నిజ నిర్ధరణ: #FAStagScam పేరుతో వైరల్ అవుతున్న వీడియో సారాంశం అసత్యం

కారు అద్దాన్ని తుడిచే నెపంతో ఫాస్టాగ్ ను స్కాన్ చేసి డబ్బు కాజేస్తున్నారనే వదంతిలో నిజం లేదు.

Update: 2022-06-26 17:17 GMT

ఒక అబ్బాయి కారు విండ్ షీల్డ్ తుడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనమైంది. ఆ కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి, అతని పక్కన కూర్చున్న వ్యక్తి.. ఆ పిల్లాడు తన వాచీలో ఉన్న టూల్ ద్వారా ఫాస్టాగ్ ను కొన్నిసార్లు స్కాన్ చేశాడని, ఇది ఒక కొత్తరకం స్కామ్ అని, అందువల్ల కారు ఓనర్లకు డబ్బు నష్టం కలుగుతుందని వివరించారు. ఫాస్టాగ్ వినియోగదారులు అధిక సంఖ్యలో ఉండటం వల్ల.. ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ కొత్త స్కామ్ గురించి తెలుసుకున్న వారందరూ ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఫాస్టాగ్ నిర్వహణలో భాగమైన సంస్థలు ఈ వీడియో అసత్య ప్రచారం చేస్తోందని, నిజానికి ఫాస్టాగ్ వాడకం క్షేమం, సురక్షితం అని ప్రకటించారు.



నిజ నిర్ధరణ:

ప్రచారంలో ఉన్న ఈ వీడియోను సోషల్ మీడియా వినియోగదారులు జూన్ 24, లేదా అంతకు ముందు చూశారు. ఫేస్ బుక్, ట్విట్టర్ లపై 'FAStag', 'Fastag Scam' అని వెదికినప్పుడు కనిపించిన వీడియోల వివరాలలో.. ఎక్కువ మంది #VideoCredit- Baklol Video అనే టాగ్ చేశారు.



Full View

ఈ Baklol Video (https://www.facebook.com/baklolvideo) అనేది ఒక దర్శకత్వం చేసిన వీడియోలు, ప్రాంక్ వీడియోలు పోస్ట్ చేసే ఫేస్ బుక్ పేజ్. దాని ఇంప్రెస్సంలో ఇండిపెండెంట్ ఆర్టిస్ట్, ఎంటర్ టెయినర్ అని రాసుకున్నారు. ఈ పేజ్ ఓనర్ పంకజ్ శర్మ అనే ఒక థియేటర్ యాక్టర్ (https://www.facebook.com/pankaj.love). కొందరు యాక్టర్లు స్క్రిప్ట్ ప్రకారం వేర్వేరు పాత్రల్లో నటించిన చాలా వీడియోలు ఈ పేజ్ లో ఉన్నాయి.

Full View

ఈ వైరల్ వీడియోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు, అదే కారుని నడుపుతూ మరో సందర్భంలో తీసిన వీడియోను కూడా ఈ ఫేస్ బుక్ పేజ్ లో చూడవచ్చు. కారు అద్దం తుడిచిన అబ్బాయి ధరించిన వాచీ ఎర్ర రంగు అంకెల్లో సమయాన్ని చూపటం గమనించవచ్చు. సరిగ్గా అలాంటి వాచీలే అమెజాన్.ఇన్ లో 99రూపాయలకు అభిస్తున్నాయి. (https://www.amazon.in/RPS-FASHION-DEVICE-Square-Digital/dp/B09TFMVTNK/)


మరోవైపు ఫాస్టాగ్ వినియోగదారుల ఆందోళనను గమనించిన నిర్వహణ సంస్థలలో Paytm ఫాస్టాగ్ వాడకం క్షేమం, సురక్షితం అని ప్రకటించింది. ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి ఇలా వివరణ ఇచ్చింది.

"A video is spreading misinformation about Paytm FASTag that incorrectly shows a smartwatch scanning FASTag. As per NETC guidelines, FASTag payments can be initiated only by authorised merchants, onboarded after multiple rounds of testing. Paytm FASTag is completely safe & secure."



అదే విధంగా NETC, NPCI కూడా స్పందించాయి. ఫాస్టాగ్ తో లావాదేవీలన్నీ అధీకృత టోల్ మరియు పార్కింగ్ ప్లాజా వద్ద మాత్రమే, అది కూడా అనుమతించిన ఐపీ అడ్రస్లు, యూ‌ఆర్‌ఎల్ ద్వారా మాత్రమే చేయగలరాని చెప్పాయి.



మామూలు ఇంటర్ నెట్ కనెక్షన్ తో ఎలాంటి లావాదేవీ జరపలేము, అలాగే కావలసిన అనుమతులు లేకుండా డబ్బు లావాదేవీ ఫాస్టాగ్ ద్వారా జరగదు అని అవి ప్రకటించాయి.



ఈ వివరాలన్నింటిని పరిగణన లోకి తీసుకుని, సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వీడియోను ఆధారాలు లేనిది గాను, అసత్యం గాను చెప్పవచ్చు.

Claim :  #FAStagScam పేరుతో వదంతి వ్యాప్తి చేస్తున్న వీడియో సారాంశం అసత్యం
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News