జనసేన గురించి చిరువ్యాఖ్యలు అదిరాయే...!

Update: 2017-12-15 01:30 GMT

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీ రాజ‌కీయాలు ఎలా ఉండ‌నున్నాయి? ఏదిశ‌గా చంద్ర‌బాబు న‌డ‌వ‌నున్నారు. 2014 నాటి పొత్తు రాజ‌కీయాలు మ‌ళ్లీ పున‌రావృతం అవుతాయా? బీజేపీతో స్నేహాన్ని బాబు కొన‌సాగిస్తారా? లేక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో స‌రికొత్త పొత్తుకు తెర‌దీసి.. మ‌ళ్లీ పీఠం ద‌క్కించుకుంటారా? అనే అనేక ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల నాలుగు రోజుల పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఏపీలో విస్తృతంగా ప‌ర్య‌టించారు. ఈ ప‌ర్య‌ట‌న‌ల‌లో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు, మాట‌లు చంద్ర‌బాబును బ‌ల‌ప‌రుస్తున్నాయ‌నే కామెంట్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో 2019లో చంద్ర‌బాబుతో ప‌వ‌న్ పొత్తు ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయానికి వ‌చ్చారు. ఇప్పుడు ఇదే యాంగిల్‌లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు, ప‌వ‌న్ సోద‌రుడు చిరంజీవి కూడా స్పందించార‌ని, ముఖ్యంగా జ‌న‌సేన‌-టీడీపీల బంధం, పొత్తుపై వ్యాఖ్య‌లు చేశార‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

జగన్ పై థ్వజమెత్తి....

నిజానికి ఏపీ టూర్‌లో రాష్ట్రంలో జ‌రుగుతున్న అవినీతి, ఇసుక మాఫియా, బెజ‌వాడ కాల్‌మ‌నీ వ్య‌వ‌హారం, పోల‌వ‌రం అవినీతి, రాజ‌ధాని నిర్మాణం వంటి అనేక విష‌యాల‌పై ఒక్క‌మాట కూడా ప‌వ‌న్ మాట్లాడ‌లేదు. దీంతో బాబుతో ప‌వ‌న్ కుమ్మ‌క్క‌య్యార‌ని పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. అదేస‌మ‌యంలో వైసీపీని తెగ ఎండ‌గ‌ట్టాడు ప‌వ‌న్‌. అవినీతి వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ కూరుకు పోయార‌ని, అందుకే తాను మ‌ద్ద‌తివ్వ‌లేద‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. ఇక‌, సీఎం అయ్యేందుకు అనుభ‌వం ఉండాల‌న్నారు. త‌న‌కు అధికారం మీద ఆశ‌లేద‌న్నారు. నిజానికి జగన్‌ పాదయాత్ర ఉంటుందని ప్రకటించిన రోజే పవన్‌ టూర్‌ షెడ్యూల్ అనౌన్స్ చేశారు. అలాగే జగన్ పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజే, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు సమన్వయకర్తల నియామక ప్రక్రియ మొదలుపెట్టాడు పవన్.

వైసీపీకి మైలేజీ రాకూడదనే...

అలాగే, పోలవరం ప్రాజెక్టును వైసీపీ బృందం పర్యటించాలనుకున్నరోజే, జనసేన అధ్యక్షుడు కూడా అనూహ్యంగా పోలవరం పర్యటనకు సిద్ధం కావడం జనసేన - టీడీపీ బంధం ఎలాంటిదో అర్ధమవుతుంది. అయితే దీనిపై వైసీపీ నేతలు మండిపడిన విషయం తెలిసిందే. ఇంతకాలం పవన్ కళ్యాణ్‌కి గుర్తుకురాని పోలవరం, అధికార టీడీపీకి ఇబ్బంది కలుగుతుంది అనగానే గుర్తుకు వచ్చిందా అని మండిపడుతున్నారు. వైసీపీకి పోలవరం విషయంలో మైలేజ్ రాకూడదనే పవన్ వస్తున్నారని, దీని వెనుక అధికార పార్టీ ప్రమేయం ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి నుంచి టీడీపీకి ఇబ్బంది వచ్చిన సమయంలోనే బయటకు వస్తున్నారని, ఇపుడు కూడా అదే వ్యూహంతో వస్తున్నారు తప్ప పోలవరం ప్రాజెక్ట్ పై చిత్తశుద్ధి లేదు అంటున్నారు. మ‌రి చిరు చేసిన వ్యాఖ్య‌ల మేర‌కే ప‌వ‌న్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌న్న కామెంట్ల‌కు బ‌లం చేకూరుతోంది. మ‌రి భ‌విష్య‌త్‌లో ఎలా ఉంటుందో చూడాలి.

Similar News