ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో 1632లో తాజ్ మహల్ నిర్మాణ ప్రక్రియ చూపించే నిజమైన వీడియో కాదు, ఏఐ తో రూపొందించింది
ప్రతి సంవత్సరం నవంబర్ 19 నుండి నవంబర్ 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ వేడుకలో భాగంగా
ప్రతి సంవత్సరం నవంబర్ 19 నుండి నవంబర్ 25 వరకు ప్రపంచ వారసత్వ వారోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ వేడుకలో భాగంగా, పర్యాటకులు నవంబర్ 19, 2024న తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ వంటి చారిత్రక ప్రదేశాలకు ఉచిత ప్రవేశాన్ని పొందవచ్చు. భారతీయులకు, విదేశీయులకు ఈ స్మారక కట్టడాలను సందర్శించేందుకు ఉచిత ప్రవేశం కల్పిస్తారు.
భారతదేశంలోని ఇతర చారిత్రక ప్రదేశాలతో పోలిస్తే తాజ్ మహల్ చాలా ప్రత్యేకమైంది. తాజ్ మహల్ ప్రపంచంలోని 7 అద్భుతాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఆగ్రా నగరంలో యమునా నదిఒడ్డున ఉంటుంది. దీనిని 1632లో చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం ప్రారంభించాడు. తాజ్ మహల్ నిర్మాణం దాదాపు 1653లో 32 మిలియన్ రూపాయల అంచనా వ్యయంతో పూర్తయింది. ఈ నిర్మాణంలో 20000 మందికి ఉపాధి లభించిందని చెబుతారు. ఈ నిర్మాణం చుట్టూ అనేక వాదనలు, కథనాలు ఉన్నాయి.
తాజ్ మహల్ నిర్మాణ ప్రక్రియకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌ను చూపుతున్నట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది YouTube వినియోగదారులు ఈ వీడియోను తాజ్ మహల్ నిర్మాణం కథ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోను AI ద్వారా రూపొందించారు, తాజ్ మహల్ నిర్మాణానికి సంబంధించిన నిజమైన వీడియో కాదు.
వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను శోధించినప్పుడు, వీడియో AI ద్వారా రూపొందించారని పేర్కొంటూ అనేక ప్రధాన మీడియా సంస్థలు నివేదించినట్లు తెలుస్తోంది.
నివేదికల ప్రకారం, తాజ్ మహల్ నిర్మాణం పూర్తి కావడానికి 22 సంవత్సరాలు పట్టింది. అయితే వేలాది మంది కార్మికులు పగలు, రాత్రి పనిచేసిన ఈ నిర్మాణానికి సంబంధించి AI కేవలం 54 సెకన్లలో నిర్మాణాన్ని దృశ్యమానం చేసింది. పాత రోజుల్లో ఇలాంటి అద్భుతాన్ని నిర్మించడం ఎంత కష్టమో వీడియో చూస్తే అర్థమవుతుంది.
తదుపరి శోధనలో, నవంబర్ 3, 2024న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. 'AI ద్వారా రూపొందించిన వీడియో ఆగ్రా నగరంలో తాజ్ మహల్ నిర్మాణం' అనే శీర్షికతో ఉందని గుర్తించాం. ఈ పోస్ట్ కింద కామెంట్స్ ను తనిఖీ చేసినప్పుడు, కమాండ్‌లను ఇవ్వడం ద్వారా AI ఉపయోగించి వీడియోను సృష్టించినట్లు తెలిపారు.
కానీ, Jayprints అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు భాగస్వామ్యం చేసిన మరొక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను మేము కనుగొన్నాము. ఈ వీడియో అక్టోబర్ 27, 2024న ' ‘When love shapes stone. ' అనే శీర్షికతో షేర్ చేశారు. ప్రేమకి ప్రతీక అయిన తాజ్ మహల్‌ను రూపొందించడానికి షాజహాన్ కు వేలమంది చేతులు కలిశాయి. నిర్మాణ ప్రక్రియలో సుదూర ప్రాంతాల నుండి రాళ్ళు, ఒక సమాధిని సృష్టించడానికి సంవత్సరాలుగా ప్రణాళిక వేశారు. యమునా నది ఒడ్డు నుండి, 20,000 మంది కళాకారులు మరియు 1,000 కంటే ఎక్కువ ఏనుగులు ఈ కళాఖండాన్ని రూపొందించడానికి అవిశ్రాంతంగా పనిచేశాయి. తాజ్ మహల్ పూర్తి చేయడానికి 22 సంవత్సరాలు పట్టింది, కానీ దాని అందం శతాబ్దాల పాటు కొనసాగిందని తెలిపారు.
ఈ యూజర్ బయోని తనిఖీ చేసినప్పుడు, అతను AI కళాకారుడు, అనేక ఇతర AI ద్వారా రూపొందించిన చిత్రాలు, వీడియోలను అతని Instagram ఖాతాలో అప్లోడ్ చేశాడని మేము గుర్తించాం.
అందువల్ల, వైరల్ అవుతున్న వీడియో AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించారు. ఇది నిజమైన వీడియో కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : వైరల్ వీడియో 1632లో తాజ్ మహల్ నిర్మాణ ప్రక్రియను చూపుతుంది
Claimed By : Social media users
Fact Check : False