ఫ్యాక్ట్ చెక్: అనంత్ అంబానీ తనకు ఆదాయం ఎక్కడి నుండి వస్తోందో చెప్పి చిక్కుల్లో పడలేదు
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి 2024 జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళికి ముందు,
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి 2024 జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత జరిగిన ఈవెంట్లకు పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు వచ్చారు. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లికి సంబంధించిన విశేషాలు తెలుసుకోడానికి తెగ ఆసక్తి కనబరిచారు. వ్యాపారవేత్త అనంత్ అంబానీ భార్య రాధిక మర్చంట్ ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 10 వ్యక్తులలో ఒకరు. అనంత్‌తో జరిగిన పెళ్లి కారణంగా రాధిక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ జాబితాలో రాధిక ఎనిమిదో స్థానంలో నిలిచారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ కథనం ఓ క్లిక్‌బైట్, immediate 04 Duac అనే యాప్‌ను ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనంత్ అంబానీ అరెస్టు గురించి ప్రధాన స్రవంతి మీడియా నివేదికల కోసం మేము శోధించినప్పుడు, అలాంటి సంఘటన ఏమీ జరగలేదని మేము కనుగొన్నాము.రాహుల్ కన్వాల్ తో అనంత్ అంబానీ ఇంటర్వ్యూ కోసం వెతుకుతున్నప్పుడు, ఫిబ్రవరి 2024లో ఇండియా టుడే యూట్యూబ్ ఛానెల్‌లో 'జబ్ వి మెట్' సిరీస్ కింద ప్రసారం చేసిన వీడియో ఇంటర్వ్యూను మేము కనుగొన్నాము. ఆ ఇంటర్వ్యూలో, వారు వివిధ అంశాలపై చర్చించారు, కానీ వైరల్ పోస్ట్‌లో క్లెయిమ్ చేసినట్లు ఏమీ లేదు. ఏ యాప్ గురించిన చర్చ జరగలేదు.
వైరల్ పోస్ట్‌కు లింక్ చేసిన NDTV వార్తా కథనాన్ని గమనించిన తర్వాత, అది ప్రామాణికమైన NDTV కథనం కాదని మేము గమనించాము. పోస్ట్ URL మీద news.indiannewslive991.top అని ఉంది. ఇది ప్రామాణికమైన వార్తల వెబ్‌సైట్ కాదు. ఇది నిజంగా NDTV పేజీ కాదా అని నిర్ధారించడానికి, మేము తనిఖీ చేసినప్పుడు, హోమ్ పేజీ ఐకాన్ తో పాటు ఇతర ఐకాన్స్ ఏవీ పని చేయడం లేదని మేము గుర్తించాం.
కాబట్టి, వైరల్ పోస్ట్ క్రిప్టోకరెన్సీ యాప్‌లో వ్యక్తులను నమోదు చేయడానికి ప్రయత్నిస్తున్న క్లిక్‌బైట్ కథనానికి లింక్ చేశారు. అనంత్ అంబానీ తన అదనపు సంపద గురించి రహస్యాన్ని బయట పెట్టినందుకు ఇబ్బంది పడలేదు. అతన్ని అరెస్టు చేయలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.