ఫ్యాక్ట్ చెక్: సంభాల్ లో హింసను కొనసాగించడానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఆయుధాలను తీసుకుని వెళ్ళలేదు. ఈ వీడియో పాతది
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సంభాల్ ఆయుధాలను తీసుకుని వెళుతూ ఉండగా;
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంభాల్ లో మొఘల్ కాలానికి చెందిన జామా షాహి మసీదు కింద ఆలయం ఉందనే వాదన నెలకొంది. దీంతో ఆ ప్రాంతంలో సర్వే జరపాలని స్థానిక కోర్టు ఆదేశాలివ్వడంతో అక్కడ అల్లర్లు మొదలయ్యాయి. హరిహర ఆలయం ఉందని స్థానికంగా ఒక వర్గానికి చెందిన నేతలు వాదిస్తున్నారు. కొంతమంది కోర్టును ఆశ్రయించగా, సర్వే చేపట్టాలని నవంబర్ 18న ఆదేశాలు వచ్చాయి. ఆ తర్వాత రెండో దశ సర్వే కోసం నవంబర్ 24న ఆదేశాలిచ్చింది.
అయితే అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు పోలీసులు కూడా ఈ ఘటనలో గాయపడ్డారు. కర్ఫ్యూ కూడా విధించారు. ఈ అల్లర్ల కారణంగా నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో గాయపడినట్లు సమాచారం.
సంభాల్ ఘర్షణల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాలు న్యూఢిల్లీలోని తన 10 జనపథ్ నివాసంలో కలిశారు. డిసెంబర్ 4న ఢిల్లీ ఘాజీపూర్ సరిహద్దు వద్ద సంభాల్‌కు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలిద్దరినీ ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఢిల్లీలోనే బాధితుల కుటుంబ సభ్యులను కలిశారు. బాధిస్తులకు వారికి అన్ని విధాలా సహాయం అందిస్తామని చెప్పారు.
ఇంతలో "మత హింసను రెచ్చగొట్టేందుకు సంభాల్‌కు మందుగుండు సామగ్రిని తరలిస్తూ ఆర్ఎస్ఎస్ సభ్యులు పట్టుబడ్డారని
యూపీ ప్రభుత్వం అతనిపై ఎన్‌ఎస్‌ఏ ప్రయోగిస్తుందా? లేదా NSA అమాయక సిక్కులకు మాత్రమే కేటాయించబడిందా?" అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ అవుతున్న పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 2019 సంవత్సరానికి సంబంధించిన విజువల్స్ ను ఇటీవలివిగా షేర్ చేస్తున్నారు.
మేము సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల అరెస్టు గురించి తెలుసుకోడానికి ప్రయత్నించాం. అయితే సంభాల్ అల్లర్ల ఘటన చోటు చేసుకున్న తర్వాత ఆయుధాలను తరలిస్తూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అరెస్టు అయ్యారనే కథనాలు మాకు లభించలేదు.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఈ వీడియో 2019 నుండి ఆన్ లైన్ లో ఉందని గుర్తించాం.
వనస్పతి నెయ్యికి సంబంధించిన సీల్డ్ బాక్స్‌లో 26 పిస్టల్స్, 26 మ్యాగజైన్లు తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో మేము చూశాం.
వన్ ఇండియా హిందీ యూట్యూబ్ ఛానల్ లో కూడా ఇదే విషయాన్ని నివేదించారు. Ghee के boxes में डूबी दो दर्जन से अधिक Pistols बरामद, two arrest | वनइंडिया हिंदी అనే టైటిల్ తో 27 సెప్టెంబర్ 2019న వీడియోను అప్లోడ్ చేశారు. కొందరు దుండగులు నెయ్యి డబ్బాల్లో పిస్తోళ్లు అక్రమంగా తరలిస్తూ దొరికిపోయారు. పైన నిండుగా నెయ్యిని నింపి.. అడుగున పిస్తోళ్లు పెట్టారు. ఢిల్లీ పోలీసులు నిందితులను పట్టుకున్నారని కథనంలో ఉంది.

ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ ఘాజీపూర్ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసింది. ఆయుధాల సరఫరాకు సంబంధించి పోలీసులకు సమాచారం అందడంతో విచారణ చేపట్టారు. ఓ వాహనాన్ని ఆపి చూడగా అందులో పెద్ద పెద్ద నెయ్యి డబ్బాలు కనిపించాయి. అరెస్టయిన నిందితులిద్దరూ మధ్యప్రదేశ్‌లోని భింద్ వాసులని, స్పెషల్ సెల్ డీసీపీ ప్రమోద్ కుష్వాహా తెలిపిన వివరాల ప్రకారం సెప్టెంబర్ 23న మధ్యప్రదేశ్‌కు చెందిన అక్రమ ఆయుధాల సరఫరాదారు ఢిల్లీలోని ఘాజీపూర్ ప్రాంతానికి రాబోతున్నట్లు అతని బృందానికి సమాచారం అందింది. అలా వచ్చినప్పుడు పట్టుకున్నారని ndtv ఇండియా నివేదికను మేము కనుగొన్నాం.
వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదంటూ గతంలో పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు నిజ నిర్ధారణ చేశాయని మేము గుర్తించాం. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియోకు సంభాల్ లో గొడవకు ఎలాంటి సంబంధం లేదు.
Claim : ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సంభాల్ ఆయుధాలను తీసుకుని వెళుతూ ఉండగా పట్టుబడ్డారు
Claimed By : Social Media Users
Fact Check : False