జీరో స్థాయికి వచ్చేంతవరకూ జీవోలు రావటగా
విశాఖ రాజధాని అన్నారు. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం అన్నీ జరిగిపోతాయని కూడా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇపుడు సీన్ చూస్తే మొత్తం రివర్స్ లో [more]
విశాఖ రాజధాని అన్నారు. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం అన్నీ జరిగిపోతాయని కూడా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇపుడు సీన్ చూస్తే మొత్తం రివర్స్ లో [more]
విశాఖ రాజధాని అన్నారు. ముహూర్తాలు కూడా పెట్టేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం అన్నీ జరిగిపోతాయని కూడా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. ఇపుడు సీన్ చూస్తే మొత్తం రివర్స్ లో ఉంది. ఎక్కడో పెద్ద తేడాయే కొట్టేసింది. మొత్తం మీద చూసుకుంటే ఈ ఏడాదికి విశాఖ రాజధాని షిఫ్టింగ్ ఉండదని కచ్చితంగా చెప్పేయొచ్చేమో. జరుగుతున్న పరిణామాలన్నీ అదే నిజం అని చెబుతున్నాయి. కరోనా వైరస్ రూపంలో మహమ్మారి వచ్చి మొత్తానికి మొత్తం కధ మార్చేసిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇపుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ కేసులు జీరో స్థాయికి వచ్చేంతవరకూ రెండవ పని లేదన్నది అందరికీ తెలిసిందే. అది ఎపుడు అంటే ఎవరికి తెలుసు, అంతా అయోమయమే .
జూన్ వరకూనా …?
ఇపుడున్న పరిస్థితిని చూస్తూంటే జూన్ వరకూ లాక్ డౌన్ కానీ, ఆంక్షలు కానీ కొనసాగేట్టుంది. రోజురోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలోని ప్రధాన రాష్ట్రలతో ఏపీ పోటీ జోరుగానే పడుతోంది. కరోనా కేసులు ఒక్కసారిగా వందల్లోకి వచ్చేశాయి. ప్రతీ రోజూ కనీసం యాబైకి తక్కువ లేకుండా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా నెమ్మదిగా మొదలయ్యాయి. ఈ పరిస్థితులను అంచనా వేసుకుంటే మాత్రం జూన్ వరకూ ఎక్కడికక్కడ అంతా నిలిచేలాగానే ఉంది. దాంతో ఎవరూ ఎటూ కదిలేది కూడా లేదు.
అదే జరిగితే..?
ఇక జూన్, జూలై నాటికి కరోనా వైరస్ ఉధ్రుతం తగ్గి సాధారణ పరిస్థితులు వస్తాయని అనుకున్నా కూడా అపుడు కొత్త విద్యాసంవత్సరం మొదలవుతుంది. అంటే ఉద్యోగుల బదిలీలు ఈ ఏడాది ఇక లేనట్లే. వారు ఉన్న చోటే ఉంటారు. దాంతో యధాప్రకారం అమరావతి నుంచే సచివాలయం ఆపరేట్ చేయాల్సిఉంటుంది. అంటే అధికార వికేంద్రీకరణ అన్నది 2020లో చూడలేమని కూడా వైసీపీ నేతలే నిరాశగా నిజం చెప్పేస్తున్నారు.
సాధ్యమేనా..?
ఇక వర్తమాన రాజకీయాల్లో ఒక్క రోజు వాయిదా పడితే మొత్తం పరిణామాలు చకచకా మారుతాయి. అలాంటిది ఏకంగా ఏడాది కాలం మూడు రాజధానుల ప్రతిపాదనలు ఆగిపోతే ఇక ఏమైనా ఉందా. మొత్తం కధ మొదటికి తెచ్చేయడానికి తెలుగుదేశం చాలదా. ఈ డౌట్లు కూడా వైసీపీ పెద్దల్లో ఇపుడు ఉన్నాయి. పైగా రాజకీయ గండర గండడు చంద్రబాబు అటు వైపు ఉన్నారు. ఆయన అనూహ్యంగా శాసనమండలిలో చైర్మన్ షరీఫ్ చేత విచక్షణాధికారం ఉపయోగించి మరీ అధికార వికేంద్రీకరణ బిల్లు వాయిదా వేయించగలిగారు. లేకపోతే ఇప్పటికే విశాఖకు రాజధాని వచ్చేదని అంటున్నారు.
చికాకులు పెరుగుతున్నాయి….
ఇపుడు మరో వైపు కోర్టులు కూడా వైసీపీ ప్రభుత్వ జీవోలు వరసగా కొట్టేస్తున్నాయి. దానికి కర్నూల్లో విజిలెన్స్ విభాగాల తరలింపు ఉత్తర్వుని కొట్టేయడాన్ని వైసీపీ నేతలే ఉదహరిస్తున్నారు. ఇక ఈ ఏడాది అంతా టైం ఉంటే టీడీపీ కొత్త ప్లాన్స్ ఎన్ని వేస్తుందో. మరో వైపు శాసనమండలి రద్దు కాలేదు. దాంతో అక్కడ చికాకులు అలాగే ఉన్నాయి. ఏది చూసుకున్నా కూడా వైసీపీకి ఇప్పటికైతే విశాఖ రాజధాని కధకు రాం రాం చెప్పాల్సిన అనివార్యత వచ్చిందని అంటున్నారు.