగింది. ఇపుడు కూడా జగన్ కేవలం తన మేనియాతోనే బండి లాగితే వైసీపీ గత ఏడాది బంపర్ విక్టరీ మ్యాజిక్ ని రిపీట్ చేయగలుగుతుంది. అయితే దీనికి క్యాడర్ కూడా సహకరించాలి. మరి వారికి అధికారంలోకి వచ్చామన్న నమ్మకం ఇంకా కలగలేదు. మరి వారిని ఎలా దగ్గరకు తీసుకుంటారన్న దాని మీదనే వైసీపీ విజయం ఆధారపడిఉంది.

బండ గుర్తుగా….

లోకల్ బాడీ ఎన్నికల్లో ఎపుడో కానీ ఫలితాలు అధికార పార్టీకి తేడా కొట్టవ్. ఎందుకంటే జనం కూడా వివేచనతో ఓటు వేస్తారు. ఇపుడు వైసీపీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. పైగా నాలుగేళ్ళ కాలం ఉంది. అంటే వైసీపీతోనే పనులన్నీ సాగాలి. ఈ ఇంగితం ఓటర్లకు, పోటీ చేసిన చోటా నాయకులకు కూడా ఉంది. పైగా విపక్షాలు రెడీగా లేకపోవడం, బలంగా మోహరించకపోవడం, అధికారం చేతిలో ఉండడం, పోలింగుకు, ప్రచారానికి తక్కువ సమయం ఇవన్నీ కూడా వైసీపీకు ఉపయోగపడతాయి. దాంతో బండగా వైసీపీకే జనం ఓటేసినా ఆశ్చర్యపోనవసరంలేదంటున్నారు. అదే ఇపుడు విపక్ష టీడీపీని కలవరపెడుతోందిట.

Tags:    

Similar News