ఫ్యాక్ట్ చెక్: ఏఐ జెనరేటెడ్ వీడియోను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల పచ్చని ప్రాంతాన్ని వేలం వేయాలనే ప్రణాళికపై తెలంగాణలోని కాంగ్రెస్;

Update: 2025-04-08 11:25 GMT
ఫ్యాక్ట్ చెక్: ఏఐ జెనరేటెడ్ వీడియోను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు
  • whatsapp icon

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఆనుకుని ఉన్న 400 ఎకరాల పచ్చని ప్రాంతాన్ని వేలం వేయాలనే ప్రణాళికపై తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలువురు తమ వాయిస్ ను వినిపించారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పర్యావరణ ప్రేమికుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నిరసనల సందర్భంగా చాలా మంది విద్యార్థులను అరెస్టు చేశారు. పలు కేసులు నమోదయ్యాయి. భూమి వేలానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్న హైదరాబాద్ విశ్వవిద్యాలయ విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు.

వీటన్నిటి మధ్య వందలాది మంది బహిరంగ మైదానంలో తవ్వకాలు జరుపుతున్నట్లు ఒక వీడియో చూపిస్తుంది. తదుపరి ఫ్రేమ్‌లో, అనేక చోట్ల పొగలు వస్తున్నట్లుగా అడవిలోపలి భాగం కనిపిస్తుంది. మరో ఫ్రేమ్‌లో JCB ద్వారా తవ్వకాలు జరుగుతున్నప్పుడు జింకలు, ఏనుగులు, నెమళ్ళు వాటి ముందు పరిగెత్తుతున్నట్లు చూపిస్తుంది. కొన్ని జింకలు, నెమళ్ళు నేలపై పడ్డాయి. విద్యార్థులు “భూ కబ్జాను ఆపండి” మొదలైన బ్యానర్లతో నిరసన తెలుపుతున్నారు. పోలీసులు వారిని ఆపుతున్నారు. చివరగా “Greed Vs Green” అని ఉండడం చూడవచ్చు.


వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను చూడొచ్చు

ఫ్యాక్ట్ చెక్

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇది AI-జనరేటెడ్ వీడియో. 
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించగా "సేవ్ నేచర్" అనే శీర్షికతో అదే వీడియోను షేర్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లను మేము కనుగొన్నాము. అభివృద్ధి పేరుతో వేలాది జంతువులకు నిలయంగా ఉన్న ఏకైక అటవీ ప్రాంతాన్ని కాపాడాలి, ఇది AI-జనరేటెడ్ వీడియో ఇది నిజం కాదని ఆ పోస్టుల్లో తెలిపారు.
“Save Nature. Preying on the wildlife and the only forest cover, home to thousands of animals, in the name of development needs to stop! This video is AI-generated, and it’s not real. #savehcu #savehcubiodiversity #hcu #saveanimal #saveland #hyderabad" అంటూ పోస్టులు పెట్టారు.
వీడియోను జాగ్రత్తగా గమనించినప్పుడు, వీడియోలో చాలా వ్యత్యాసాలను మేము కనుగొన్నాము. ఉదాహరణకు, పోలీసులు పట్టుకున్న లాఠీ పదే పదే కొలతలు మారుతూ ఉంటుంది. ప్రతి సెకనుకు ప్రజల చేతులు, కాళ్ళు మారుతున్నట్లు అనిపిస్తుంది. వేర్వేరు సమయాల్లో 'పక్షులు' ఆకారాన్ని మార్చుకోవడం చూడొచ్చు. అదంతా ఒరిజినల్ గా అనిపించకపోవచ్చు. ఇక ముఖ్యంగా పరిగెడుతున్న జంతువుల కాళ్లు తేడాగా అనిపిస్తాయి. ముఖ్యంగా జింకలు అసలైనవి కావు.
వీడియోను విశ్లేషించి, AI ద్వారా రూపొందించారో లేదో నిర్ధారించడానికి మేము 'డీప్‌ఫేక్స్ అనాలిసిస్ యూనిట్‌' ను సంప్రదించాం. కీఫ్రేమ్‌లలో ఉన్న విలక్షణమైన విజువల్స్‌ను మేము ఎంచుకుని, వాటిని విశ్లేషించాము.
హైవ్ AI డిటెక్షన్ టూల్ ఉపయోగించి ఎక్స్‌ట్రాక్ట్ చేసిన కీఫ్రేమ్‌లను మేము ధృవీకరించినప్పుడు, అది ప్రతి ఫ్రేమ్‌ను విశ్లేషించి, అవి AI ద్వారా రూపొందించబడినవని నిర్ధారించింది. ఈ వేరియబుల్స్‌కు అనుగుణంగా వివిధ రంగులలో తేడాలను కూడా మనం చూడవచ్చు. వీడియో 10 నుండి 20-సెకన్ల టైమ్‌స్టాంప్‌లో వైలెట్ కర్వ్ చాలా ముఖ్యమైనదని మేము కనుగొన్నాము. "పికా", "సోరా" ఈ టైమ్‌స్టాంప్ లోపల అంతకు మించి గణనీయమైన స్కోర్‌లను కలిగి ఉంది. అంటే ఈ ప్లాట్‌ఫారమ్‌లను ఈ విజువల్స్ ప్రధాన వనరుగా పరిగణిస్తుందని సూచిస్తుంది.
అందుకు సంబంధించిన ఫలితాల స్క్రీన్‌షాట్‌లు ఇక్కడ ఉన్నాయి.

 

AI డిటెక్షన్ టూల్ ఉపయోగించి ఎక్స్‌ట్రాక్ట్ చేసిన కీఫ్రేమ్‌లను మేము తనిఖీ చేసినప్పుడు అన్ని కీఫ్రేమ్‌లు AI ద్వారా రూపొందించినవిగా కనుగొన్నాము. ఫలితాల స్క్రీన్‌షాట్‌లు ఇక్కడ ఉన్నాయి.







కాబట్టి, వైరల్ వీడియో AI జనరేటెడ్ వీడియో, నిజమైన విజువల్స్ ను చూపించదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim :  వైరల్ వీడియో తెలంగాణ ప్రభుత్వం కారణంగా హెచ్ సీ యూ సమీపంలోని భూములలో జరిగిన విధ్వంసం చూపుతోంది
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News