" దెబ్బలు తినడానికి అయినా సిద్ధమే , జైలుకి పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను .. ప్రజల కోసం దేనికైనా సిద్దం "
ఇవీ పవన్ కళ్యాణ్ ఇవాళ ఉత్తరాంధ్ర లో ఆవేశంగా మాట్లాడిన మాటలు. DCI ఉద్యోగుల ప్రైవేటీ కరణ తో పాటు అనేక విషయాలకి సంబంధించి ఉత్తరాంధ్ర పర్యటన చేస్తున్నారు జనసేనాని.
ఒక పక్క పార్టీ వారితో సమాయత్తం అవుతూనే మరొక పక్క ప్రజలలోకి వెళ్ళే ప్రోగ్రాం పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అంతా బాగానే ఉంది కానీ, పవర్ స్టార్ సడన్ గా రాజకీయ రంగం లోకి దూకడం వెనక అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
మొదటి ప్రశ్న: తన కొత్త సినిమా అజ్ఞాత వాసి షూటింగ్ బొటాబొటిన హడావిడి గా పూర్తి చేసి మూడు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన పెట్టుకోవడం, అది కూడా జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర - ప్రజా సంకల్ప యాత్ర కి సూపర్ రెస్పాన్స్ వస్తున్న అదే టైం లో పెట్టుకోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
రెండో ప్రశ్న: అప్పుడప్పుడూ పవన్ ని హై లైట్ చేసి సైలెంట్ అయిపోయే అలవాటు ఉన్న ఒక వర్గానికి ఎక్కువగా మద్దతిచ్చే మీడియా, పవన్ ని ఇవాళ ఆకాశానికి ఎత్తేస్తోంది. పవన్ కళ్యాణ్ మీద మినిట్ టూ మినిట్ అప్డేట్ లు పట్టుకోస్తోంది ఈ మీడియా.
మరొక పక్క అన్నిటికంటే పెద్ద ప్రశ్న ఏంటంటే 108 అంబులెన్స్ సమస్యలూ , కృష్ణా నది లో అనేకమంది చనిపోయిన (వారాల క్రితం) వ్యవహారాలు ఉండగా ఇప్పుడు పవన్ సడన్ గా ఈ DCI ఉద్యోగులకి సపోర్ట్ ఇవ్వడం, అందునా కేంద్రానికి వ్యతిరేకమైన వ్యవహారం మీద మాత్రమే తన దమ్ము చూపించడం .
ఇవన్నీ చూస్తుంటే చంద్రబాబు చేతిలో పవన్ కీలుబొమ్మ అంటూ కొందరు అనే మాటలు నిజమేనేమో అనాలి అనిపిస్తోంది. పోలవరం, కాపు రిజర్వేషన్ ల అంశం, జగన్ యాత్ర ఇవన్నీ కవర్ చెయ్యడం కోసం - జనం అన్నీ మర్చిపోయేలా చెయ్యడం కోసమే చంద్రబాబు పవన్ ని దింపారా ?