ఫ్యాక్ట్ చెక్: పార్కింగ్ వివాదానికి చెందిన వీడియోను మతపరమైన కోణంతో ప్రచారం చేస్తున్నారు

బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి నెలకొంది. హిందూ మైనారిటీలపై హింస పెరిగింది. హిందువులు, ఇతర మైనారిటీలు ఇబ్బందులు

Update: 2024-12-10 05:45 GMT

Navsari Gujarat

బంగ్లాదేశ్‌లో రాజకీయ అశాంతి నెలకొంది. హిందూ మైనారిటీలపై హింస పెరిగింది. హిందువులు, ఇతర మైనారిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో అశాంతి ప్రారంభమైన తర్వాత, తప్పుడు వాదనలతో హింసకు సంబంధించిన అనేక వీడియోలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

400 నుండి 500 మంది ముస్లింలు 10 నుండి 15 దళిత హిందూ కుటుంబాలను చుట్టుముట్టి మహిళలను వేధిస్తున్నారని.. ఇది బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింస కాదని, ఈ ఘటన గుజరాత్‌లోని నవ్‌సారిలో జరిగిందని పోస్ట్ లో పేర్కొన్నారు. వీడియోలో, కొంతమంది వ్యక్తులు ఒకరితో ఒకరు వాదించుకోవడం, ఆపై కొంతమంది మహిళలు గుజరాతీ భాషలో సమస్యల గురించి మాట్లాడుకోవడం మనం చూడవచ్చు. నవ్‌సారి, గుజరాత్: 400-500 మంది ముస్లింలు 10-15 దళిత హిందూ కుటుంబాలను చుట్టుముట్టారు, మహిళలను వేధించారు. హెచ్చరిస్తున్నారని మరో పోస్టులో తెలిపారు.



ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో కనిపిస్తున్న వివాదంలో ఎలాంటి మతపరమైన కోణం లేదు.
“నవసారి వివాదం” అనే కీలక పదాలను ఉపయోగించి మేము సెర్చ్ చేసినప్పుడు, రెండు కుటుంబాల మధ్య పార్కింగ్ వివాదం పెరిగి రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు దారితీసిందని తెలిపే అనేక వార్తా కథనాలను మేము కనుగొన్నాము.
దేశ్‌ గుజరాత్ కథనం ప్రకారం, రెండు కుటుంబాల మధ్య పార్కింగ్ వివాదం రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు దారితీసింది. రాళ్లు రువ్వడంతో ఓ మహిళ కూడా గాయపడింది. ఘర్షణలో పాల్గొన్న 200 మందికి పైగా వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. దర్గా రోగ్, నవ్‌సారి సమీపంలోని అపార్ట్‌మెంట్లలో పార్కింగ్ వివాదం గ్రూపు ఘర్షణగా మారిందని ఐజి ప్రేమవీర్ సింగ్ కూడా తెలిపారు.
నవ్సారి పోలీసు సూపరింటెండెంట్ X ఖాతాలో ఈ ఘటనకు సంబంధించి ఒక ప్రకటనను పంచుకున్నారు, పుకార్లను నమ్మవద్దని, ఇతరులతో పంచుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ ప్రకటనలో “07/12/2024 న నవ్సారి నగరంలోని దర్గా రోడ్ ప్రాంతానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందని, తదనుగుణంగా తగిన ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు జిల్లా పోలీసుల నుండి నవ్సారి జిల్లా ప్రజలకు బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పుడు వార్తలు, పుకార్లు, వీడియో వైరల్ సందేశాలను సీరియస్‌గా తీసుకోవద్దని, ప్రస్తుతం జిల్లాలో శాంతిభద్రతలు నెలకొన్నాయన్నారు. తప్పుడు వీడియోలను సీరియస్‌గా తీసుకోవద్దని, వదంతులను పంచుకునే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నవ్‌సారి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సంఘ వ్యతిరేక కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచారు. దీనికి సంబంధించి సరైన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తరువాత, నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.
ఈ ఘటనలో ఓ ముస్లిం యువకుడు, మహిళపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి కొన్ని గంటల్లోనే అరెస్ట్ చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీలను పరిశీలిస్తున్నారు. అదనంగా, నినాదాలు చేసిన సుమారు 300 మంది గుంపుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనతో పోలీసులు ఆ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి పెట్రోలింగ్ నిర్వహించారు.
అందువల్ల, వైరల్ వీడియో గుజరాత్‌లోని నవ్సారిలో హిందూ దళితులపై మతపరమైన హింసకు సంబంధించింది కాదు. రెండు వర్గాల మధ్య పార్కింగ్ వివాదం కారణంగా రాళ్లదాడి జరిగింది. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim :  400 నుండి 500 మంది ముస్లింలు హిందూ కుటుంబాలను చుట్టుముట్టి మహిళలను వేధించారు
Claimed By :  Twitter users
Fact Check :  False
Tags:    

Similar News