ఫ్యాక్ట్ చెక్: మొబైల్ ఫోన్స్ మెరుపులను ఆకర్షించవు.. వర్షంలో మొబైల్ ఫోన్ వాడవచ్చు..!
రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాకాలంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి మెసేజీలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మొబైల్ ఫోన్స్ ను వర్షం లోకి తీసుకొని వెళ్లకండంటూ ఓ మెసేజీ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.
క్లెయిమ్: మొబైల్ ఫోన్స్ మెరుపులను ఆకర్షించగలవా..?
ఫ్యాక్ట్ : వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాకాలంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి మెసేజీలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మొబైల్ ఫోన్స్ ను వర్షం లోకి తీసుకొని వెళ్లకండంటూ ఓ మెసేజీ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.
రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశించాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. వర్షాకాలంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తల గురించి మెసేజీలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో మొబైల్ ఫోన్స్ ను వర్షం లోకి తీసుకొని వెళ్లకండంటూ ఓ మెసేజీ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.
ఫోన్‌లు మెరుపులను ఆకర్షించగలవని వీడియో వైరల్ అవుతోంది. అందుకు సంబంధించిన సాక్ష్యమిదే అంటూ పలువురు పోస్టులు పెడుతూ ఉన్నారు. వైరల్ వీడియోలో ఒక వ్యక్తి వర్షం కురుస్తున్న వీధిలో గొడుగుతో నడుస్తున్నట్లు చూపిస్తుంది.. అతని మీదకు అకస్మాత్తుగా మెరుపు లాంటిది వస్తుంది. చిన్నపాటి పేలుడు సంభవించి.. ఆ వ్యక్తి తరువాత స్పృహ కోల్పోయి నేలపై పడి ఉన్నాడు.
వీడియోను షేర్ చేస్తున్న వారు.. "ఈ వ్యక్తి వర్షంలో నడుస్తున్నప్పుడు తన ఫోన్‌ను ఉపయోగిస్తున్నాడు, ఫోన్ సిగ్నల్‌లకు మెరుపులు ఆకర్షితమయ్యాయి. వర్షం పడుతున్నప్పుడు బహిరంగ ప్రదేశాల్లో ఫోన్‌ను ఉపయోగించవద్దు." అంటూ చెప్పుకొచ్చారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ వీడియోలో ఉన్న దావా తప్పుదారి పట్టించేదిగా ఉంది. మొబైల్ ఫోన్‌లు మెరుపులను ఆకర్షించలేవు. సెక్యూరిటీ గార్డు గొడుగును పట్టుకుని వెళుతూ ఉండగా అతడిపైకి పిడుగు పడిందని.. ఆ వీడియో గురించి మీడియా నివేదికలు పేర్కొన్నాయి.వీడియో కీఫ్రేమ్‌లను తీసుకుని రివర్స్ సెర్చ్ చేయగా.. డిసెంబర్ 28, 2021 న మిర్రర్‌లో వచ్చిన కథనానికి దారితీసింది.
ఆ వ్యక్తి సెక్యూరిటీ గార్డు అని, అతని గొడుగుకు పిడుగు తాకిందని తెలిపారు. పిడుగుపాటుకు గురై అతడు కిందకు పడిపోయాడని నివేదిక పేర్కొంది. ఆ వ్యక్తి అనూహ్యంగా ప్రాణాలతో బయటపడ్డాడని నివేదిక తెలిపింది. ఈ ఘటన ఇండోనేషియాలోని ఉత్తర జకార్తాలోని సుకపురా గ్రామంలో చోటుచేసుకుంది.
ఇండోనేషియా వార్తా వెబ్‌సైట్ 'కొంపస్'లో ఈ సంఘటనపై వచ్చిన నివేదిక కూడా సెల్ ఫోన్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకోలేదని పేర్కొంది.
మెరుపుల గురించి ఎన్నో ఏళ్లుగా రీసర్చ్ చేస్తున్న ప్రొఫెసర్ రేనాల్డో జోరో మీడియాతో మాట్లాడుతూ "సెల్ ఫోన్‌ల కారణంగా పిడుగుపాటుకు గురవ్వరు. ఎందుకంటే అవి వేర్వేరు పౌనఃపున్యాలను కలిగి ఉంటాయి."
మెరుపుల గురించి ఎన్నో ఏళ్లుగా రీసర్చ్ చేస్తున్న ప్రొఫెసర్ రేనాల్డో జోరో మీడియాతో మాట్లాడుతూ "సెల్ ఫోన్‌ల కారణంగా పిడుగుపాటుకు గురవ్వరు. ఎందుకంటే అవి వేర్వేరు పౌనఃపున్యాలను కలిగి ఉంటాయి."
మేము సెల్ ఫోన్‌లలో మెరుపు ప్రభావాల కోసం శోధించినప్పుడు, USలో వాతావరణ సూచనల కోసం అధికారిక నోడల్ ఏజెన్సీ అయిన నేషనల్ వెదర్ సర్వీస్ వెబ్‌సైట్‌లో మేము ఒక నివేదికను కనుగొన్నాము. ఆ నివేదిక దీనిని అపోహగా పేర్కొంది. పలువురు నిపుణులు కూడా ఈ కథనాలను ఫేక్ అని కొట్టేశారు.
ఈ వైరల్ పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టించేదిగా ఉందని మేము నిర్ధారించాము. సెల్ ఫోన్లు మెరుపులను ఆకర్షించవు. వీడియోలోని సంఘటన గొడుగు కారణంగా చోటు చేసుకుంది.
క్లెయిమ్: సెల్ ఫోన్లు మెరుపులను ఆకర్షించగలవు
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : This video shows how a man was struck by lightning because he was using his phone while walking in the rain.
Claimed By : Social Media Users
Fact Check : False